బాలిక అదృశ్యం: యువకుడిపై కేసు | 14 years old girl missing | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యం: యువకుడిపై కేసు

Dec 14 2015 6:18 PM | Updated on Jul 28 2018 6:26 PM

ప్రేమ పేరుతో మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడనే ఆరోపణతో ఓ యువకుడిపై మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది.

చంచల్‌గూడ : ప్రేమ పేరుతో మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడనే ఆరోపణతో ఓ యువకుడిపై మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుర్మగూడ డివిజన్ చంద్రయ్యహట్స్‌లో నివాసముంటున్న బందయ్య, నిర్మల దంపతుల కుమార్తె(14) స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.

కాగా ఆదివారం సాయంత్రం కిరాణా షాపునకు వెళ్లిన ఆ బాలిక రాత్రయినా తిరిగిరాలేదు. అన్నిచోట్లా వెతికినా ఆచూకీ తెలియ లేదు. అయితే ఆమె అదృశ్యం వెనుక అదే ప్రాంతానికి చెందిన ఎక్ట్రీషియన్ పి.రాజేష్ అలియాజ్ బబ్లూ (27) హస్తం ఉన్నట్లు బాలిక తల్లి నిర్మల మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేష్‌పై కేసు నమోదు చేసి కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేసున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement