పోటాపోటీగా బెలూన్ల ఏర్పాటు | Balloon Campaign On Election In Nizamabad | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా బెలూన్ల ఏర్పాటు

Nov 7 2018 2:20 PM | Updated on Mar 18 2019 7:55 PM

Balloon Campaign On Election In Nizamabad - Sakshi

 సాక్షి,బోధన్‌(నిజామాబాద్‌): అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడియ సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రచారపర్వంలో పోటీ పడుతున్నారు. బోధన్‌ నియోజక వర్గం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ ఆమేర్, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. వారం పది రోజుల నుంచి ఇరుపార్టీల నాయకులు అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో పోటా పోటీగా  ప్రచారం నిర్వహిస్తున్నారు.

ప్రచారంలో బాగంగా కెసీఆర్, ఎంపీ కవిత, కేటీఆర్, షకీల్‌ ముఖచిత్రాలు, కారుగుర్తు చిత్రాలతో కూడిన బెలూ న్‌ను బోధన్‌ మండలంలోని సాలూర గ్రామ బస్టాండ్‌లో గల ఓ ఎత్తయిన భవనంపై నాలు గు రోజుల క్రితం కట్టారు. మంగళవారం ఇదే భవనంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తమ పా ర్టీ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, హస్తం గుర్తు, పార్టీఅగ్రనేతల ముఖచిత్రాలతో కూడి బెలూన్‌ కట్టారు. అభ్యర్థులు పోటీ పడి బెలూన్‌లు కడుతున్నారు. రెండు బెలూన్‌లను తిలికిస్తున్న సాలూర, పరిసర గ్రామాల ప్రజలు ఆసక్తిగా కనబరుస్తు చర్చించుకుంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement