లారీ, బైక్ ఢీ.. ఇద్దరి మృతి | 2 died in road accident at nalgonda district | Sakshi
Sakshi News home page

లారీ, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

Jan 30 2016 9:55 AM | Updated on Aug 30 2018 3:58 PM

నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణ శివారులోని రాయన్‌గూడెం వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణ శివారులోని రాయన్‌గూడెం వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై నలుగురు వ్యక్తులు టేకుమట్ల నుంచి సూర్యాపేట వైపు వెళుతుండగా ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న కల్యాణ్, మణి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఉమేష్, ఉపేందర్‌లను చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృతులు, క్షతగాత్రులు సూర్యాపేట పట్టణంలోని బర్లపెంటబజార్‌కు చెందినవారు.

Advertisement
 
Advertisement
Advertisement