విద్యార్థిని అదృశ్యం | B.Tech student missing | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అదృశ్యం

Mar 13 2016 8:03 PM | Updated on Sep 3 2017 7:40 PM

ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది.

మల్కాజిగిరి : ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ కాలనీకి చెందిన ఎం.నరేందర్ కూతురు యమునా వాణి(22)  నగరంలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 13న ప్రాజెక్ట్ వర్క్ కోసం బయటకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తండ్రి నరేందర్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement