వినాయక విగ్రహానికి వినతిపత్రం | asha workers protest in adilabad district | Sakshi
Sakshi News home page

వినాయక విగ్రహానికి వినతిపత్రం

Sep 19 2015 4:36 PM | Updated on Sep 3 2017 9:38 AM

తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆశా కార్యకర్తలు శనివారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇంటి ముట్టడికి యత్నించారు.

అచ్చంపేట: తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆశా కార్యకర్తలు శనివారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇంటి ముట్టడికి యత్నించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. మరోవైపు తమ నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరుకోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఆశా కార్యకర్తలు భారీ రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో సర్కారుకు చిత్తశుద్ధిని ప్రసాదించాలని కోరుతూ తాండూరులో ఆశా కార్యకర్తలు వినాయకుడి విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement