ఏపీ సీఎం జగన్‌కు దిశ తండ్రి కృతజ్ఞతలు

AP Disha Act 2019: Disha Father Thanks To CM YS Jagan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దిశ తండ్రి, ఆమె సోదరి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో ‘దిశ’ చట్టాన్ని తీసుకు వచ్చినందుకు అభినందించారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు పడాలని దిశ తండ్రి ఆకాంక్షించారు. ఇదే తరహా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశవ‍్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, ఇందుకు ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు.

కాగా దిశ హత్యాచారం నేపథ్యంలో మహిళలపై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు సత్వరమే కఠిన శిక్ష విధించేలా  దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ దిశ చట్టాన్ని తీసుకు వచ్చింది. శుక్రవారం దిశ యాక్ట్‌ 2019కి ఏపీ శాసనసభ కూడా ఆమోద ముద్ర వేసింది.  కాగా కేంద్ర ప్రభుత్వం చట్టంప్రకారం, నిర్భయ కేసుల్లో  జైలు లేదా మరణ దండనను శిక్షగా విధిస్తుంటే... రాష్ట్రం ప్రవేశపెట్టిన చట్టం ద్వారా అత్యాచారం చేసినవారికి ఉరిశిక్షే.

ఏపీలో దిశ చట్టం తెచ్చినందుకు సినీ నటి ప్రత్యుష తల్లి సరోజని దేవి కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు.  తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో దిశ చట్టాన్ని తీసుకురావాలని ఆమె కోరారు.

చదవండి: దిశ బిల్లుకు ఆమోద ముద్ర

ప్రతిష్టాత్మక ‘దిశ’ యాక్ట్‌లోని ముఖ్యాంశాలివే.. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top