జైలు నుంచి ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి | acb officers produce revanth reddy in court | Sakshi
Sakshi News home page

జైలు నుంచి ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి

Jun 15 2015 11:55 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సోమవారం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సోమవారం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియటంతో చర్లపల్లి జైలు నుంచి కోర్టుకు తరలించారు. ఉదయసింహా, సెబాస్టియన్ లను కూడా న్యాయస్థానంలో హాజరుపరిచారు.

మరోవైపు  ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయనుండడంతో పాటు వీడియో, ఆడియో రికార్డులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక న్యాయస్థానానికి అందనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement