యూఎస్‌.. ప్లాన్‌ రివర్స్‌

America Decide to Go Back Online Classes Study Students - Sakshi

ఆన్‌లైన్‌ క్లాసులు అటెండ్‌ అయ్యే విద్యార్థులను స్వదేశం పంపించే నిర్ణయం

గ్రేటర్‌ పరిధిలో సుమారు 25వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

తరగతి గదుల్లో బోధనకు శ్రీకారం చుట్టాలని ఈ మెయిల్స్‌

భారంగా మారనున్న విద్యారుణాలు

సొంతగూటికి తిరిగొస్తే తిరిగి అమెరికాయానం కష్టమేనంటున్న నిపుణులు

సాక్షి, సిటీబ్యూరో: అమెరికా విద్యాలయాల్లో ఆన్‌లైన్‌ క్లాసులు హాజరవుతున్న గ్రేటర్‌ విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. సెప్టెంబరు–డిసెంబరు సెమిస్టర్‌ను ఆన్‌లైన్‌లో చదవాలనుకుంటున్న విద్యార్థులు సొంత దేశం వెళ్లాలని తాజాగా ట్రంప్‌ సర్కారు హుకుం జారీచేయడం ఈ ఆందోళనకు కారణమైంది. తాజా నిర్ణయంతో అమెరికాలో విద్యనభ్యసిస్తున్న సుమారు 25 వేల మంది విద్యార్థులకు పిడుగుపాటులా మారింది. దేశం విడిచి వెళ్లకుంటే.. క్యాంపస్‌లో తరగతులు బోధించే విద్యాలయాలకు బదిలీ కావాలని ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. తక్షణం బదిలీ కావడం కత్తిమీద సాములా మారుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆన్‌లైన్‌లో క్లాసులు హాజరయ్యే విద్యార్థులకు విదేశాంగ శాఖ సైతం వీసాలను మంజూరు చేయదని ఐసీఈ పేర్కొనడం గమనార్హం.(అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ప్రభుత్వ అండ)

వేలాది మంది విద్యార్థులపై పిడుగు..
అమెరికాలో సుమారు 12 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు 8,700 విద్యాలయాల్లో చదువుతున్నారు. వీరిలో భారతీయ విద్యార్థులు సుమారు 3.60 లక్షలమంది ఉండగా.. రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు సుమారు 60 వేలు.. అందులో హెచ్‌ఎండీఏ పరిధిలోని విద్యార్థులు సుమారు 25 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా.. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఈ విద్యార్థులు ఒకవేళ స్వస్థలాలకు తిరిగి వస్తే తిరిగి అమెరికా వెళ్లడం కష్టసాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా రాయబార కార్యాలయాల్లో అమెరికా వీసా ప్రక్రియను నిలిపివేయడం తెలిసిందే. ఇక ఆన్‌లైన్‌లో బోధించే విద్యాలయాలు పాక్షికంగానైనా తరగతి గదుల్లో బోధనకు శ్రీకారం చుడితే మన సిటీ విద్యార్థులు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.

భారంకానున్న విద్యారుణాలు..
అమెరికాలో విద్యాభ్యాసం చేసేందుకు నగరానికి చెందిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పలు వాణిజ్య, ప్రైవేటు బ్యాంకుల నుంచి తమ శక్తికి మించి రూ.25 నుంచి రూ.50 లక్షల దాకా విద్యా రుణాలు తీసుకున్నారు. వీరిలో మధ్యతరగతి వేతన జీవులే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తమ పిల్లలు సొంతగూటికి తిరిగి వస్తే వారి కోర్సులు పూర్తయినా.. అమెరికాకు తిరిగి వెళ్లడం.. అమెరికాలో ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండని కారణంగా విద్యారుణాలు తీర్చడం కష్టసాధ్యమవుతుందని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించే విద్యాలయాలు తక్షణం తరగతి గదుల్లో బోధన ప్రారంభించాలని కోరుతున్నారు. ఈమేరకు ఆయా విద్యాలయాలకు ఈమెయిల్స్‌ పంపినట్లు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ‘సాక్షి’కి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

12-08-2020
Aug 12, 2020, 10:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కరోనా మహమ్మారి, ఆర్థికసంక్షోభంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో దేశ...
12-08-2020
Aug 12, 2020, 09:56 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్యలో రికార్డు స్థాయిలో...
12-08-2020
Aug 12, 2020, 09:10 IST
వ్యాక్సిన్‌ వేసుకున్న తరువాత కరోనా వస్తే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అనుమానం వ్యకం చేస్తున్నారు. ...
12-08-2020
Aug 12, 2020, 09:08 IST
సాక్షి, సిటీబ్యూరో: గతకొంత కాలంగా సిటీజన్లకుకంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్‌క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో గ్రేటర్‌వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు....
12-08-2020
Aug 12, 2020, 09:05 IST
సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలో  కొత్తగా 1897 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్‌...
12-08-2020
Aug 12, 2020, 08:40 IST
సాక్షి, సిటీబ్యూరో: ‘పెద్దల మాట..చద్దన్నం మూట’ అన్నారు. సామెత పాతదే కావచ్చు. కానీ ఇప్పుడుకోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఇది ఒక ఆయుధంలాపనిచేస్తుంది....
12-08-2020
Aug 12, 2020, 08:29 IST
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే సదరు ఘటనలు పునరావృతం కాకుండాతగు చర్యలు...
12-08-2020
Aug 12, 2020, 08:20 IST
న్యూఢిల్లీ : కోవిడ్‌–19 నిరోధక టీకాను దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం ఎలా అన్న అంశంపై బుధవారం నిపుణుల కమిటీ భేటీ...
12-08-2020
Aug 12, 2020, 07:50 IST
గాంధీఆస్పత్రి : కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిలో బయోమెడికల్‌ (జీవ) వ్యర్థాలు రోజురోజుకూ గుట్టలుగా పేరుకుపోతున్నాయి. డంపింగ్‌యార్టుకు తరలించి...
12-08-2020
Aug 12, 2020, 06:26 IST
జీడిమెట్ల/చాదర్‌ఘాట్‌/కమ్మర్‌పల్లి: కరోనా భయంతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కరోనాతో చిక్సిత పొందుతూ ఒకరు, కరోనా సోకిందేమోనన్న భయంతో మరొకరు, టీవీలో...
12-08-2020
Aug 12, 2020, 06:18 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 6,42,875 మందికి పరీక్షలు నిర్వహించగా.. 82,647...
12-08-2020
Aug 12, 2020, 04:49 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం...
12-08-2020
Aug 12, 2020, 03:56 IST
న్యూఢిల్లీ: కలసికట్టుగా కరోనాపై పోరాటం చేద్దామని ప్రధాని  మోదీ  ముఖ్యమంత్రులకు పిలుపు నిచ్చారు. కోవిడ్‌  కేసులు అత్యధికంగా ఉన్న 10...
12-08-2020
Aug 12, 2020, 03:50 IST
మాస్కో: కరోనా వైరస్‌ నిరోధానికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన తొలిదేశంగా రష్యా రికార్డు సృష్టించినట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌...
12-08-2020
Aug 12, 2020, 03:44 IST
న్యూయార్క్‌/మాస్కో: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19 విజృంభణ ఆగడం లేదు. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటేసింది. అమెరికా,...
12-08-2020
Aug 12, 2020, 00:47 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి వ్యాప్తితో ఎదురవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని దేశంలో వైద్య సదుపాయాలను పెంచే...
11-08-2020
Aug 11, 2020, 20:20 IST
అయితే, రామ్‌గోపాల్‌ వర్మకు కరోనా సోకినందున...అఫిడవిట్‌పై సంతకం చేయలేకపోయారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
11-08-2020
Aug 11, 2020, 19:01 IST
మాస్కో: ప్రపంచ దేశాలన్ని కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను...
11-08-2020
Aug 11, 2020, 18:49 IST
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 58,315 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,024 మందికి పాజిటివ్‌గా తేలింది.
11-08-2020
Aug 11, 2020, 16:57 IST
బెర్లిన్‌: గొంతులో గరగరగా అనిపించినా.. ఇబ్బందిగా ఉన్నా వేడినీటిలో కాస్తా పసుపు వేసుకుని పుక్కిలిస్తారు మనలో చాలమంది. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top