9 మంది ఎమ్మెల్సీలకు నోటీసులు | 9 more mlcs got noticed | Sakshi
Sakshi News home page

9 మంది ఎమ్మెల్సీలకు నోటీసులు

Oct 31 2014 10:11 PM | Updated on Sep 2 2017 3:39 PM

టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్సీలకు నోటీసులు అందాయి.

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్సీలకు నోటీసులు అందాయి. ఆ ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడంతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ ఎమ్మెల్సీలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం నోటీసులు జారీ చేశారు.

 

టీఆర్ఎస్ లో చేరిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మదన్ లాల్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, కనకయ్యలు నోటీసులు అందిన వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement