రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2015 డిసెంబర్ 30న 439 పోస్టుల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కింద ఇప్పటికే 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మరో 593 పోస్టుల భర్తీకి ప్రస్తుత అనుబంధ నోటిఫికేషన్ కింద మరో లక్షన్నర మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
గ్రూప్-2 దరఖాస్తుల ప్రక్రియను వాస్తవానికి శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి ప్రారంభించాలని, టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అయితే సాంకేతిక సమస్యలు లేకపోవడం, ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ సజావుగా ఉన్నట్లు అధికారులు తెలపడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణను ప్రారంభించినట్లు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.