28 మంది డీఎస్పీలకు పోస్టింగులు | 28 DSPs get New postings for Telangana state | Sakshi
Sakshi News home page

28 మంది డీఎస్పీలకు పోస్టింగులు

Jul 16 2014 2:11 AM | Updated on Sep 2 2018 5:20 PM

28 మంది డీఎస్పీలకు పోస్టింగులు - Sakshi

28 మంది డీఎస్పీలకు పోస్టింగులు

రాష్ట్రంలో 28 మంది డీఎస్పీలకు కొత్తగా పోస్టింగ్‌లిస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరందరికీ ఇన్‌స్పెక్టర్ నుంచి డీఎస్పీలుగా పదోన్నతులిచ్చారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 28 మంది డీఎస్పీలకు  కొత్తగా పోస్టింగ్‌లిస్తూ డీజీపీ  అనురాగ్‌శర్మ  మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరందరికీ  ఇన్‌స్పెక్టర్ నుంచి డీఎస్పీలుగా  పదోన్నతులిచ్చారు. అనంతరం వీరిని డీజీపీ  కార్యాలయంలో రిపోర్టు చేయమని చెప్పారు. కాగా, మంగళవారం డీజీపీ అనురాగ్‌శర్మ నేతృత్వంలోని  డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ  సమావేశమై  వీరికి కొత్తగా పోస్టింగులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో హైదరాబాద్‌లో 24 మందికి పోస్టింగులివ్వగా, మురళి మనోహర్‌కు  సీసీఎస్ మహబూబ్‌నగర్ డీఎస్పీగా, గోవర్ధన్‌కు నాగర్‌కర్నూల్ డీఎస్పీగా, షేక్ అలీకి  సంగారెడ్డి డబ్ల్యూపీఎస్‌గా, తిరుపతన్నకు సంగారెడ్డి డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement