లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్‌ఓ | ACB Caught VRO | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్‌ఓ

Jan 7 2016 6:12 PM | Updated on Aug 17 2018 12:56 PM

బోనకల్లు మండలం తూటికుంట్లలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్‌ఓ జమ్మిశెట్టి నాగేశ్వరరావు గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

బోనకల్లు (ఖమ్మం జిల్లా): బోనకల్లు మండలం తూటికుంట్లలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్‌ఓ జమ్మిశెట్టి నాగేశ్వరరావు గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పొలానికి సంబంధించిన పాస్‌బుక్ మంజూరు చేసేందుకు వీఆర్‌ఓ నాగేశ్వరరావు రూ.4 వేలు లంచం డిమాండ్ చేయడంతో రైతు కన్నెపోగు వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వీఆర్‌ఓ నాగేశ్వరరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement