యూడీసీని నిలదీసిన అంగన్‌వాడీ కార్యకర్తలు | anganwadi workers | Sakshi
Sakshi News home page

యూడీసీని నిలదీసిన అంగన్‌వాడీ కార్యకర్తలు

Mar 26 2014 3:10 AM | Updated on Sep 2 2017 5:09 AM

స్థానిక ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో యూడీసీ మహేశ్‌ను అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం నిలదీశారు.

ముథోల్, న్యూస్‌లైన్ : స్థానిక ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో యూడీసీ మహేశ్‌ను అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం నిలదీశారు. ప్రాజెక్టు పరిధిలోని కుభీర్, భైంసా, లోకేశ్వరం, తానూర్, ముథోల్ మండలాలకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు టీఏ, డీఏ బిల్లుల విషయమై ప్రశ్నించారు.

ఏడాదిగా బిల్లులు రావడం లేదని, అంగన్‌వాడీ కేంద్రాల అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. టీడీఏ, డీఏ, కట్టెల బిల్లులు ఇవ్వాలని కోరితే పర్సంటేజీ అడుగుతున్నాడని ఆరోపించారు. ఐసీడీఎస్ పరిధిలోని 300 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు రూ.6వేల చొప్పున చెల్లిస్తే బిల్లులు చేస్తానని అంటున్నాడని పేర్కొన్నారు. నెలనెల కోడిగుడ్లు ఇవ్వడం లేదని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement