'పక్క రాష్ట్రాల వ్యవహారాల పైనే బాబు దృష్టి' | a.jeevan reddy fires on cm chandra babu naidu | Sakshi
Sakshi News home page

'పక్క రాష్ట్రాల వ్యవహారాల పైనే బాబు దృష్టి'

Jul 9 2015 3:03 PM | Updated on Jul 28 2018 6:48 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర సమస్యలు పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల వ్యవహారాల పైనే ఎక్కువ దృష్టి పెడతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర సమస్యలు పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల వ్యవహారాల పైనే ఎక్కువ దృష్టి పెడతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో అన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement