రేవంత్ కస్టడీ పెంపుపై పిటిషన్ దాఖలు చేసే అవకాశం | acb move to court over revanth's custody | Sakshi
Sakshi News home page

రేవంత్ కస్టడీ పెంపుపై పిటిషన్ దాఖలు చేసే అవకాశం

Jun 8 2015 11:22 AM | Updated on Aug 17 2018 12:56 PM

రేవంత్ కస్టడీ పెంపుపై పిటిషన్ దాఖలు చేసే అవకాశం - Sakshi

రేవంత్ కస్టడీ పెంపుపై పిటిషన్ దాఖలు చేసే అవకాశం

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల ముడుపులు ఇవ్వజూపుతూ అరెస్టైన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ కస్టడీని పెంచాలని కోరుతూ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతోంది.

హైదరాబాద్:నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల ముడుపులు ఇవ్వజూపుతూ అరెస్టైన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ కస్టడీని పెంచాలని కోరుతూ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతోంది.  రేవంత్ రెడ్డి విచారణకు సహకరించని కారణంగా ఆయన కస్టడీ పెంపుపై ఏసీబీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

 

దీనిలో భాగంగానే మరో రెండు రోజులు రేవంత్ కస్టడీపై కోర్టులో పిటిషన్ దాఖలకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఆయనతో పాటు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాల కస్టడీని పెంచాలని కోరే అవకాశం ఉంది.

 

ఓటుకు నోటు కేసులో అరెస్టైన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని శనివారం ఏసీబీ అధికారులకు తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టనున్నారు.   రేవంత్‌తో పాటు నిందితులు సెబాస్టియన్  హ్యారీ, రుద్ర ఉదయ్‌సింహను నాలుగు రోజుల ఏసీబీ కస్టడీకి అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement