వికటించిన మధ్యాహ్న భోజనం | 10 students suffer food poisoning | Sakshi
Sakshi News home page

వికటించిన మధ్యాహ్న భోజనం

Sep 28 2015 4:40 PM | Updated on Oct 5 2018 6:48 PM

కలుషిత భోజనం తిని 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం ఐలాపురంలో సోమవారం జరిగింది.

చివ్వెంల (నల్లగొండ) : కలుషిత భోజనం తిని 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం ఐలాపురంలో సోమవారం జరిగింది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని 108 సాయంతో సూర్యాపేట ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement