breaking news
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update.. జుక్కల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సౌదా గర్ గంగారాం సస్పెన్షన్ కామారెడ్డి జిల్లా, జుక్కల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సౌదా గర్ గంగారాం సస్పెన్షన్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని గంగారాంను కాంగ్రెస్ పార్టీ నుండి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నా రెడ్డి రెబెల్ గా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న గంగారాం ఇవ్వాళ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన గంగారాం కేజీ టు పీజీ స్కూల్లో పలకతో రండి పట్టాతో వెళ్ళండి: కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చేరుకున్న మంత్రి కేటీఆర్. రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ భారీగా హాజరైన మండల ప్రజలు 30 తేదీన బటన్ నోక్కేటప్పుడు ఒకటే ఆలోచన చేయండి 24 గంటల కరంటు కావాలా... 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా రేపు లేదా ఎల్లుండి రైతు బందు డబ్బులు పడుతాయి, టింగు టింగు మని మేసేజులు వస్తాయి చూడండి మండలంలో ని అన్ని గ్రామాల స్కూల్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం, పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వెళ్లకుండా చేస్తాను. ఇక్కడ ఉన్న కేజీ టు పీజీ స్కూల్లో చేరి పలకతో రండి పట్టాతో వెళ్ళండి దుబ్బాక ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదు ఎన్నికలు వచ్చాయని ఆగమాగం కావొద్దు గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గమనించండి ఓటు వేసే ముందు ఆలోచించి వేయండి ప్రజలకు ఒకే ఒక్క ఆయుధం ఓటు వేసే ఓటులో తేడా వస్తే ఐదేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్లు చూపించేవారు వస్తారు.. వారి మాటలు నమ్మకండి మీరు వేసే ఓటు ఐదేళ్ల తలరాతను మారుస్తుంది ఆలోచించి ఓటు వేస్తే దేశం ముందుకు సాగుతుంది ఓటు వేసే ముందు అభ్యర్థి వెనుక పార్టీ చరిత్రను గమనించండి ఎన్నికలు వచ్చాయంటే అబద్ధాలు చెబుతుంటారు ఎంతో పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం మళ్లీ ఆగమైతే రాష్ట్రం వెనక్కిపోతుంది పదేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం రైతుబంధును తీసుకొచ్చిందే బీఆర్ఎస్ రైతులకు ఇవాళ 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం కాంగ్రెస్ నేతలు రైతుబంధు దుబారా అంటున్నారు రైతుబంధు రూ. 16వేలు చేస్తాం రైతు బీమాతో అన్నదాతలను ఆదుకున్నాం 50 ఏళ్లు మనల్ని ఇబ్బందిపెట్టిన కాంగ్రెస్ మళ్లీ అవసరమా? రైతుబంధు ఉండాలా? వద్దా? రైతుల భూములు బాధలు నాకు తెలుసు రైతుల భూముల కష్టాలు తీర్చేందుకు ధరణి తెచ్చాం రైతు పండించిన పంటను ప్రభుత్వమే కొంటోంది ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే కాంగ్రెస్ నేతలు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు ధరణి తీసేస్తామనే వారినే బంగాళాఖాతంలో వేయండి ధరణి ఉండాలా? వద్దా? భువనగిరి ఎన్నికల ప్రచార సభలో కేంద్రమంత్రి అమిత్ షా ఆచార్య వినోబాభావే భూధానోద్యమం ప్రారంభిస్తే కేసీఆర్ మాత్రం భూమి కబ్జా చేసే ఉద్యమాన్ని ప్రారంభించారు వేలకోట్ల భూములను దోచుకున్నారు బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి బీఆర్ఎస్ గ్యారేజీకి పంపిస్తాం బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే రోజు వస్తుంది కేసీఆర్ జూటా మాటలు చెప్తున్నాడు కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మార్చాలని మోదీని కేసీఆర్ఎప్పుడు కలవలేదు కేసీఆర్ ను గద్దె దించేందుకు మీరంతా సిద్ధం కావాలి కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటేసినట్లే 2018 లో కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎమ్మెల్యేలు అంతా బీఆర్ఎస్ లో చేరారు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరింది కేసీఆర్ సీఎం, రాహుల్ పీఎం కావాలని వారి ప్లాన్ బీజేపీ గెలిచిన తర్వాత బీసీని సీఎం చేస్తాం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం నిర్మల్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ తన కుటుంబం గురించే కేసీఆర్ ఆలోచిస్తున్నారు హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ ప్రజలను మోసం చేశారు పేద ప్రజలను పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపండి కేంద్ర ఇచ్చిన సంక్షే పథకాలను కేసీఆర్ అడ్డుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వం అంటే పేదలకు గ్యారెంటీ ప్రభుత్వం నా ఇల్లు కట్టకోవడానికి నేను ప్రధాని కాలేదు పేద ప్రజలకు ఇళ్లు కట్టడం కోసమే ప్రధాని అయ్యా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇళ్లు కట్టిస్తాం.. ఇది మోదీ గ్యారెంటీ పదేళ్లుగా తెలంగాణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు కాంగ్రెస్ ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటేసినట్లే బీజేపీ అధికారంలోకి వస్తేనే ధరలు తగ్గుతాయి ప్రజలను కలవని సీఎం.. సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా? ములుగులో అమిత్ షా కామెంట్స్ కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ ఆ నేతలు బీఆర్ఎస్లోకి వెళతారు పోడు భూముల సమస్య పరిష్కరించలేక బీఆర్ఎస్ వివాదం రేపుతోంది గిరిజనులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు గిరిజనులను మోసం చేయడం కాంగ్రెస్ లక్షణం కేసీఆర్‌ను గద్దె దించాలంటే బీజేపీకి ఓటేయండి తెలంగాణలో మోదీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారు అత్యధిక గిరిజన ఎంపీలు బీజేపీకి చెందినవారే ఉన్నారు సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది: దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎంతగానో కృషి చేసింది ఔటర్ రింగ్ రోడ్డుకి రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది తెలంగాణ ప్రజలకు సోనియా ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా అమలుచేస్తాం రైతుబంధు సామాన్య రైతులకు కాకుండా భూస్వాములకు ఉపయోగపడుతోంది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్.. రాముడు అందరికీ దేవుడే. కొందరు రాముడితో కూడా రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ మత రాజకీయాలు చేయదు మతాన్ని వాడుకొని రాజకీయాలు చేసే వాళ్ళకి మేం వ్యతిరేకం జగిత్యాల ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంటు ఇచ్చింది ఎవరు? ఇందిరమ్మ రాజ్యంలోనే లక్షల మందిని జైలులో పెట్టారు ఎవరికి కావాలి మీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాస్వామ్య పరిణితిపై మీరంతా ఆలోచించాలి గత కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు తేడా గమనించండి రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నారని ఉత్తమ్ చెబుతున్నారు రైతుబంధు ఉండాలా? వద్దా? రైతుబంధు రూ. 16వేలు చేస్తాం రైతుబంధు గురించి ఎవరైనా ఆలోచించారా? రైతుబంధు తెచ్చింది బీఆర్ఎస్సే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే: రాజాసింగ్ నిజామాబాద్: బీజేపీ గెలువద్ధనే కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీకి దిగారు కేసీఆర్ పెద్ద మోసగాడుబీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎమ్మెల్యేలంతా అవినీతి పరులే మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ బీజేపీ కేసీఆర్ మోసగాడు... కేటీఆర్ పెద్దమోసగాడు అసెంబ్లీ సాక్షిగా అనేక అబద్దాలు చెప్పారు బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మార్చారు ప్రభుత్వం నడిపే కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉంది కేసీఆర్, కేటీఆర్‌లు ఎంఐఎం కాళ్ళు పట్టుకునే అవసరం ఏముంది? ఓవైసి లు నడిపే దక్కన్ కాలేజీ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు హైదరాబాద్ ఓల్డ్ సిటీ మినీ పాకిస్తాన్‌గా మారింది ఓవైసి బ్రదర్స్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఒవైసి బ్రదర్స్‌ని పాకిస్తాన్ తరిమిస్తాం తూప్రాన్ ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగం కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే.. ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది ప్రజలను కలవని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? అబద్ధపు హామీలు ఇచ్చి కేసీఆర్ ప్రజలను మోసం చేశారు సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా? ఈటలకు భయపడి కేసీఆర్ మరోచోటుకు వెళ్లారు దుబ్బాక, హుజురాబాద్‌లో ట్రైలర్ చూశారు.. ఇక సినిమా చూపిస్తారు కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏవీ నెరవేర్చలేదు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు తెలంగాణకు ఇలాంటి సీఎం అవసరం లేదు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని బీజేపీ సీఎం చేస్తుంది సంగారెడ్డి ఎన్నికల ప్రచార సభలో రాహుల్ కేసీఆర్‌జీ నువ్వు కాళేశ్వరంలో ఎంత దోపిడీ చేశావో చెప్పు. ఢిల్లీలో మోదీకి బీఆర్ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్కు మోదీ పరస్పర మద్దతుంది అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం కాంగ్రెస్‌ను ఓడించడానికే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి కాంగ్రెస్‌ను ఓడగొట్టేందుకే బలం లేకపోయినా ఎంఐఎం పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది బీజేపీ, బీఆర్ఎస్ దొరల ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి అని రాహుల్ మండిపడ్డారు కాంగ్రెస్ వచ్చాక ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం నేను ప్రజా సమస్యలపై పోరాడితే కేసులు పెట్టారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే మోదీ మద్దతిస్తున్నారు కేసీఆర్ ఎంత అవినీత చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది నా ఇల్లును లాగేసుకున్నా భారత దేశమే నా ఇల్లు అనుకున్నా కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారం రాహుల్ గాంధీ వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారు గాంధీలు చుట్టపు చూపుగా ఇలా వచ్చిపోతుంటారు అండగా నిలిచిన ప్రతిసారి తెలంగాణను నిండా ముంచిన గాంధీ కుటుంబం తెలంగాణకు తీరని మోసం చేసిన గాంధీ కుటుంబం వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుంది ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ? రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా ? కాంగ్రెస్ మూడు గంటల కరెంటు కావాలా... బీఆర్ఎస్ 24 గంటల కరెంటు కావాలా ? కాంగ్రెస్ పాలనలో చూసిన దారుణమైన పరిస్థితులు కావాలా ? దారుణ పరిస్థితి మళ్లీ రావద్దంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలి ప్రభుత్వం మనమే ఏర్పాటు చేస్తున్నాం: భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడు సెంటర్లో కాంగెస్ పార్టీ మీటింగ్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్ సత్తుపల్లి శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట డాక్టర్ రాగమయి దయానంద్‌లు ప్రజా సేవ చేసిన నాయకులు కొందమంది పారిశ్రామిక వెత్తలు సంచులతో డబ్బులు వెదజల్లి బిఆరెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తుంది. గతంలో కాంగ్రెస్,తెలుగుదేశం పాలనలో మాత్రమే అభివృద్ధి జరిగింది గత పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ హయాంలో ఒక్క అభివృద్ధి జరగలేదు. పందిక్కొక్కులాగ దొపిడి చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులందరూ భారీ మెజారిటీతో గెలుపోందనున్నారు.. ప్రభుత్వం మనమే ఏర్పాటు చేస్తున్నాం. గత ఐదు సంవత్సరాలు గా రుణామాఫి చేయ్యని ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం కేసిఆర్ కి బుద్ది ఉందా.. ప్రతి రైతుకు ఎకారానికి 15000 ఇస్తాం....బోనాస్గా 500 రైతుకూలీలకు 1200౦ ఇస్తాం,ఇల్లు నిర్మానానికి ఐదు లక్షలు ఇస్తాం,పీజ్ రియాంబర్ మెంట్స్ విద్యార్ధులకు ఇస్తాం.నిరుద్యోగం లేకుండా చేస్తాం..200 యూనిట్లు ఉచితంగా ఇస్తాం. ఇది కాంగ్రెస్ ప్రభంజనం: పొంగులేటి ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడు సెంటర్లో కాంగెస్ పార్టీ మీటింగ్‌లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎలాంటి డౌట్ లేదు మూడు రంగుల జెండా రెపరెపలాడుతుంది రాగమయి గెలుపులో అందరం భాగస్వాములం కావాలి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళండి ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు మీ అందరి దీవేనలతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తున్నాం ఈ ప్రభంజనం ముందు బడా బాబులు తుడుసుకుపెట్టుకొని పోతారు బీఆర్ఎస్పై యూపీ సీఎం యోగి ఫైర్ మహబూబ్ నగర్: అందరికి నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన యోగి నేను జితేందర్‌రెడ్డి పార్లమెంటు లో కలిసి పనిచేశాం అమరవీరుల ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ ను మాఫియా మయం చేసింది మిగులు రాష్ట్రాన్నికేసీఆర్ సర్కారు అప్పులమయం చేసింది మహబూబ్ నగర్‌ను పాలమూరుగా మార్చటం కోసమే వచ్చాను యూపీలో మాఫియాను బుల్డోజర్తో అణిచివేశాం ఎంఐఎం , బీఆర్ఎస్, కాంగ్రెస్ కామన్ ఫ్రెండ్స్ 26/11 ముంబైలో ఉగ్రదాడి జరిగింది కాని ఇది నయా భారత్ దేశంలోకి చొరబడితే ఏం జరుగుతుందో ఉగ్రవాదులకు తెలుసు సర్జికల్ స్ట్రైక్‌తో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పింది మోదీ సర్కార్ కేంద్రంలో యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్నాం యూపీలో 55 లక్షల మందికి ఇళ్ళు కట్టించాం 6 ఏళ్ళలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌లో జోష్.. నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో జైరాం రమేష్ జైరాం రమేష్ కామెంట్స్.. భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్ జోష్ పెరిగింది అదే జోష్‌తో కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది తెలంగాణలోనూ విజయం సాధిస్తాం ఆశించినంతగా అభివృద్ది తెలంగాణలో జరగలేదు బీఆర్ఎస్ కేవలం హైదరాబాద్‌పైనే దృష్టి పెట్టింది. ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు వస్తాయని అనుకుంటే అదీ జరగలేదు ఉద్యోగ అవకాశాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రజా పాలన కొనసాగడం లేదు.. కుటుంబ పాలన కొనసాగుతుంది తెలంగాణ ఇచ్చింది.. ప్రజల అభివృద్ధి కోసం కానీ కేసీఆర్ ప్యామిలీ కోసం కాదు కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందింది బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు ఒక్కటే. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్, ఎంఐఎం సీ టీమ్. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కచ్చితంగా నేరవేర్చుతాం తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి. కాంగ్రెస్‌ను గెలిపించండి.. ప్రజా తెలంగాణను తిరిగి నిర్మిస్తాం ప్రజల ఆశలను నేరవేర్చుతాం తెలంగాణలో కారు టైర్ పంక్చర్ కాబోతుంది. సీఈవోకు బీఆర్ఎస్ ఫిర్యాదు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్‌ను కలిసిన బీఆర్ఎస్ లీగల్ సెల్ కొడంగల్ ఘటనలో కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు.. ఖానాపూర్ సభలో సీఎం కేసీఆర్ మంచి ఎమ్మెల్యే గెలిస్తే మంచి ప్రభుత్వం వస్తుంది రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం ఖానాపూర్ ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రం ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పార్టీల చరిత్ర చూసి ప్రజలు ఓటేయాలి పదిహనేళ్లు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఈ సారి గెలిచాక పెన్షన్ రూ.5వేల వరుకు పెంచుతాం ఆడ బిడ్డలకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అందిస్తున్నాం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల అందించాం గిరిజనులు, ఆదివాసీల కోసం వేర్వేరుగా భవనాలు నిర్మించాం అన్ని వర్గాల ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నాం ఈ సారి గెలిచాక రేషన్‌కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తాం దేశంలో రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం ఆంథోల్‌లో రాహుల్ కామెంట్స్.. కాంగ్రెస్ వచ్చాక ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ దొరల ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎంఐఎం కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది. కాంగ్రెస్‌ను ఓడిచేందుకు బలం లేకపోయినా ఎంఐఎం పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోకి బీజేపీ చూస్తూ ఊరుకుంటోంది. నేను ప్రజా సమస్యలపై పోరాడితే నాపై కేసులు పెట్టారు. నా ఇల్లును లాగేసుకున్నా భారతదేశమే నా ఇల్లు అనుకున్నా. కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ధరణితో 20 లక్షల ఎకరాల భూములు లాక్కున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలుచేస్తాం. ప్రజల స్వప్నాన్ని కేసీఆర్, మంత్రులు నాశనం చేశారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే మోదీ మద్దతుగా నిలుస్తున్నారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోని బీజేపీ చూస్తూ ఊరుకుంటుంది. లోక్‌సభలో మోదీకి బీఆర్ఎస్, తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ మద్దతిస్తారు. ప్రచారంలో మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి.. డ్యాన్స్‌తో జోష్ బొడుప్పల్లో మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఎన్నికల ప్రచారం మహిళా గర్జనలో మహిళలతో డ్యాన్స్ చేసిన ప్రీతి రెడ్డి మహిళా గర్జనలో పెద్ద ఎత్తున హాజరైన మహిళలు మహిళలతో కలిసి బోనమెత్తిన ప్రీతి రెడ్డి.. ప్రచారంలో పాటలకు డ్యాన్స్ చేసిన ప్రీతి రెడ్డి. ఆమె డ్యాన్స్‌లో స్టేప్పులు కలిపిన మహిళా కార్యకర్తలు ప్రీతి రెడ్డి కామెంట్స్.. బోడుప్పల్లో అభివృద్ధి కావాలంటే కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించండి. కాంగ్రెస్ నేతలు ఎన్ని కథలు చెప్పిన నమ్మకండి. మల్లారెడ్డి వల్లే అభివృద్ధి జరుగుతుంది. బోడుప్పల్ బిడ్డగా మీ ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. ఓ మహిళగా మీ సమస్యలు నాకు తెలుసు. మహిళల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టింది. కారు గుర్తుకు ఓటు వేసి మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి. ఈసీ నోటీసులకు బదులిస్తాను: కేటీఆర్ రైతుబంధు కొత్త స్కీమ్ కాదు.. ఇప్పటికే కొనసాగుతున్న స్కీమ్ రేవంత్ మూడు గంటలు, డీకే శివకుమార్ ఐదు గంటలు కరెంట్ అంటున్నారు. మేము 24 గంటల కరెంట్ ఇస్తామంటున్నాం. కర్ణాటక వాళ్లు ఇక్కడ ప్రచారం చేయడం ఏంటి? కాంగ్రెస్‌ను నమ్ముతాం అంటే అది వారి అవగాహనకు వదిలేస్తాం. గోషామహల్లో కూడా బీజేపీని ఓడిస్తాం. నాకు ఈసీ నోటు ఇచ్చారు. ఈసీ నోటీసులకు బదులు ఇస్తాను. మక్తల్ బీజేపీ సభలో అమిత్ షా కామెంట్స్.. పదేళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ నాశనం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదు. నిరుద్యోగులకు రూ.3వేలు భృతి ఇస్తానని కేసీఆర్ ఇవ్వలేదు. మక్తల్‌లో వంద పడకల ఆసుపత్రి ఎందుకు నిర్మించలేదు. కేసీఆర్ సర్కార్ అంటే లీకేజీ ప్రభుత్వం: బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ సీరియస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని అయితే పరీక్షలు నిర్వహించారో అన్నిట్లో లీకేజీలే. నిరుద్యోగులను మోసం కేసీఆర్ మోసం చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగంతో పాటు అన్ని ఉద్యోగాలలో పేపర్ పత్రాలు లీకేజ్ చేసిన ఘనత కేసీఆర్ సర్కార్‌దే. ఈ సందర్భంగా ప్రభుత్వం, కేసీఆర్ 420 అనే ప్రశ్నాపత్రాన్ని వెంకట్ లీక్ చేశారు. ఈ పత్రాలను ఓయూ లైబ్రరీతో పాటుగా చిక్కడపల్లి లైబ్రరీలో ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన జేపీ నడ్డా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి. కాంగ్రెస్ అంటే కమీషన్, క్రిమినలైజేషన్, కరప్షన్. దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మోదీకి ఓటు వేయండి. తెలంగాణలో బీజేపీని గెలిపించండి. దమ్మున్న నాయకుడు కేసీఆర్.. మీడియాతో మంత్రి కేటీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తి కేసీఆర్ ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారు నవంబర్ 29న బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడవారు అక్కడ దీక్షా దీవస్‌ను పాటించాలి తెలంగాణకు స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామరక్ష తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తాం ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రాజాసింగ్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలను పెట్టింది రాజాసింగ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌ను ఓడిస్తాం రైతు బంధు ఆపేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కర్ణాటక కాంగ్రెస్ నాయకులను తెలంగాణ ప్రజలు పట్టించుకోరు తెలంగాణలో కాంగ్రెస్ గెలవదు: మాజీ ఎంపీ వినోద్ కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో బోయినపల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్.. తెలంగాణలో 90 సీట్లు గెలిచి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కరీంనగర్ జిల్లాలో అన్నీ సీట్లు గెలుస్తాం. కరీంనగర్లో ట్రయాంగిల్ లేదు బీఆర్ఎస్ ఒక్కటే వస్తుంది. కాంగ్రెస్ గెలవడం అనేది తెలంగాణలో జరగదు. కాంగ్రెస్ గెలుస్తదని వెళ్తున్నారు కానీ మళ్లీ వెనకకు వస్తారు. బీజేపీ పార్టీ మత విద్వేషాలు పెంచుతుంది. తెలంగాణలో గెలిచే సత్తా మా పార్టీకి ఉంది. లేనిది ఉన్నట్టు చూపించే పార్టీ కాంగ్రెస్. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. గాలి మాటలు నమ్మి మోసపోవద్దు కాంగ్రెస్‌కు ఓటు వేసి ఆగం కావద్దు. హుజూరాబాద్‌లో ట్రయాంగిల్ ఫైట్ ఉంది. మైనార్టీలను కాంగ్రెస్ మోసం చేస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ లేఖ తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితిపై లేఖలో జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసు. ఏ ప్రభుత్వ పాలనకైనా మీరే పునాదులు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు.. మీకు జరిగిన అవమానాలు నాకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కేసీఆర్ పురుగులకంటే హీనంగా చూశారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయి. సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారు. ఊరి కోసం అప్పుచేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్లుగా చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మీ పాత్ర అత్యంత కీలకం. పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం. రేపటి నాడు మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. బీఆర్ఎస్, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు మీ వంతు పాత్ర పోషించండి. మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుంది. పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా.. వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు.. కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు.. కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి హరీశ్ కీలక వ్యాఖ్యలు.. Live Show తెలంగాణలో రాహుల్ గాంధీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కర్ణాటక మాదిరిగా తెలంగాణ ఆగం అవకూడదు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం. కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి. తెలంగాణపై బీజేపీ అగ్రనేతల ఫోకస్.. ఈరోజు పది సభల్లో పాల్గొననున్న అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం యోగి ఆదిత్యనాథ్. రాష్ట్ర కార్యాలయం నుంచే బీఎల్ సంతోష్ పర్యవేక్షణ. ఈరోజు మధ్యాహ్నం జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ భేటీ. ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందని కమలనాథుల ఆశలు. రైతుబంధు, బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు రైతుబంధుపై సీఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ రైతు బంధుపై ఈసీ ఇచ్చిన ఆదేశాలను బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో వాడకుండా ఆంక్షలు విధించాలని ఫిర్యాదు. రైతుబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న కాంగ్రెస్ ఈసీ ఆదేశాలను బీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తుందన్న కాంగ్రెస్ నేడు మధిరలో భట్టి బైక్ ర్యాలీ.. ఖమ్మంలో భట్టి విక్కమార్క ఎన్నికల ప్రచారం నేడు మధిర నియోజకవర్గంలో భట్టి బైక్ ర్యాలీ బైక్ ర్యాలీలో పాల్గొననున్న పొంగులేటి, తుమ్మల నాగేశ్వర రావు మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రుపాలెం క్రాస్‌రోడ్ నుంచి బోనకల్లు మండలం సీతానగరం వరకు బైక్ ర్యాలీ భారీ సంఖ్యలో బైక్ ర్యాలీకి ప్లాన్ చేసిన కాంగ్రెస్ నేతలు తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్థులు విద్యార్హత వివరాలు ఇవే.. పదో తరగతి పాసైన అభ్యర్థుల సంఖ్య 441, ఇంటర్ పాసైన వారి సంఖ్య 330, చదువుకోనివారి సంఖ్య 89, చదువుకున్న వారి సంఖ్య 26 ఐదో తరగతి పాసైన వారి సంఖ్య 91, ఎనిమిదో తరగతి పాసైన వారి సంఖ్య 117, డిగ్రీ ఆపై చదివిన వారి సంఖ్య 1143, డిప్లమా చదివిన వారి సంఖ్య 53, డాక్టరేట్ ఉన్న వారి సంఖ్య 32. కామారెడ్డిలో పోస్టర్ల కలకలం టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై సెటైరికల్ కామెంట్స్ కొడంగల్‌లో చెల్లని రూపాయి కామారెడ్డికి అవసరమా అంటూ పోస్టర్లు కామారెడ్డి ప్రధాన కూడళ్లలో వెలిసిన పోస్టర్లు పోస్టర్లు అతికించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు, పోలీసులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు నేడు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్య నేతల పర్యటనలు ఇలా.. ఆంథోల్, సంగారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న రాహుల్ గాంధీ నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పటాన్చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న రేవంత్ రెడ్డి. వరంగల్ వెస్ట్, కరీంనగర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్. మక్తల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య. బీఆర్ఎస్ అభ్యర్థిపై హత్యాయత్నం కేసు నమోదు నారాయణపేట రాజకీయాల్లో కలకలం కోస్గిలో కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు కాంగ్రెస్ కార్యకర్త కూర నరేష్‌పై కర్రలతో దాడి చేసిన బీఆర్ఎస్ నేతలు 307తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు మొత్తం ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు, ఏ1గా పట్నం నరేందర్ రెడ్డి. నేడు కేటీఆర్ ప్రచారం షెడ్యూల్ ఇలా.. నేడు చొప్పదండి, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం ఉదయం చొప్పదండిలో ఎన్నికల ప్రచారం సాయంత్రం సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో రోడ్ షో నేడు తెలంగాణలో సీఎం సిద్ధరామయ్య పర్యటన ఎన్నికల సందర్బంగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలంగాణ పర్యటన నేడు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ హెలికాప్టర్లో బేగంపేట నుంచి మక్తల్‌కు సిద్ధరామయ్య మధ్యాహ్నం మూడు గంటలకు మక్తల్‌లో ప్రచార సభ.. సాయంత్రం 5.30 గంటలకు ముషీరాబాద్‌లో ప్రచార సభ పాల్గొననున్న కర్టాటక సీఎం. నేడు మహబూబ్‌నగర్‌కు సీఎం యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేడు మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం యోగి నేడు నిర్మల్‌లో మోదీ, కేసీఆర్ పర్యటన నేడు నిర్మల్ జిల్లాలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్మల్ జిల్లా కేందంలో ఎన్నికల ప్రచార సభలో పాల్లొననున్న ప్రధాని మోదీ ఖానాపూర్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరుకానున్న సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ సభ నేపథ్యలో పోలీసుల భారీ భద్రత. నేడు నాలుగు చోట్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు.. ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పూర్తి అప్డేట్స్.. సర్వేల పూర్తి సమాచారం.. ఇప్పుడు మీ కోసం.. -
ఢిల్లీ లీడర్లకు కేసీఆర్ భయం
సాక్షి, కామారెడ్డి/అబిడ్స్/మలక్‌పేట: ‘కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే ఉత్తిగ ఊకుండడు... ఢిల్లీలోనూ తెలంగాణ జెండా పాతుతడని ఢిల్లీ లీడర్లు మోదీ, రాహుల్ గాం«దీకి భయం పట్టుకుంది. అందుకే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఖతంజెయ్యాలని (ఓడగొట్టాలని) ఇద్దరూ కలసి కుట్రలుజేస్తున్నరు. అడ్డగోలుగా పైసలు గుమ్మరించి లీడర్లను కొంటున్నరు. ఎందరిని కొంటరో కొననీ.. మిమ్మల్ని (ప్రజలను) మాత్రం కొనలేరు. ప్రజల మద్దతుతో కేసీఆర్ భారీ విజయం సాధిస్తడు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి గుణపాఠం చెప్పాలని... సుస్థిర ప్రభుత్వం కోసం మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతోపాటు హైదరాబాద్‌లోని గోషామహల్, మలక్‌పేట నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గల్ఫ్ వలసపోయినోళ్లకు ప్రత్యేక ప్యాకేజీ... బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తరువాత మూడోసారి అధికారం చేపట్టగానే కొత్త పథకాలు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు అందిస్తామని చెప్పారు. రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు పట్టాదారులకే ఇస్తామని స్పష్టం చేశారు. రేవంత్ కొడంగల్‌లో చెల్లని రూపాయి... ‘2018 ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు రేవంత్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించిండ్రు. అసుంటి రేవంత్‌రెడ్డి కామారెడ్డికి వచ్చి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఊకుంటరా.. తుక్కుతుక్కు ఓడగొడుతరు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూ లేదు.. హైదరాబాద్ పాతబస్తీలో గతంలో కర్ఫ్యూలతో బంద్‌లు జరిగేవని... కానీ కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూలు లేవని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హిందూ, ముస్లింలు అన్నదన్నముల మాదిరిగా కలసి జీవిస్తున్నారన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మలక్‌పేట అంటే ఒకప్పుడు టీవీ టవర్ గుర్తుకు వచ్చేదని... ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్‌గా నిలుస్తోందన్నారు. ధూల్‌పేట కళాకారులను చైనాకు పంపి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాది కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బీజేపీ కేవలం మతాల పేరుతోనే రాజకీయాలు చేస్తుంది తప్ప అభివృద్ధి చేయడం ఆ పారీ్టకి సాధ్యంకాదన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.. ‘కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు. నాకు తెలిసి ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.గంజినీళ్లు దొరకని రాజ్యం. అసుంటి దరిద్రపుగొట్టు, దుర్మార్గపు పాలన మనకు అవసరమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 29 లక్షల మందికి రూ. 200 చొప్పున పింఛన్ ఇచ్చేవారని, తాము అధికారంలోకి వచ్చాక 46 లక్షల మందికి రూ. 2 వేల చొప్పున ఇస్తున్నామని, మూడోసారి అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. 16 రాష్ట్రాల్లో బీడీ కారి్మకులు ఉన్నా, ఎక్కడా జీవనభృతి ఇవ్వలేదని, మనం మాత్రమే ఇస్తున్నామని, బీడీ కార్మికుల పింఛన్ అర్హత కటాఫ్ తేదీని 2023కు పెంచి మిగిలిపోయిన వారందరికీ ఇస్తామని తెలిపారు. సన్నబియ్యం అందించడంతోపాటు 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 3 వేల సాయం అందిస్తామని తెలిపారు. -
రిస్క్ వద్దు.. కారు ముద్దు
సాక్షి, యాదాద్రి, సాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి మహబూబాబాద్ /నెక్కొండ/బచ్చన్నపేట: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రిస్‌్కలో పడుతామని, సీఎం కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సేఫ్‌గా ఉంటుందని మంత్రి తన్నీరు హరీ‹Ùరావు వ్యాఖ్యానించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం చీకటిమామిడిలో కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. భువనగిరి పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో ప్రసంగించారు. 80 సీట్లు గెలిచి బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పా రు. యాసంగిలో రైతు బంధు అమలు చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వగానే కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని హరీశ్ అన్నారు. బ్యాంకులకు సెలవులు పూర్తికాగానే మంగళవారం రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుందని చెప్పా రు. కాంగ్రెస్‌కు చాన్స్ ఇస్తే ఆరు గ్యారంటీలకు బదులు, వాళ్లకు వాళ్లు తన్నుకుని ఆరుగురు ముఖ్యమంత్రులు అవుతారని ఎద్దేవా చేశారు. ఎన్నో మంచి పనులు చేసిన కేసీఆర్‌ను సాదుకుందామా, రాజకీయంగా సంపుకుందామో ప్రజలు తేల్చుకోవాలన్నారు. కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, భువనగిరి, ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థులు ఫైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతా పాల్గొన్నారు. కర్ణాటకలో కరెంటు బంద్ అయింది. ఆరు గ్యారంటీలని కాంగ్రెస్ నేతలు ఊర్లపొంటి తిరుగుతున్నారు.. ఆరునెలల క్రితం కర్ణాటకకు పోయి ఐదు గ్యారంటీలిస్తామని అక్కడ రాహుల్ గాం«దీ, ప్రియాంకగాంధీ చెప్పారు. నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్న కరెంట్ బందయ్యింది. ఐదు గ్యారంటీలను గాలికొదిలేసింది... హామీలిచ్చిన ప్రియాంక, రాహుల్‌లు ఆ రాష్ట్రానికి వెళ్లడం లేదు. అలాంటివాళ్లు తెలంగాణలో అధికారం ఇస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటే నమ్మాలా? 12 సార్లు రైతుబంధు ఇచ్చిన కేసీఆర్ కావాలా లేక మాట తప్పే కాంగ్రెస్ కావాలో ఆలోచించుకోవాలి’అని హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, నెక్కొండ, పాలకుర్తి, బచ్చన్నపేటలలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను గెలిపించాలని కోరుతూ శనివారం రోడ్‌షోలు, కార్నర్‌మీటింగ్‌లలో ఆయన ప్రసంగించారు. పాలిచ్చే గేదెవంటి బీఆర్ఎస్ పారీ్టకి కాకుండా పనిచేయని దున్నపోతు వంటి కాంగ్రెస్‌కు గడ్డి వేస్తే ఫలితం ఉండదు’అని అన్నారు. ప్రాజెక్టులు రేవంత్ నెత్తిపై కట్టాలా మూడు గంటల కరెంట్ చాలని చెప్పిన రేవంత్ ఇప్పుడు ప్రాజెక్టులు ఇసుకపై కట్టారని అనడం అయన అవగాహనా రాహిత్యానికి నిదర్శమని హరీశ్ ధ్వజమెత్తారు. నదులపై ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఇసుకపై కాకుండా రేవంత్ నెత్తిపై కట్టాలా అని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం రైతుబంధు అందిస్తుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బిచ్చం వేస్తుందని, రైతులను బిచ్చగాళ్లుగా మాట్లాడిన రేవంత్‌కు, కాంగ్రెస్ పారీ్టకి ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని పిలుపు నిచ్చారు. సోమవారం నుంచి రైతు ఖాతాల్లో డబ్బులు పడతాయని హరీశ్ చెప్పారు. డబ్బులు పడిన మెస్సేజీ శబ్దం టింగ్. టింగ్ మంటూ వస్తుందన్నారు. ఆ శబ్ధం విన్న రైతులు ఆదే ఊపుతో 30వ తేదీ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అనుమతి ఇస్తే రుణమాఫీ కూడా పూర్తి చేస్తామన్నారు. ఒకే రోజు.. ఆరు జిల్లాలు.. ఏడు సభలు హరీశ్‌రావు శనివారం ఒక్కరోజు ఆరు జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించి రికార్డు సృష్టించారు. ఒక్కరోజే మహబూబాబాద్, వరంగల్, పాలకుర్తి, జనగామ, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం హెలికాప్టర్లోనే చేశారు. -
పెరిగిన నేర చరితులు!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో నేర చరితులు పెరిగారు. నేర చరిత్ర, పెండింగ్ కేసులు ఉన్న వారికి ఎన్నికల్లో సీట్లు కేటాయించవద్దని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ రాజకీయ పార్టీలు అది పాటించక పోవడం గమనార్హం. మొత్తం 2,290 మంది అభ్యర్థుల్లో 23 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా అఫిడవిట్లలో పేర్కొన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. 2018 ఎన్నికలలో 1,777 మంది అభ్యర్థులకు గాను 21 శాతం (368) మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉండగా, ఈ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్నవారు 521 మంది ఉన్నారని ఏడీఆర్ వివరించింది. 353 మంది అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ కేసులు (5 ఏళ్లు అంతకు మించి శిక్షపడే కేసులు) ఉండగా, ఈ సంఖ్య 2018లో 321గా ఉన్నట్టు తెలిపింది. ఈ నెల 30న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి వారిపై పెండింగ్ కేసులు, విద్యార్హతలు, ఆర్థిక స్థితిగతులు, వయసులు, మహిళలు, పురుషుల సంఖ్య వంటి వివరాలతో నివేదిక రూపొందించినట్టు ఏడీఆర్ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్లు రాకేశ్ దుబ్బుడు, వై.రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్‌లో ఎక్కువ.. అన్ని ప్రధాన పార్టీలు క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులకు టికెట్లు (14% నుంచి 72% వరకు) ఇచ్చాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 85 (72%) మంది, బీజేపీ నుంచి 79 (71%) మంది, అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి 57 (48%) మంది, బీఎస్పీ నుంచి 40 (37%) మంది, సీపీఐ(ఎం) నుంచి 12 (63%) మంది, ఏఐఎంఐఎం నుంచి ఐదుగురు (56%), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 10 (24%) మంది క్రిమినల్ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని ఏడీఆర్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. కోటీశ్వరులూ పెరిగారు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. మొత్తం అభ్యర్థుల్లో 25 శాతంమంది కోటీశ్వరులు కాగా, రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 41.48% ఉన్నారు. ఇక ముగ్గురుకు మించి అభ్యర్థులపై క్రిమినల్ కేసు లు ఉన్నట్లయితే అటువంటి నియోజకవర్గాలను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా గుర్తించారు. 2018లో రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు 78 ఉండ గా, ప్రస్తుత (2023) ఎన్నికల్లో ఇవి 96కు పెరిగాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మహిళలకు ఆయా పార్టీలు ఇచ్చే సీట్ల సంఖ్య పెరిగే అవ కాశం ఉంటుందని అంచనా వేసినా అది జరగ లేదు. అన్ని పార్టీల్లో కలిపి పోటీలో ఉన్న (2,290 మంది) అభ్యర్థుల్లో 10% మంది మా త్రమే మహిళా అభ్యర్థులు కావడం గమనార్హం. ప్రధాన పార్టీలదే హవా ప్రదాన పార్టీలన్నీ సంపన్న అభ్యర్థులకే అత్యధికంగా సీట్లు కేటాయించాయి. 2,290 మంది అభ్యర్థులలో 580 (25%) మంది కోటీశ్వరులు ఉన్నారు. బీఆర్ఎస్కు చెందిన 114 (96%) మంది, కాంగ్రెస్‌కు చెందిన 111 (94%) మంది, బీజేపీకి చెందిన 93 (84%)మంది రూ. కోటి కంటే ఎక్కువ ఆస్తులను ప్రకటించారు. 25 మంది తమకు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదని ప్రకటించడం గమనార్హం. అస్తుల్లో వివేక్ ఫస్ట్ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేకానంద్ తన ఆస్తుల విలువ రూ.606+ కోట్లుగా ప్రకటించి తొలి స్థానంలో నిలిచారు. రూ.458+ కోట్లతో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి, రూ.433 కోట్లతో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సీఎం కేసీఆర్ తన సంపద రూ.58+ కోట్లుగా, ఈటల, కేటీఆర్‌లు రూ.53+ కోట్లుగా, రేవంత్‌రెడ్డి రూ.30+ కోట్లుగా ప్రకటించారు. కాగా, 979 (43%) మంది తమ విద్యార్హతలను 5 నుంచి 12వ తరగతి మధ్య ఉన్నట్లు ప్రకటించగా, 1,143 (50%) మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నట్లు ప్రకటించారు. -
రైతు చుట్టూ రాజకీయం
ఎన్నికల్లో రైతులను ఆకర్షించే పనిలో అన్ని పార్టీలూ నిమగ్నమయ్యాయి. రైతులను ప్రసన్నం చేసుకుంటేనే అధికారం దక్కుతుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే రైతు కేంద్రంగా అనేక పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీలు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలే నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన రైతులు, వ్యవసాయ కూలీలను పార్టీలు టార్గెట్‌గా చేసుకొని ప్రచారం చేస్తున్నాయి. వ్యవసాయం : 2 కోట్ల మంది రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులు 66 లక్షల మంది ఉన్నారు. వీరే కాకుండా సెంటు భూమిలేని కౌలు రైతులు 6 లక్షల మందికి పైగా ఉంటారు. అంటే రైతులు, కౌలుదారులు కలిపి దాదాపు 72 లక్షల రైతు కుటుంబాలు ఉన్నట్లు ఓ లెక్క. కుటుంబంలో కనీసం ఇద్దరు చొప్పున ఓటు హక్కు కలిగి ఉన్నా, దాదాపు కోటిన్నర మంది వరకు ఉంటారు. ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న కూలీల సంఖ్య 52 లక్షలు. అంటే రాష్ట్రంలో వ్యవసాయం, దానిపై ఆధారపడిన వారే 2 కోట్ల మంది ఉంటారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ రైతుబంధు రూ.16 వేలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రైతులపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. సాగునీటి ప్రాజెక్టులు మొదలు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టింది. రైతుబంధు కింద రైతులకు ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 72 వేల కోట్లు అందజేసింది. ప్రస్తుతం ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు ఇస్తుండగా, మరోసారి అధికారం అప్పగిస్తే విడతల వారీగా పెంచుతామని తెలిపింది. రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12 వేల రూపాయలకు పెంచుతామని హామీనిచ్చింది. వచ్చే ఐదేళ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ... గరిష్టంగా ఎకరానికి ఏటా 16 వేల రూపాయలకు పెంచుతామని చెబుతోంది. రైతుబీమా ఎలాగూ ఉంది. అయితే గత రెండుసార్లు రైతులకు రూ. లక్ష రుణమాఫీ ప్రకటించి అమలు చేసిన బీఆర్ఎస్, ఈసారి మాత్రం తన ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీని ప్రకటించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూ.2 లక్షల రుణమాఫీ రైతులకు భరోసా దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. 24 గంటల ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని ఆ పార్టీ చెబుతోంది. రైతుబంధుకు బదులుగా రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరానికి ఒక్కో రైతుకు రూ. 15 వేలు ఇస్తామని వెల్లడించింది. కౌలు రైతులకు రైతు భరోసా రూ. 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. ఇక వ్యవసాయ కూలీలకు, ఉపాధి కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెబుతోంది. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధర, వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని పేర్కొంది. అలాగే రైతు డిక్లరేషన్‌లో భాగంగా ఒకేసారి రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని తెలిపింది. మద్దతు ధరకు అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపింది. భూమి యాజమాన్య హక్కులను అందిస్తామని, పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్దిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని తెలిపింది. రైతు కమిషన్ ఏర్పాటుతో సహా సరికొత్త వ్యవసాయ విధానం తెస్తామని చెబుతోంది. వరికి మద్దతు ధర రూ. 3,100 ఇస్తామన్న బీజేపీ మరోవైపు తామూ అధికారంలోకి వస్తామని చెబుతోన్న బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో చిన్న సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు రూ. 2,500 సాయం అందిస్తామని తెలిపింది. ఉచిత పంటల బీమాను ప్రకటించింది. వరికి రూ. 3,100 మద్దతు ధర ఇస్తామని తెలిపింది. పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఆసక్తి కలిగిన రైతులకు దేశీ ఆవులను ఉచితంగా అందిస్తామని తెలిపింది. జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఏమాత్రం తగ్గని లెఫ్ట్ పార్టీల మేనిఫెస్టో... ఇక ఒంటరిగా బరిలో నిలిచి 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సీపీఎం తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు అనుకూలంగా అనేక హామీలు ఇచ్చింది. రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ కోసం కృషి చేస్తామని తెలిపింది. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం రూపొందించాలని కోరుతామని, రైతుల పంటలపై 80 శాతం రుణాలు ఇచ్చి గోదాముల సౌకర్యం కల్పించాలని, ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలు సేకరించాలని కోరుతామని స్పష్టం చేసింది. కౌలు రైతుల గుర్తింపు, వ్యవసాయ రుణాలు, సబ్సి డీలు, పంట బీమా, కౌలు, పోడు తదితర రైతులందరికీ రూ. 5 లక్షల రైతు బీమా సౌకర్యం కల్పించా లని, ప్రకృతి వైపరీత్యాలు, అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే సాగు చేసిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా మని సీపీఎం పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో ఒక స్థానంలో పోటీ చేస్తున్న సీపీఐ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో కీలకమైన అంశాలను పొందుపర్చింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని కోరింది. ఒకేసారి రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని పేర్కొంది. -బొల్లోజు రవి -
వారి తీర్పే కీలకం!
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ’’. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు జపిస్తున్న మంత్రం ఇదే. తమకు అధికారం కట్టబెడితే ఫలానా గడువులోగా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామంటున్నాయి. ఇప్పటికే ఆయాపార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాయి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు పరిమిత సంఖ్యలోనే ఉన్నా, వాటిని సాధించేందుకు కసరత్తు చేస్తున్న అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో ఉద్యోగాల కోసం వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 25 లక్షలు. ఇక తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ఆర్బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) పరిధిలో రిజిస్ట్రేషన్లు కలుపుకుంటే అభ్యర్థుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విభాగంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్. దీంతో ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కు నమోదు చేసుకున్న వారే కావడంతో ఎన్నికల్లో వీరి తీర్పు కీలకం కానుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఒక్కో సెగ్మెంట్లో 21 వేలకు పైమాటే.. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఒక్కో నియోజకవర్గంలో సగటున 21 వేల మంది ఉద్యోగాలర్థులున్నట్లు అంచనా. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో స్పష్టత ఇస్తే వారి ఓట్లన్నీ పడతాయనే భావనతో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రచారస్త్రంగా మలుచుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ కేలండర్‌ను ప్రకటించి ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే 1.63 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని, మిగిలిన ఖాళీల భర్తీకోసం మరోసారి అధికారంలోకి రాగానే జాబ్ కేలండర్ ప్రకటిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. ఇక బీజేపీ సైతం ఉద్యోగ ఖాళీల భర్తీ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చింది. దీనితోపాటు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీపీఐ, సీపీఎం, బీఎస్పీ సైతం మేనిఫెస్టోలో ప్రభుత్వ కొలువుల అంశాలను ప్రస్తావించాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. దీంతో ఈ దఫా వీరంతా ఎవరికి ఓటేస్తారో చూడాలి. -
అనుమానం లేదు అధికారంలోకి వస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ ఆ పార్టీ నేతలు ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని గట్టిగానే సౌండ్ వినిపిస్తున్నారు. నాటి దుబ్బాక ఎన్నికల్లో గెలుపు నుంచి మొన్నటి జీహెచ్‌ఎచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పొందిన సీట్లే ఇందుకు నిదర్శమని కాషాయనేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సాక్షితో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎలా, ఎందుకు అధికారంలోకి వస్తుందో చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు మద్దతిస్తారో క్లారిటీ ఇచ్చారు. జోడు పదవులకు న్యాయం జరుగుతుందా? నేను పదవిలోకి వచ్చి రెండు నెలలే అవుతోంది. ఈ సమయంలో పార్టీ కోసం, ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో నా అనుభవం పెట్టి పనిచేస్తున్నాను. బీజేపీ టెంపో డౌన్ అయ్యిందా? ఒక పథకం ప్రకారం కొన్ని శక్తులు ఇలాంటివి ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అలాంటి పరిస్థితి లేదు. సుమారు 100 స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు దీటుగానే బీజేపీ ఉంది. మాకొచ్చే ఫీడ్ బ్యాక్‌లో మేం బలంగా ఉన్నాం. కిషన్‌రెడ్డి వల్ల బీజేపీకి లాభమా?.. బీఆర్ఎస్కి లాభమా? రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో కొంత అసత్య ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది బీజేపీనే. నేను అధ్యక్షుడైన రెండు నెలల్లో పలుమార్లు కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాను. రెండుసార్లు నన్ను అరెస్ట్ కూడా చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై ఏనాడూ పోరాటం చేయలేదు. జైళ్లకు వెళ్లింది, కేసులు పెట్టించుకున్నది బీజేపీ నేతలే. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసిన విషయం ప్రజలకు తెలుసు. బీజేపీ ఎప్పటికీ కుటుంబ పార్టీలో కలవదు. బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటే. కానీ, మజ్లిస్ పార్టీతో బీజేపీ ఎన్నటికీ కలిసే ప్రసక్తే లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. మజ్లిస్‌తో బీజేపీ కలవదు అన్నది కూడా అంతే నిజం. తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్ ఉందా? కరా్టటక ఫలితాల తర్వాత తెలంగాణకు భారీ మొత్తంలో డబ్బు చేరుతోంది. అక్కడ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు. రూ.వేల కోట్లను మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియాకు వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు. అంబర్‌పేట నుంచి ఎందుకు పోటీలో లేరు? నేను పోటీ చేయాలనుకున్నాను. నా వ్యక్తిగత నిర్ణయం వేరు.. పార్టీ హైకమాండ్ నిర్ణయం వేరు. నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. బీసీని సీఎంను చేయాలని మా పార్టీ నిర్ణయించింది. ఈ సమయంలో నేను పోటీ చేస్లి గెలిచి.. ప్రజల్లో సీఎం అభ్యర్థిపై సందిగ్ధత ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను పోటీలో లేను. 4 శాతం రిజర్వేషన్ల తొలగింపు కరెక్టేనా? ఇది రాజకీయపరమైన అంశం. రాష్ట్ర హైకోర్టు నాలుగు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చింది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం. ఇప్పటికే ముస్లింలలో కొందరికి బీసీ–డీలో రిజర్వేషన్ దొరుకుతోంది. మేము ఈబీసీలో ఏదైతే 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామో అందులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. అందులో అందరికీ రిజర్వేషన్ ఉంటుంది. మతపరమైన రిజర్వేషన్లను బాబా సాహెబ్ అంబేడ్కర్ కూడా వ్యతిరేకించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరు.. మీ మద్దతు ఎవరికి ? నా మద్దతు పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది. పార్టీ అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకుంటాం.. ఢిల్లీలో పార్లమెంటరీ బోర్డు ఉంటుంది.. వాళ్ల అభిప్రాయాలు తీసుకుని, విశ్లేషించి, మిగతా ఎమ్మెల్యేల అందరితో మాట్లాడిన తర్వాతే సీఎంను ప్రకటిస్తాం. యూపీ ఎన్నికలప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్‌ను తర్వాతే ఎంపిక చేశాం. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రతీ విషయంలోనూ ముద్రవేశారు. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? అధికారంలోకి రావడానికి కావలసినన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది రాజకీయాల్లో అటు ఇటు అయితే ? ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఒకవేళ బీజేపీకి సరిపడా సీట్లు రాకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటుందా? బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాకు 100 సీట్లు వస్తాయని బీఆర్ఎస్ చెప్పింది. బీజేపీకి కేవలం రెండు మూడు సీట్లు వస్తాయని చెప్పింది. కానీ ఫలితాలు వెల్లడైన తర్వాత పరిస్థితి తారుమారైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందని భావిస్తున్నాం. దేని ఆధారంగా చెబుతున్నారు? తెలంగాణలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతలో బీజేపీ పట్ల అభిమానం ఉంది. ఒక ఇంట్లో తండ్రి బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చేమో కానీ వాళ్ల పిల్లలు బీజేపీ పట్ల.. నరేంద్ర మోదీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతోమంది యువత అభిమానులుగా ఉన్నారు. ఇదే మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా. బీఆర్ఎస్ లౌకిక రాజ్యం, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, మీరేమో రామరాజ్యం అంటున్నారు? హిందువుల గురించి మాట్లాడితే మతోన్మాద పార్టీనా? ఈ దేశ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను.. దేశంలో హిందూయిజం ఉన్నప్పుడే సెక్యులర్‌గా ఉంటుంది. హిందువులు మైనార్టీలోకి వెళ్లినప్పుడు దేశంలో సెక్యులరిజం ఉండదు. నేను రాసిస్తాను. మేము అన్ని మతాల గురించి మాట్లాడతాం. క్రిస్టియన్ల గురించి, ముస్లింల గురించి మాట్లాడతాం. మేం ముస్లింలను వ్యతిరేకించం, కేవలం మజ్లిస్ పార్టీ విధానాలతో వ్యతిరేకిస్తాం. హిందువుల గురించి కచ్చితంగా మాట్లాడతాం. హిందువులు దేశ పౌరులు కారా? వాళ్లకి ఇక్కడ హక్కులు లేవా?. వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తే అది మతోన్మాదం ఎలా అవుతుంది? నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను హిందూయిజం ఉన్నంతకాలమే దేశంలో సెక్యులరిజం ఉంటుంది. -
స్తంభాద్రి గడ్డపై.. సై అంటే సై
భద్రాద్రి రాముడు, స్తంభాద్రి లక్ష్మీనరసింహుడు కొలువైన నేల.. తెలంగాణ నల్లబంగారం సింగరేణి ప్రాంతం, నిత్యం ఆటుపోట్లు ఎదుర్కొంటూ అడవి జీవనం సాగించే ఆదివాసీలకు అడ్డా, రాష్ట్రంలోనే అత్యధిక రిజర్వ్డ్ నియోజకవర్గాలున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి ఆసక్తికర ఎన్నికలు సాగుతున్నాయి. గత రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ పక్షానే నిలబడిన ఖమ్మం జిల్లా ప్రజలు ఈసారి ఏం చేస్తారోననే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయవర్గాల్లో నెలకొంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల చేరికతో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పాత ఫలితాలు పునరావృతమవుతాయా? లేక కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల సంక్షేమ పాలన ఈసారి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పట్టును చూపెడుతుందా? అన్నది చర్చనీయాంశమవుతోంది. ఇక్కడ ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో సీపీఐ కాంగ్రెస్ కూటమిలో చేరగా, సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తోంది. మార్క్సిస్టులకు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వస్తాయి? ఎవరి గెలుపు అవకాశాలనైనా ఈ ఓటు బ్యాంకు ప్రభావితం చేస్తుంది? బీజేపీకి ఎన్ని చోట్ల డిపాజిట్ దక్కుతుంది? స్వతంత్రులెవరైనా గట్టెక్కుతారా అనే చర్చ జరుగుతోంది. రెండు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటాపోటీగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్న ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందన్న దానిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది... ! పాలేరు ప్రత్యేకం...? ఖమ్మం జిల్లాకు సరిహద్దులో ఉండే పాలేరు నియోజకవర్గంలో పోటీ ఈసారి ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికి సౌమ్యుడిగా, ఆపదలో ఆదుకునే వ్యక్తిగా పేరుంది కానీ పార్టీ మార్పు వ్యవహారం ఈసారి ఆయనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బరిలోకి దిగడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా ఈసారి పొంగులేటి వైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. బలమైన నాయకుడు కావడం, మంచి వ్యక్తి అనే పేరుండడం పొంగులేటికి కలిసివచ్చే అంశాలు. సాంప్రదాయ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు ఎలాగూ ఉంది. ఇక, సీపీఎం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తుండడంతో ఈసారి మార్క్సిస్టులకు పాలేరులో ఎన్ని ఓట్లు వస్తాయి..? ఆ ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందన్నది చర్చతోపాటు రాష్ట్రంలో సీపీఎం భవిష్యత్‌ను అంచనా వేసేందుకు కీలకం కానుంది. కొత్తగూడెం కొంగొత్త రాజకీయం కాంగ్రెస్‌తో రాష్ట్ర వ్యాప్త పొత్తు కుదుర్చుకున్న సీపీఐ అధికారికంగా పోటీ చేస్తోంది కొత్తగూడెంలోనే. ఈ పొత్తు కారణంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేని విధంగా కొత్తగూడెంలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ బరిలో లేకపోవడంతో ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన పోటీ చేస్తున్నారు. పార్టీ మార్పు, కుమారుడి వ్యవహారశైలి వనమాకు కొంత ప్రతికూలంగా ఉన్నా నియోజకవర్గానికి సుపరిచితుడు, అందుబాటులో ఉండే వ్యక్తి కావడం, తోడల్లుడు ఎడవెల్లి కృష్ణతో ఉన్న గొడవలు పరిష్కారం కావడం, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మద్దతు కలిసిరానున్నాయి. జలగం వెంకట్రావు పూర్తిగా తన సొంత బలంపై వెళుతుండగా, కూనంనేనికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు బదిలీ ఆశాదీపంగా కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాల్సిందే! సత్తుపల్లి సత్తా చాటేదెవరో? ఎస్సీ రిజర్వ్డు అయిన సత్తుపల్లిలో ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య భీకరంగా రాజకీయ యుద్ధం జరుగుతోంది. పోటీ చేసే అభ్యర్థులతో సమానంగా ఇక్కడ ఇరుపార్టీల ముఖ్య నేతలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు మంచి పట్టు ఉన్న ఈ స్థానం నుంచి ఆ పార్టీ పక్షాన పాతకాపు మట్టా దయానంద్ సతీమణి రాగమయి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన సండ్ర వెంకటవీరయ్య పోటీ చేస్తున్నారు. ఇరువురు గట్టి అభ్యర్థులు కావడం, ఇద్దరికీ కీలక నేతల మద్దతు ఉండడం, ప్రధాన భూమిక పోషించే సామాజిక వర్గాలు ఇద్దరినీ అక్కున చేర్చుకుంటుండడం, మండలాల వారీగా భిన్న పరిస్థితులు కనిపిస్తుండడం సత్తుపల్లిలో ఈసారి ఫలితం ఎలా ఉంటుందోననే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. భద్రాచలం ఎవరి పరం? కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావులు ఇక్కడ తలపడుతున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఇక్కడి నుంచి పోటీ చేసిన వీరయ్య వైఖరి పట్ల నియోజకవర్గ ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత ఏమీ లేదు. అయితే, ప్రతిపక్ష పార్టీలో ఉండడం వల్ల పెద్దగా అభివృద్ధి చేయలేకపోయారనే భావన కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కావడం, ఆయన గత రెండుసార్లు పోటీ చేసిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో, మూడోసారైనా గట్టెక్కుతారేమోననే సానుభూతి వ్యక్తమవుతోంది. కొన్ని రోజుల వరకు పూర్తిగా కాంగ్రెస్ పక్షానే కనిపించిన ఈస్థానంలో పరిస్థితిలో కొంతమార్పు కనిపిస్తోంది. సీపీఐతో పాటు కాంగ్రెస్ నుంచి కొందరు బీఆర్ఎస్లో చేరడంతో భద్రాచలం టౌన్లో హోరాహోరీ పోరు సాగుతోంది. సీపీఎం నుంచి పోటీ చేస్తున్న కారం పుల్లయ్యకు ఎన్ని ఓట్లు వస్తాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంమీద భద్రాచలం ప్రజల్లో కొంత కాంగ్రెస్‌కు సానుకూల అభిప్రాయం కనిపిస్తోంది. వైరా గరంగరం ఈ దఫా ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో నియోజకవర్గం వైరా. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాములునాయక్‌ను కాదని మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ వైపు కేసీఆర్ మొగ్గుచూపడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తోన్న రాందాస్ నాయక్ భట్టి ఆశీస్సులతో టికెట్ తెచ్చుకున్నారు. వీరిద్దరి నడుమ పోరు రసవత్తరంగా సాగుతోంది. రాములునాయక్ బీఆర్ఎస్తో కలిసే ఉన్నా ఆయన వర్గం ఏ మేరకు సహకరిస్తుందన్నది చర్చనీయాంశమే. ఇక, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గం మద్దతు కోసం రాందాస్ నాయక్ ఆశతో ఉన్నారు. స్థానిక నాయకత్వంతో ఆయనకు ఇంకా సయోధ్య కుదరనట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ సాంప్రదాయ ఓటుబ్యాంకు, మార్పు కోరుతున్న నియోజకవర్గ ప్రజల ఆశీస్సులపై రాందాస్ ఆధారపడగా, కారుగుర్తు, కేసీఆర్ నాయకత్వం, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రజలతో తనకున్న సన్నిహిత సంబంధాలపై మదన్‌లాల్ ముందుకెళుతున్నారు. మిగిలిన పార్టీలు బరిలో ఉన్నా పోటీ నామమాత్రమే. ఇల్లెందు ఇంట ఇబ్బందిగానే.. ఇల్లెందులో ఈసారి ఆసక్తికర పోరు జరుగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోరం కనకయ్య ఈసారి కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియానాయక్ బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్యా తీవ్ర పోటీ కనిపిస్తోంది. లంబాడీ, కోయ, గిరిజనేతరుల కోణంలో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయని అంచనా. పార్టీ మారిన అంశం హరిప్రియకు ప్రతికూలంగానే మారింది. గతంలో పోటీ చేసినప్పుడు ఆమె చేసిన ప్రమాణాలపై కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్దతు ఉన్న కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ ఓట్‌బ్యాంక్‌తో పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతపై ఆధారపడి ముందుకెళుతున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి, కేసీఆర్ నాయకత్వం, సంక్షేమ పథకాలపై హరిప్రియ ఆశలు పెట్టుకున్నారు. పేట పట్టం ఎవరికో? ఎస్టీ రిజర్వ్డ్ అయిన అశ్వారావుపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమానంగా మరో ఇద్దరు నేతల మధ్య పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ బలమైన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డిల ప్రభావం ఈనియోజకవర్గంలో స్పష్టంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి జారె ఆదినారాయణకు టికెట్ వచ్చినప్పటికీ టికెట్ ఆశించిన మిగిలిన ముగ్గురు నేతలు బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో తెలుగుదేశం నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు పెద్దగా అభివృద్ధి చేయలేకపోయారనే అభిప్రాయం కనిపించింది. చాలాకాలం పాటు అటూ ఇటూ ఊగిసలాడిన మెచ్చా చివరకు బీఆర్ఎస్లో చేరినా ఫలితం దక్కలేదని అక్కడి ప్రజలంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు, టీడీపీ నుంచి లభిస్తున్న పరోక్ష సహకారం ఓవైపు, అధికార పార్టీ అవిశ్రాంత ప్రయత్నాలు మరోవైపు హోరాహోరీ తలపడుతున్నాయి. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే...! ఖమ్మం గుమ్మంలో విజేత ఎవరో? ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నది ఖమ్మం అసెంబ్లీ ఫలితం కోసమే. ఇక్కడ ఇద్దరు బడా నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్ బీఆర్ఎస్ నుంచి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో జరిగిన అభివృద్ధిని చూపించి తుమ్మల బృందం, ఇప్పుడు కళ్ల ముందు కనపడుతున్న అభివృద్ధిని చూడండంటూ పువ్వాడ టీం ఊరూవాడా కలియతిరుగుతున్నాయి. సీపీఎం నుంచి ఎర్రా శ్రీకాంత్ పోటీ చేస్తున్నా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ సీపీఐ మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందా లేక మంత్రి పువ్వాడ వైపు నిలబడుతుందా అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలకు ఆ సామాజికవర్గం మద్దతుతో పాటు ఖమ్మం సిటీ ప్రజల మద్దతు తోడైతేనే ఇక్కడ ఎవరు గెలిచేది తేలనుంది. పినపాక పాతకాపుల పోరు ఎస్టీ రిజర్వుడు అయిన పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీ పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేగా కాంతారావు ఈసారి బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉన్న పినపాకలో ఆ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు పాత కాంగ్రెస్ మనిషి కాంతారావు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ప్రయత్నిస్తున్నారు. రేగా కాంతారావు రూ.300 కోట్లతో ఇక్కడ ఎంతోకొంత అభివృద్ధి చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే ఎమ్మెల్యే పార్టీ మారిన అంశంపై పినపాకలో పెద్దగా చర్చ జరగడం లేదు. కాంగ్రెస్‌కు సీపీఐ తోడయింది. పాయం వెంకటేశ్వర్లుకు పొంగులేటి మద్దతు, సీపీఐ చేయూత, గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కలిసి వచ్చే అవకాశాలున్నాయి. మధిర ముచ్చట తీరేనా? సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ఇక్కడి నుంచి మరోమారు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా పాతకాపు లింగాల కమల్‌రాజ్ (బీఆర్ఎస్) బరిలో ఉన్నారు. సీపీఎం నుంచి వెంకులు పోటీ చేస్తున్నారు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యనే కనిపిస్తోంది. దళితబంధు పథకాన్ని పైలట్ కింద ఈ నియోజకవర్గంలో అమలు చేసింది. బీఆర్ఎస్కు సానుకూలమైనా ఇతర వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైఎస్సార్టీపీ మద్దతు, ఆరు గ్యారంటీలు, గెలిస్తే భట్టి ముఖ్యమంత్రి అవుతారని జరుగుతున్న చర్చ భట్టికి కలసి వస్తున్నాయి. కమల్‌రాజ్ బీఆర్ఎస్ బలంతో పాటు సంక్షేమం, అభివృద్ధి ఎజెండాతోనే వెళుతున్నారు. అందరికీ అవకాశమివ్వాలి ‘తెలంగాణ ఏర్పాటయ్యాక రెండుసార్లు బీఆర్ఎస్ గెలిచింది. ఎప్పుడూ ఒక్కరే గెలవొద్దు. అప్పుడప్పుడు పరిపాలించే పార్టీలు మారుతుండాలి. అందరినీ ప్రేమించి, అందరికీ అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఏం చేశారు, ఏం చేయలేదన్న దానిపై చర్చ అవసరం లేదు. తెలంగాణకు మరింత మంచి జరగాలంటే ఈసారి మార్పు కావాలి.’ – షేక్ కొండయ్య, వికలాంగుడు, ఖమ్మం నన్ను కాపాడింది ఆరోగ్యశ్రీనే ‘చనిపోయానని అనుకున్న నేను బతికానంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పెట్టిన ఆరోగ్యశ్రీనే కారణం. ఆరోగ్యశ్రీకి మొదటి లబ్దిదారు నేనే. 2006లో నా కిడ్నీలు పాడయ్యాయి. హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద చేరి్పంచి చికిత్స అందించారు. 17 ఏళ్లుగా నా ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పటినుంచి మేం ఆయన చూపించిన దారిలోనే నడుస్తున్నాం. ఈసారి కూడా అంతే.’ – భీంశెట్టి రంగనాయకమ్మ, పాలేరు మంచిని అందరూ మెచ్చుకోవాలి ‘నాకు పదెకరాల భూమి ఉంది. రైతుబంధు వస్తుంది. కరెంటు బాగుంది. ధాన్యం కూడా కొంటున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి అందరూ మద్దతివ్వాలి. రైతువారీగా ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిని మెచ్చుకోవాలి. అందరూ ప్రోత్సహించాలి.’ -ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మేకల కళ్యాణ్ చక్రవర్తి -
అది పార్టీ సభా..లేక కుల సభా..
అసలే ఎన్నికల సమయం. ప్రజలతో భారీ బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించడం ద్వారా ప్రజలంతా తమవైపు ఉన్నారన్న సంకేతాలు పంపించడమే వాటి ఉద్దేశం. ఇందుకోసం కోట్లాది రూపాయల వ్యయం అవుతుంది. అయినా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ట ముఖ్యం. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పరమావధి. అలాంటిదే పరేడ్ గ్రౌండ్లో ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే సదరు సభ నిర్వహణకు పార్టీ పేరుమీద కాకుండా.. ఓ సంఘం పేరిట బహిరంగసభ నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ బహిరంగసభకు కీలక నేత ముఖ్య ప్రసంగం ఉంటుందని, తద్వారా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేలా సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇక్కడే తిరకాసు వచ్చిపడింది. అనుమతి తీసుకున్నది ఓ కులసంఘం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సభకు అనుమతినిచ్చారు. అయితే సభలో ఎక్కడా పార్టీ జెండాలు ఉండరాదని మౌఖికంగా ఆదేశించారట. లేదు.. కూడదు.. బహిరంగసభలో పార్టీ జెండాలు పెడితే.. సంబంధిత ఖర్చులో సగం వరకు స్థానిక అభ్యర్థి లెక్కలో వేస్తామని హెచ్చరించారట... ఏమి చేయాలో పాలుపోని నాయకులకు ఎన్నికల బహిరంగసభ రద్దుకు నిర్ణయం తీసుకున్నారట. అయితే అదే సమయానికి వాతావరణశాఖ కూడా వర్షాలు పడే సూచనలున్నాయంటూ ఇచ్చిన హెచ్చరిక కూడా వీరికి కలిసి వచ్చిందంటున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఓ జాతీయ పార్టీ కూడా ఓ కులసంఘానికి సంబంధించిన బహిరంగసభ నిర్వహించింది. అది కూడా ఇంచుమించుగా రాజకీయ వేదికగానే ఉపయోగించుకుంది. కానీ అక్కడ ఎక్కడా తన పార్టీ జెండాలు ఏర్పాటు చేయకుండా జాగ్రత్త పడింది. ఆ సభ ద్వారా కావాల్సినంత ప్రయోజనాన్ని ఎన్నికల్లో పొందడానికి ప్రయత్నం చేసింది. ఆ కుల సంఘం కూడా ఎన్నికల ప్రచారంలో ఆ జాతీయ పార్టీకి పూర్తి మద్దతుగా రంగంలోకి దిగింది. ఇది ఎన్నికల కాలం మహిమ. -
కారు జోరా.. హస్తం హవానా.. హంగా?
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గరపడింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రకరకాల సర్వేలు భిన్నమైన ఫలితాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మధ్యనే ప్రధాన పోటీ అన్నది స్పష్టమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆఖరు నిమిషంలో పోరాట పటిమను ప్రదర్శిస్తున్నప్పటికీ ఇప్పటికైతే మూడో స్థానానికే పరిమితమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నాలుగైదు నెలల క్రితం వరకు బీఆర్ఎస్కు ఎదురులేదన్న భావన ఉండేది. కానీ క్రమేపీ కాంగ్రెస్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నోటి మాట (మౌత్ టాక్) ప్రకారమైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం కాకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. అలా అని బీఆర్ఎస్ అవకాశాలు పూర్తిగా పోయాయని కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నెగటివ్ సమస్యను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. కొద్దిరోజుల క్రితం మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ అశోక్‌నగర్‌కు వెళ్లి అక్కడ నిరుద్యోగులతో భేటీ అయినప్పుడు వచ్చిన ప్రశ్నలు ఆ విషయాన్ని చెబుతాయి. ఆయన సమర్థంగా వారి ప్రశ్నలకు జవాబిచ్చినా, మౌలికంగా నిరుద్యోగుల సమస్య, టీఎస్పీఎస్సీ వైఫల్యం ప్రభుత్వాన్ని వెంటాడుతోందన్న విషయం అర్థమవుతుంది. అంతేగాక సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై కొంత అసంతృప్తి ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మరికొంత వ్యతిరేకత ఉంది. పదేళ్లు ఈ పాలన చూశాంగా అన్న భావన కూడా ఉంది. అదే సమయంలో కేసీఆర్ వ్యూహాత్మక సుడిగాలి ప్రచారం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, హైదరాబాద్‌కు సంబంధించి చేసిన వివిధ అభివృద్ది కార్యక్రమాలు బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వీటితోపాటు పోల్ మేనేజ్మెంట్ కానీ, ఆర్థిక వనరుల విషయంలో కానీ బీఆర్ఎస్కు ఇబ్బంది ఉండదని, ఎలాగైనా తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేసీఆర్ తమకు గతంలో వచ్చిన సీట్లకన్నా నాలుగైదు ఎక్కువే వస్తాయని చెబుతున్నా, వాస్తవ పరిస్థితి అంత సులువుగా లేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో లేనంతటి గట్టి పోటీని బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ బొటా»ొటీ మెజార్టీతో అధికారంలోకి రావడమో, లేక ఎంఐఎంకు వచ్చే ఆరేడు సీట్లతో గండం నుంచి బయటపడటమో జరగొచ్చన్నది ఒక అంచనా. ఒకవేళ కాంగ్రెస్ ఇంకా పుంజుకుంటే కష్టం కావొచ్చు. ముస్లింలు గతసారి బీఆర్ఎస్ వైపు పూర్తిగా మొగ్గుచూపారు. ఇప్పుడు వారు ఎలా ఉంటారన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. హస్తం పార్టీ ఇలా... కాంగ్రెస్ విషయానికొస్తే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీకి బలంగాను, బలహీనతగాను కనిపిస్తున్నారు. ఆయన చేసే ప్రసంగాలు కేడర్‌లో జోష్ నింపుతున్నాయి. ఆయనైతే కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. తమకు అనుకూలంగా వేవ్ వస్తుందన్నది ఆయన ఆశ. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ పర్యటనలు చేస్తున్నారు. రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ తదితరులు అదనపు ఆకర్షణగా ప్రచారం సాగిస్తున్నారు. అదే సమయంలో రేవంత్ టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్‌కు నాయకత్వం వహించడం నచ్చకపోవడం, ఆయనపై ఉన్న ఇతర విమర్శలు బలహీనత కావొచ్చు. ప్రస్తుతానికైతే ఆయన బలహీనతలు పెద్దగా చర్చనీయాంశమవడం లేదనే చెప్పాలి. కాంగ్రెస్‌కు 70–80 స్థానాలు వస్తాయని రేవంత్ చెబుతున్నా.. అది అంత సులభం కాదు. ఎందుకంటే పైకి కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఉన్నట్లు కనబడుతున్నా, కొన్ని పరిమితులూ ఉన్నాయని క్షేత్రస్థాయిలో చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అయితే కాంగ్రెస్‌ది పై చేయి కావొచ్చన్నది వారి పరిశీలనలో వెల్లడవుతోందట. కానీ కొన్ని పరిణామాలు దానిని దెబ్బతీయొచ్చు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు అంత బలమైన అభ్యర్థులు ఎక్కువ చోట్ల లేకపోవడం ఒక లోటుగా చెబుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో కాస్త వెనకబడే అవకాశం ఉంది. 30 స్థానాలపై కమలం దృష్టి బీజేపీ సుమారు 30 నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. వాటిలో ఎక్కువ చోట్ల కనుక గణనీయంగా ఓట్లను పొందితే అది కాంగ్రెస్‌కు చేటు చేయొచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల ఈ పరిస్థితి రావొచ్చు. సిర్పూరు, పెద్దపల్లి, సూర్యాపేట వంటి కొన్ని చోట్ల బీఎస్పీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. దీనివల్ల కూడా కొంత కాంగ్రెస్‌కు, మరికొంత బీఆర్ఎస్కు నష్టం జరగొచ్చు. ఫార్వర్డ్ బ్లాక్ పేరుతోకానీ, స్వతంత్ర అభ్యర్ధులుగా గానీ మరో పది, పదిహేను చోట్ల ప్రధాన పార్టీలకు పోటీ ఇస్తున్నారు. ఉదాహరణకు కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన నిలబడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సీపీఐకి సీటు కేటాయించింది. కాంగ్రెస్ పూర్తిస్థాయిలో సహకరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా కాంగ్రెస్‌లోని కొందరు, అలాగే బీఆర్ఎస్కు చెందిన మరికొందరు జలగం వైపు మళ్లితే ఇరుపక్షాలకు నష్టం కలగవచ్చు. లేదా ఆయన చీల్చే ఓట్లను బట్టి గెలుపుఓటములు నిర్ణయమవుతాయి. ఈ రకంగా చూస్తే సుమారు 30–40 చోట్ల కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. వాటన్నిటినీ అధిగమించి కాంగ్రెస్ పుంజుకుని ప్రభంజనం సృష్టించుకోవాల్సి ఉంటుంది. ఎంఐఎం ఆరేడు సీట్లలో గెలిస్తే.. 119 సీట్లలో ఆరేడు సీట్లలో ఎంఐఎం గెలుస్తుంటుంది. మిగిలిన 112 సీట్లలో ఈ రకంగా 30 నుంచి 40 సీట్లలో తేడా వస్తే మిగిలిన సుమారు 70 నుంచి 80 సీట్లలోనే కాంగ్రెస్ తన ప్రభావం చూపగలుగుతుంది. సహజంగానే అన్నిట్లోనూ గెలిచే అవకాశం ఉండదు. ఇదే సమస్య బీఆర్ఎస్కూ ఎదురుకావొచ్చు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం బీఆర్ఎస్కు కలిసి రావొచ్చు. ఈ రెండింట్లో ఏ పార్టీ అయితే వేవ్ సృష్టించుకోగలుగుతుందో దానికి పూర్తి మెజార్టీ రావొచ్చు. కానీ అలా జరుగుతుందా అన్నది సస్పెన్స్‌గానే ఉంది. అందువల్ల హంగ్ అవకాశాలను తోసిపుచ్చలేని పరిస్థితి. కర్ణాటకలో, మునుగోడులో ఓడి.. బీజేపీ గురించి పరిశీలిస్తే, ఒకప్పుడు బీఆర్ఎస్కు ఇదే ప్రధాన ప్రత్యర్ధి అవుతుందని అనుకున్నారు. కర్ణాటకలో, మునుగోడులో ఓటమి, బండి సంజయ్ తొలగింపు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కుమార్తె పట్ల కొంత ఉదారంగా ఉండటం వంటి కారణాలతో ఆ పార్టీపై విశ్వాసం పోయింది. దానికి తగ్గట్లుగానే బీజేపీలో చేరిన పలువురు ప్రముఖులు మళ్లీ కాంగ్రెస్ బాట పట్టారు. అయినా బీజేపీ కొన్నిచోట్ల గట్టి పోటీలోనే ఉంది. కానీ అది తాను విజయం సాధించడం కన్నా, రెండు ప్రధాన పార్టీల్లో ఏదో ఒకదాని గెలుపు లేదా ఓటమికే ఉపకరించవచ్చన్నది ఒక అంచనా. దానిని దృష్టిలో పెట్టుకుని మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో విశ్వరూప ప్రదర్శనకు ప్రధాని హాజరై మాదిగలకు వర్గీకరణకు హామీ ఇవ్వడం, మళ్లీ మూడు రోజులపాటు ప్రచారంలో పాల్గొనడానికి రానుండటం, హోం మంత్రి అమిత్ షా తదితరులు గట్టిగా తిరుగుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సాగించడం జరుగుతోంది. తద్వారా తమ పార్టీకి 60 సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నా, అంత సీన్ కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఐదు నుంచి పది సీట్లు వస్తే గొప్ప అన్న భావన ఉంది. అందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యపోవాలి. ఎవరికైనా వేవ్ వస్తేనే భారీ ఆధిక్యత మరో విశ్లేషణ ఏమిటంటే తెలంగాణలో వేవ్ వస్తే తప్ప ఏ పార్టీకి భారీ ఆధిక్యత రావట్లేదు. 1983 నుంచి పరిశీలిస్తే, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ ఎన్నికల్లో తెలంగాణలో 107 స్థానాలకు గాను టీడీపీకి, కాంగ్రెస్‌కు చెరో 43 సీట్లు వచ్చాయి. ఒకరకంగా ఇది హంగ్ వంటి పరిస్థితి. 1985లో టీడీపీకి వేవ్ రావడంతో తెలంగాణలో టీడీపీకి 74 సీట్లు వచ్చాయి. 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా బొటా»ొటిగా ఇక్కడ 58 స్థానాలు వచ్చాయి. 1994లో టీడీపీ వేవ్‌లో మిత్రపక్షాలతో కలిసి 90 సీట్లు సాధించింది. 1999లో టీడీపీ అధికారంలోకి రాగలిగినా, తెలంగాణలో బీజేపీతో కలిపి 58 స్థానాలే సాధించింది. 2004లో కాంగ్రెస్‌కు వేవ్ రావడంతో మిత్రపక్షాలతో కలిపి 84 సీట్లు వచ్చాయి. 2009లో 119 స్థానాలకుగాను కాంగ్రెస్ పవర్లోకి వచ్చినా ఇక్కడ మాత్రం 50 స్థానాలే లభించాయి. టీడీపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కూటమికి 54 సీట్లు వచ్చాయి. అంటే ఎవరికీ ఆధిక్యత రాలేదన్నమాట. 2014లో బీఆర్ఎస్ కేవలం 63 సీట్లతోనే అధికారంలోకి వచ్చింది. 2018లో మాత్రం బీఆర్ఎస్కు వేవ్ ఏర్పడి 88 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కూటమి కట్టినా కేవలం 21 స్థానాలే దక్కాయి. దీని ప్రకారం ఏ పార్టీకి ప్రభంజనం లేకపోతే బీఆర్ఎస్కు బొటా»ొటి మెజార్టీ లేదా హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. ఏమవుతుందో చూద్దాం! -కొమ్మినేని శ్రీనివాసరావు -
రాజకీయ నిరుద్యోగి రాహుల్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నిరుద్యోగంతో బాధ పడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యువతను రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. ఉద్యోగాల కల్పన విషయంలో తాము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము రాహుల్‌కి ఉందా అని సవాల్ చేశారు. ఈ మేరకు శనివారం కేటీ రామారావు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో గడిచిన పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నరేండ్లలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1.60లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని, కాంగ్రెస్ పాలనలో 2004 –14 నడుమ తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 10,116 మాత్రమేనని పేర్కొన్నారు. జీవితంలో ఏనాడూ ఉద్యమాలు, ఉద్యోగాలు చేయని రాహుల్ గాం«దీకి యువత ఆకాంక్షలు తెలియవని, ఉద్యోగార్థుల ఇబ్బందులు ఆయనకు అర్దం కావని నిందించారు. 95శాతం ఉద్యోగాలు స్థానికులకేనంటూ కొత్త జోనల్ వ్యవస్థను తాము నిబద్ధతతో తెచ్చామని, 1972లో ముల్కీ నిబంధనలను రద్దు చేసి స్థానికతకు సమాధి కట్టింది కాంగ్రెస్ పార్టియేనని విమర్శించారు. ఆరు సూత్రాల పథకం, 610 జీవో, గిర్గ్లానీ నివేదికలు తుంగలో తొక్కి హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించి యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొట్టి తీరని అన్యాయం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సోనియాను రేవంత్ బలిదేవత అన్నారు 1952, 1969లో తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని కాంగ్రెస్ పార్టీ తుపాకీ కాల్పులతో బలితీసుకుందని, మలిదశ ఉద్యమంలో పదేండ్లు కాలయాపన చేసి యువతీ యువకుల ఆత్మబలిదానాలకు కారణమైన సోనియాగాందీని అప్పట్లో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ఆరు నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ కేలండర్ పచ్చి మోసమని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండే 2024 మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎలా సాధ్యమని కేటీఆర్ ప్రశ్నించారు. -
ఆ మూడు పార్టీలూ ఒక్కటే
ఆమనగల్లు, బన్సీలాల్‌పేట్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే ఆ మూడు పార్టీలను ప్రజలు తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆమనగల్లు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో శనివారం కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి మద్దతుగా నిర్వహించిన విజయభేరి సభకు పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి, కర్ణాటక విద్యాశాఖ మంత్రి సుధాకర్‌రెడ్డితో కలిసి ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకు పదేళ్ల కితమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా.. ఇంకా వారి ఆశలు నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వారి ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ అబద్ధాల కోరులేనని, తోడుదొంగలని ధ్వజమెత్తారు. వారిద్దరి మధ్య అనేక విషయాల్లో చీకటి ఒప్పందం సాగుతోందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పేదల జీవనం దుర్భరంగా మారితే, కేంద్రంలో మోదీ హయాంలో నిత్యావసరాలతో పాటు పెట్రోలు, డీజీల్ ధరలు భారీగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ కేవలం అదానీ లాంటి బడా వ్యాపారస్తులకు మాత్రమే మేలుచేస్తూ పేదలను పట్టించుకోలేదని మండిపడ్డారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరిపై రూ.1.40 లక్షల అప్పు ఉందని వివరించారు. కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి రేవంత్ పిలుపు దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు ఇవ్వని సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతుబంధు నిధులు వేయడానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న కేసీఆర్, దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు నిధులు ఇవ్వడానికి ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు. సభలో ఏఐసీసీ కార్యదర్శి నాజిర్ హుస్సేన్, సందీప్, పరిశీలకుడు మోహన్‌జీ, బీహార్ సీఎల్పీ నాయకుడు షకీల్ ఆహ్మద్ ఖాన్, మాజీ ఎంపీ మల్లురవి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు. కవితను ఎందుకు అరెస్టు చేయలేదు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ ప్రధాని, హోంమంత్రి కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడతారని, అయితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనేక మందిని అరెస్టు చేసిన మోదీ ప్రభుత్వం కవితను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచానెహ్రునగర్‌లో శనివారం జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చారు. సనత్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ, టీపీసీసీ పరిశీలకులు మాణిక్‌రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీతోనే అవినీతి రహిత పాలన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/చౌటుప్పల్/పటాన్చెరు/బంజారాహిల్స్ (హైదరాబాద్): రాష్ట్రంలో బీజేపీతోనే అవినీతి రహిత పాలన అందుతుందని.. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కారు పదేళ్ల పాలనలో భారీగా అవినీతికి పా ల్పడిందని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులలో నిర్వహించిన సక ల జనుల విజయ సంకల్ప సభల్లో, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్వహించిన రోడ్ షోలలో అమిత్ షా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఅర్ఎస్ సర్కారు నిరుద్యోగులను మోసం చేసింది. కేసీఆర్ హయాంలో 14కుపైగా ఉద్యోగ పరీక్షల పేపర్లు లీకయ్యాయి. ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. బీజేపీ ప్రభుత్వం వస్తే పేపర్ లీకేజీలపై విచారణ జరిపి దోషులను జైలుకు పంపుతాం. అంతేకాదు 2.5 లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేస్తాం. కేసీఆర్‌కు ఇక్కడి యువతపై ప్రేమ లేదు. కానీ ఒక్క యువకుడు.. కేటీఆర్‌ను సీఎం చేయడంపైనే ఆయన ధ్యాస అంతా ఉంది. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి. చాలా ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడింది. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉంది. ఎంఐఎంకు భయపడి కేసీఆర్ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. బీజేపీ ప్రభుత్వం వస్తే.. తెలంగాణకు ఎంఐఎం చేతిలోంచి విముక్తి కల్పిస్తాం. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకే.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయొద్దు. వాళ్లకు ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే బీఆర్ఎస్లోకి వెళ్తారు. కాంగ్రెస్ ఇప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి రేపటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవుతారు. అదే బీజేపీకి ఓట్లు వేస్తే బీఆర్ఎస్కు బదులు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు తావులేని పాలన అందిస్తాం. ఉజ్వల లబ్దిదారులకు ఏటా నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. వాల్మీకి, బో య, మాదాసి కురువలను కేసీఆర్ విస్మరించారు. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి బీసీయే. మా ప్రభు త్వం రాగానే వాల్మీకి, బోయ, మాదాసి కురువలకు న్యాయం చేస్తాం. ఎస్సీ వర్గీకరణను త్వరలో పూర్తి చేస్తాం. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. యూరప్ మార్కెట్‌కు కొల్లాపూర్ మామిడి కొల్లాపూర్ మామిడి రైతులను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. బీజేపీ అధికారంలోకి రాగానే మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి.. కొల్లాపూర్ మామిడిని యూరప్ మార్కెట్‌కు తీసుకెళ్తాం. అయోధ్య రాముడి దర్శనం కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అడ్డు తగిలింది. అదే ప్రధాని మోదీ రామమందిర నిర్మాణం చేపట్టారు. జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఇక్కడి ప్రజలకు విడతల వారీగా ఉచితంగా రామమందిర దర్శనం కల్పిస్తాం..’’ అని అమిత్ షా తెలిపారు. రాహుల్‌యాన్.. 20 సార్లు ఫెయిల్ మోదీ ప్రభుత్వం చంద్రయాన్‌తో చంద్రుడిపై జాతీయ జెండాను రెపరెపలాడించింది. కానీ కాంగ్రెస్ పార్టీ పదేపదే రాహుల్‌యాన్ లాంచ్ చేయాలని చూస్తోంది. 20 ఏళ్ల నుంచి 20సార్లు రాహుల్ యాన్‌ను ప్రవేశపెడితే అన్నీ ఫెయిల్ అయ్యాయి. -
మమ్మల్ని ఎవరు గిల్లినా ఊరుకోం
వేములవాడ/సాక్షి, ఆసిఫాబాద్/రాంగోపాల్‌పేట్/అబిడ్స్: ‘మమ్మల్ని ఎవరు గిల్లినా ఊరుకొనేది లేదు’అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో 2017కు ముందు యూపీలోనూ అలానే ఉండేవని... మాఫియా, గూండాగిరీ, దాదాగిరీ, కబ్జాలు కొనసాగేవని చెప్పారు. అయితే యూపీ ప్రజలు కుటుంబ పాలనకు తెరదించి బీజేపీకి పట్టం కట్టడంతో ఇప్పుడు అవన్నీ బంద్ అయ్యాయన్నారు. ఇప్పుడు తమ రాష్ట్రంలో ఎవరైనా గూండాగిరీ, మాఫియా నడిపిస్తే బుల్డోజర్లతో బుద్ది చెబుతున్నామని పేర్కొన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఇప్పటివరకు తమ రాష్ట్రంలో ఒక్క రోజూ కర్ఫ్యూ పెట్టలేదని చెప్పారు. అలాగే అభివృద్ధి, ఆదాయంలోనూ యూపీ సర్‌ప్లస్‌లో కొనసాగుతోందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లలో రామరాజ్య స్థాపన విజయ సంకల్ప సభలతోపాటు హైదరాబాద్‌లోని సనత్‌నగర్, గోషామహల్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన రోడ్ షోలలో యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. హైదరాబాద్ పేరు మారుస్తాం... యూపీలో ఐదేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని, మరో 4 లక్షలు కల్పించబోతున్నామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు కోసం బీజేపీని గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలా రక్షణ కల్పించి రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ భాగ్యనగరాన్ని హైదరాబాద్‌గా మార్చిందని... తాము అధికారంలోకి వస్తే చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ మాత పేరుపై హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ చెట్టపట్టాలేసుకొని అభివృద్ధిని విస్మరిస్తున్నాయని... ఈ మూడు పార్టీల్లో ఎవరికి ఓటు వేసినా మిగతా ఇద్దరికీ చెందుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ బంధువులు మాత్రమే రాజ్యాధికారం చెలాయిస్తున్నారని దుయ్యబట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తో ఏర్పడిన రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఆ డిమాండ్లేవీ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. అధికారికంగా ‘విమోచనం’.. బీజేపీని గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఆ ఫలాలను వెనకబడిన వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటామని యోగీ ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. ఎంఐఎంకు భయపడే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. యూపీలో బీఎస్పీ ఒక్క సీటే గెలుచుకుందని... ఇక్కడ ఆ పార్టీని ప్రజలు నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే రామమందిరం కట్టించేదా? కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. -
సబ్బండ వర్గాల ఉద్యమాన్ని మింగేశారు
సాక్షి, హైదరాబాద్: ‘‘సబ్బండ వర్గాల’ఉద్యమాన్ని స్వార్థంతో మింగేసిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సారథిగా తనను తాను ప్రకటించుకున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘తెలంగాణ ఉద్యమంలో మీ స్వార్థాన్ని గురించి రాస్తే.. పెద్ద గ్రంథాలే తయారవుతాయి’అని నిందించారు. శనివారం సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి మూడో బహిరంగ లేఖ సంధించారు. ’’జలదృశ్యం’వేదికగా గాంధేయవాది కొండాలక్ష్మణ్ బాపూజీను ఉపయోగించుకున్నారు. తర్వాత బాపూజీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. మీతోపాటు తొలి అడుగులు వేసిన గాదె ఇన్నయ్య, విజయరామారావు, రవీంద్రనాయక్, మేచినేని కిషన్‌రావు వంటి నాయకులెందరినో విజయవంతంగా పక్కకు తప్పించడం మీకున్న ప్రత్యేక నైపుణ్యానికి ఒక ఉదాహరణ. తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో ఉన్న ఆచార్య జయశంకర్ సార్ వంటి తెలంగాణవాది భుజాలమీద ఎక్కి మేధావులను ముగ్గులోకి లాగారు. ఓడ ఎక్కేదాక ఓడమల్లన్న, ఒడ్డుచేరినాంక బోడ మల్లన్న’అనే సామెత మీకు సరిగ్గా నప్పుతుంది’అని ఆ లేఖలో ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల వద్ద నక్క వినయాలు ప్రదర్శించి సానుభూతి పొందేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ‘సెంటిమెంటును వాడుకుని ఎన్నికల్లో గెలవడం మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని చెప్పడంలో అనుమానం అక్కర్లేదు’’అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నాయి ‘ఆలె నరేంద్ర, దేవేందర్ గౌడ్ వంటి నాయకులను మీతో కలుపుకోవడం ద్వారా వారికి అస్తిత్వం లేకుండా చేయడం, మీ పనైపోయిన తర్వాత వారిని పక్కకు జరిపేయడం మీ ప్రత్యేకత. మీ చేతిలో మోసపోయిన వారిలో ఎక్కువమంది వెనుకబడిన వర్గాల వారే. ధర్నాలు, దీక్షలు, వంటావార్పు, రాస్తారోకోలు, రైల్ రోకోలు, సాగరహారం, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటివన్నీ ప్రజలు చేస్తుంటే.. ‘గాలికిపోయే పిండి కృష్ణార్పణం’అన్నట్లు..’చివర్లో మీరు, మీ కుటుంబసభ్యులే గెలిపించామన్నట్లు ఫోజులివ్వడం.. వంటివన్నీ తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయని ఆ లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమకారులను ఉరికించి కొడుతుంటే.. దిక్కుమొక్కులేని ఉద్యమాన్ని.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, కులసంఘాలు, మేధావులు, జర్నలిస్టులు.. అక్కున చేర్చుకుని తమ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లారు. కానీ రాష్ట్రం సాధించిన తర్వాత వారందరి పరిస్థితి దయనీయంగా మారింది’అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ.. మీ కుటుంబ ఆలోచనలే సర్వస్వంగా వ్యవహరిస్తున్న మీకు, మీ పార్టీకి రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెబుతారు’అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. -
రాష్ట్రంలో బీజేపీకి పట్టం కట్టండి
హుజూర్నగర్/చిలకలగూడ/ముషీరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రాన్ని భ్రషు్టపట్టిస్తుండటంతో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని విమర్శించారు. అందువల్ల ఆ పార్టీలను ఇంటికి పంపి బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభతోపాటు హైదరాబాద్‌లోని చిలకలగూడ, వారాసిగూడ, ముషీరాబాద్‌లలో చేపట్టిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. సకలజనులు ఏకమై కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో నిధులు పంపిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను దుర్వినియోగం చేస్తోందని నడ్డా ఆరోపించారు. ధరణి పోర్టల్ తెచ్చి నిరుపేదల అసైన్డ్ భూములను అందులో నమోదు చేయలేదని, ధరలు పెరిగాక వాటిని గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచి కేసీఆర్ దోపిడీ చేశారని ఆరోపణలు గుప్పించారు. దళితబంధు పథకం సొమ్మును లబ్దిదారులకు అందించేందుకు ఎమ్మెల్యేలు 30 శాతం లంచాలు తీసుకుంటున్నారని స్వయంగా కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. పీఎం ఫసల్ బీమా యోజన, గ్రామీణ్ ఆవాజ్ యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల రైతులకు రూ. వేలల్లో నష్టం జరిగిందని నడ్డా పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో స్కామ్‌లు... కాంగ్రెస్ అంటే అవినీతికి నిలువుటద్దమని, కాంగ్రెస్ హయాంలో అనేక స్కామ్‌లు జరిగాయని నడ్డా ఆరోపించారు. అటువంటి పార్టీని, నాయకులను నమ్మొద్దని, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరోమారు మోసం చేసేందుకు సిద్ధమైందని ఆయన దుయ్యబట్టారు. ‘డబుల్ ఇంజిన్’తో మరింత అభివృద్ధి.. మోదీ పాలనలో ఒక్క స్కామ్ కూడా జరగలేదని నడ్డా చెప్పారు. దేశ సుస్థిరత, సమగ్రత, ప్రజాసంక్షేమం బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. యువతకు, మహిళలకు, రైతులకు మేలు కలగాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఏడాదికి నాలుగు సిలిండర్లు ఫ్రీ.. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని, ఏటా ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, వరి క్వింటాల్‌కు రూ. 3,100 మద్దతు ధర ఇస్తామని, ఎరువులకు సబ్సిడీ పెంచుతామని నడ్డా హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పారదర్శకంగా 6 నెలల్లోగా భర్తీ చేస్తామని, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ కింద రూ. 5 లక్షల బీమాను రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. -
ఒక్కో ఓటునూ ఒడిసిపట్టండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంతోపాటు పోలింగ్ ముగిసేదాకా పార్టీ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని.. క్షేత్రస్థాయిలో ఒక్కో ఓటును ఒడిసిపట్టాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని ఆదేశించారు. పార్టీ కేడర్ ప్రతీ గడపకూ వెళ్లాలని, బీఆర్ఎస్కే ఓటేసేలా ప్రయత్నం చేయా లని సూచించారు. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థుల ప్రచార తీరుతెన్నులపై కేసీఆర్ శనివారం సుదీర్ఘంగా సమీక్షించారు. పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలువురితో ఫోన్లలో మాట్లాడారు. సభ రద్దవడంతో.. శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగాల్సిన బీఆర్ఎస్ బహిరంగ సభ రద్దయిన నేపథ్యంలో.. కేసీఆర్ రోజంతా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమీక్షలు నిర్వహించారు. సర్వేలు, నిఘా సంస్థల నివేదికలు, వివిధ మార్గాల నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించారు. నియోజకవర్గాల వారీగా ప్రచార తీరుతెన్నులు, అభ్యర్థుల పనితీరు, ఇతర పార్టీల స్థితిగతులపై పార్టీ నేతలతో చర్చించారు. గెలుపు అవకాశాల ఆధారంగా నియోజకవర్గాలను కేటగిరీలుగా వర్గీకరించి, మెరుగుపడాల్సిన నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్చార్జులకు దిశానిర్దేశం చేశారు. తీవ్ర పోటీ ఉన్న నియోజకవర్గాల ఇన్చార్జులకు ప్రత్యేక సూచనలు చేశారు. పార్టీ గెలుపోటములపై మౌఖిక ప్రచారాలతో గందరగోళానికి గురికావద్దని నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. తాజా సర్వే ఫలితాలు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని సూచించారు. మూడోసారీ అధికారంలోకి వస్తామని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిస్థితిపై పోస్ట్‌మార్టం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత గత నెల 15వ తేదీ నుంచి ఇప్పటివరకు కేసీఆర్ 82 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం పూర్తి చేశారు. పరేడ్ మైదానంలో సభ రద్దయిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, కూకట్పల్లి, మేడ్చల్ లేక మల్కాజ్గిరి నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు నిర్వహించాలని శనివారం జరిగిన సమీక్షలో నిర్ణయించినట్టు సమాచారం. ప్రతిపక్షాల పోల్ మేనేజ్మెంట్ ప్రణాళికలు, పార్టీపరంగా అనుసరించాల్సిన పోల్ మేనేజ్మెంట్ వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తదితరులు చేస్తున్న విమర్శలు, వాటిని తిప్పికొట్టాల్సిన తీరుపైనా సూచనలిచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుల రోడ్‌షోలకు వస్తున్న స్పందన, మేనిఫెస్టోలోని అంశాలు ఎంతమేర ప్రజల్లోకి వెళ్లాయన్న దానిపై ఆరా తీశారు. ప్రధాని మోదీ వరుసగా మూడో రోజులు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. ఆయా నియోజకవర్గాలపై ఎంతమేర ప్రభావం ఉంటుందనే కోణంలో సర్వే, కన్సల్టెన్సీ సంస్థల నుంచి నివేదిక కోరినట్టు సమాచారం. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే..కేసీఆర్‌కు వేసినట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది కేసీఆర్‌కు వేసినట్టేనని, బీఆర్ఎస్కు అధికారం అప్పగించినట్టేనని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వెళ్లి బీఆర్ఎస్లో చేరారని, గత పదేళ్లలో అంతా కలసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అవినీతిపై విచారణ జరిపిస్తామని, దోచుకున్న సొమ్మును వసూలు చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు ఎలాంటి ప్రజాస్వామ్య విలువలు లేవని, వాటికి కుటుంబ పాలనే సర్వస్వమని విమర్శించారు. బీఆర్ఎస్–బీజేపీ మధ్య పొత్తు ఏర్పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలతో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే తెలంగాణ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. శనివారం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జీ ప్రకాశ్ జవదేకర్, ఇతర నేతలతో కలసి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు మినహా చేసిందేమీ లేదు. మిషన్ భగీరథ, పాస్‌పోర్ట్ స్కాం, మియాపూర్ భూముల అక్రమాల్లో వందల కోట్ల కుంభకోణం, ఔటర్‌రింగ్‌రోడ్డు టెండర్ల స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టు, ఢిల్లీ మద్యం స్కాం, గ్రానైట్ కుంభకోణం.. ఇలా ఎన్నో రూపాల్లో అవినీతి జరిగింది. కాగ్ నివేదిక ప్రకారం మిషన్ కాకతీయలో రూ.22వేల కోట్లు ఖర్చు చేసినా 65 శాతమే పనులు పూర్తయ్యాయి. దళితబంధు, డబుల్ బెడ్రూం స్కీంలలో దళితుల నుంచి కమీషన్లు దండుకున్న చరిత్ర బీఆర్ఎస్ నేతలది. విచారణ చేసి జైలుకు పంపుతాం బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడగానే ఒక్కొక్కఅవినీతి ఆరోపణపై విచారణ జరిపి, దోషులుగా తేలిన ప్రతీ ఒక్కరిని కటకటాల వెనక్కి పంపిస్తాం. హైదరాబాద్‌లో రోహింగ్యాల చొరబాటు, ఇక్కడ ఆశ్రయం పొంది ఓటర్ కార్డులు పొందడంపై ఎన్ఐఏ విచారణ సాగుతోంది. దీనిపై కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. పదిరోజుల క్రితమే కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి సొమ్ముతో ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రలోభాల కోసం కర్ణాటక నుంచి, ఇతర రూపాల్లో వస్తున్న అక్రమ డబ్బు విషయంలో ఏజెన్సీలు, ఈసీ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కేసీఆర్‌ను మార్చాలంటూ కాంగ్రెస్‌కు ఓటేస్తే.. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ తెలంగాణ విరోధిగా నిలిచింది. సుదీర్ఘ పాలనలో తెలంగాణను అణచివేసింది. ఉమ్మడి ఏపీలో నాటి సీఎం టి.అంజయ్యను తీవ్రంగా అవమానించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించిన తీరు తెలంగాణ ప్రజల మనస్సులో నాటుకుపోయింది. 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి వెనక్కితగ్గి దాదాపు 1,500 మంది ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ కారణమైంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కానీ కాంగ్రెస్‌కు ఓటు వేసినా, ఒవైసీలకు ఓటు వేసినా బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు పడ్డట్టే. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వెళ్లి బీఆర్ఎస్లో చేరిపోయారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే అవినీతి తప్ప మరేమీ చేయలేదు. గత పదేళ్లలో అంతా కలసి అవినీతికి పాల్పడ్డారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు తీరాలంటే బీజేపీని గెలిపించాలి. ప్రస్తుత పథకాలేవీ ఆపబోం.. తెలంగాణతోపాటు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో చైతన్యవంతమైన ఇక్కడి ఓటర్లు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి అండగా నిలుస్తారని, డబుల్ ఇంజిన్ సర్కార్‌ను తీసుకొస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై బీసీ నేతను సీఎంను ఎన్నుకుంటారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలేవీ మేం ఆపబోం. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే తొలి కేబినెట్ భేటీలోనే పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటాం. బీఆర్ఎస్ సర్కార్ ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వాటిని సర్దుబాటు చేస్తాం. ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకుంటాం. ప్రజలు రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి..’’అని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. -
రాష్ట్రంలో బీజేపీ గాలి
సాక్షి, కామారెడ్డి/సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ అంతటా బీజేపీ గాలి వీస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ నుంచి విముక్తి కోసం బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు. ఏడు దశాబ్దాల కాంగ్రెస్ నుంచి కూడా ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలను ఓడించి వారికి గుణపాఠం చెప్పాలని కోరారు. తెలంగాణకు బీసీని సీఎం చేస్తామని చెబుతున్నామని, అధికారం అప్పగిస్తే చెప్పినట్లు బీసీని సీఎం చేసితీరుతామని స్పష్టం చేశారు. బీసీనైన తనకు ప్రధానమంత్రి పదవి అవకాశం ఇచ్చింది బీజేపీయేనన్నారు. దళితుణ్ణి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చేస్తానన్న కేసీఆర్.. మోసం చేసి, సీఎం కుర్చీని కబ్జా చేశారన్నారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మోసగాళ్లు ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మోసగాళ్లు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. లోపల మాత్రం కలిసే ఉంటున్నారు. ఆ రెండూ ఒక్కటే. కుటుంబ, అవినీతి పార్టీలు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్ కార్బన్ సర్కార్‌కు ఓటేసినట్లే. కేసీఆర్ చరిత్ర కాంగ్రెస్‌తోనే ప్రారంభమయ్యింది. 2004లో కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా అదే పార్టీ అధినేత వద్దకు వెళ్లాడు. కాంగ్రెస్‌లో గెలుపొందిన అభ్యర్థులు బీఆర్ఎస్లో మంత్రులయ్యారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పడానికి ఇదే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. బీజేపీ ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకుంటే బీఆర్ఎస్ ఆమెను ఓడించేందుకు కుట్ర పన్నింది. కాంగ్రెస్ వేల కోట్ల అవినీతికి పాల్పడింది. కేసీఆర్ కూడా అదే స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. ఇరిగేషన్ స్కీంను...ఇరిగేషన్ స్కాంగా మార్చారు. దళిత బంధును..ఎమ్మెల్యే బంధుగా మార్చేశారు. ఆ రెండు పార్టీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వ్యతిరేకులు. బీసీ సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి..’ అని మోదీ ఆరోపించారు. మీ పిల్లల భవిష్యత్తుకు పని చేసేది బీజేపీయే ‘హఠాత్తుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారుతుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ఇండియా కూటమి అవుతుంది. పేర్లు మారినంత మాత్రాన వాళ్ల బుద్ధి మారదు. అవినీతిలో మునిగి తేలుతారు. వాళ్లు వాళ్ల పిల్లల కోసమే పనిచేస్తారు. బీజేపీ మాత్రమే మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. తెలంగాణలో పేదలు, రైతులు, మహిళలు, యువత, దళితులు, ఆదివాసీల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా మేనిఫెస్టో రూపొందించింది. బీజేపీ చెప్పింది చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్ రద్దు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, రైతులకు పంట ఉత్పత్తుల ధరల పెంపు, రామ మందిర నిర్మాణం వంటి హామీలన్నింటినీ నెరవేర్చాం. తెలంగాణలో పసుపుబోర్డు, ఆదివాసీలకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటివీ నెరవేర్చాం. మాదిగ సమాజానికి న్యాయం చేయడానికి ముందుకు వచ్చాం. ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు సుప్రీంకోర్టులో కేసు విషయంపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించాం. గతంలో దేశం మొత్తం మీద బీజేపీకి ఇద్దరే ఎంపీలు ఉన్నపుడు అందులో ఒకరు తెలంగాణ నుంచే. అందుకే తెలంగాణ గడ్డ మీద బీజేపీకి ఎంతో అభిమానం..’ అని ప్రధాని చెప్పారు. 40 లక్షల మంది రైతులకు లబ్ధి ‘బీఆర్ఎస్ పెద్దలకు డబ్బులు అవసరం ఉంటే సాగునీటి ప్రాజెక్టు అంటూ కొత్త పేరుతో అంచనాలు పెంచేసి దండుకుంటారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులతో జేబులు నింపుకుంటారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. తెలంగాణలో 40 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. రూ.2,800 నుంచి రూ.3 వేలకు ఇవ్వాల్సిన యూరియా బస్తాను బీజేపీ ప్రభుత్వం రైతులకు కేవలం రూ.3 వందలకే ఇస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్రం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. తెలంగాణలో వానాకాలంలో అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. చెరుకు పంటను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డును తీసుకొస్తున్నాం. బీజేపీ పేదలకు మరో ఐదేళ్లు ఉచితంగా బియ్యం అందిస్తుంది. వేగవంతమైన ప్రయాణానికి వందేభారత్ రైళ్లను ప్రారంభించాం. నారీ స్వశక్తి ద్వారా కోట్లాది మంది మహిళలకు న్యాయం చేస్తున్నాం..’ అని తెలిపారు. ఓటమి భయంతోనే రెండుచోట్ల పోటీ ‘తెలంగాణ యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రం. అయితే ఇక్కడి ప్రభుత్వం యువతకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాల విషయంలో అన్యాయం చేసింది. విద్యారంగాన్ని విస్మరించింది. కాంగ్రెస్ వల్ల తెలంగాణలో వేలాది మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు రెండుచోట్ల పోటీ చేస్తున్నారు. వాళ్లిద్దరినీ ఓడించే అవకాశం కామారెడ్డి ప్రజలకు వచ్చింది. డిసెంబర్ 3న కేసీఆర్‌ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు..’ అని మోదీ అన్నారు. మీ కల నెరవేర్చేది మోదీ సంకల్పమే.. ‘నేను కాశీ నగరానికి నాయకుడిని. మహేశ్వరం శివగంగా మందిర్‌కు ప్రసిద్ధి. ఈ గడ్డ మీద అడుగు పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలంగాణ యువకుల్లారా నా మాట రాసి పెట్టుకోండి. రైతులు, యువకులు, కార్మీకులు, దళితులు, ఆదివాసీలు, ప్రతి ఒక్కరికీ గ్యారంటీ ఇస్తున్నా. మీ కలలను నెరవేర్చేది మోదీ సంకల్పమే. చిన్నపాటి వర్షానికే బస్తీలు నీట మునుగుతున్నాయి. తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. బీజేపీకి సేవ చేసే అవకాశం ఇస్తే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తా. తెలంగాణలో నిజాం సుల్తాన్లకు చోటు లేదు..’ అని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల వెంట తానుంటానని, తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తానని, రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయని, తెలంగాణలో మార్పు కోసం, అవినీతి పాలనను గద్దె దించేందుకు తెలంగాణ ప్రజానీకం కంకణం కట్టుకొని ముందుకు పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు జి లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నారాయణఖేడ్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ అభ్యర్థులు అరుణతార, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, వడ్డెపల్లి సుభాష్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, సంగప్ప, అందెల శ్రీరాములు యాదవ్, రవికుమార్ యాదవ్, తోకల శ్రీనివాస్ రెడ్డి, నోముల దయానంద్ గౌడ్, అందె బాబయ్య తదితరులు పాల్గొన్నారు. -
హరీష్‌రావు ముందు కొత్త సవాల్.. బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ అదేనా?
తెలంగాణలోని రెండు నియోజకవర్గాలు అన్ని పార్టీలకు హాట్ టాపిక్‌గా మారాయి. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు కూడా గట్టిగానే ఉన్నారు. కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయడమే ఆసక్తికరం కాగా.. రెండు చోట్లా బరిలో ఉన్న ప్రత్యర్థులు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. గజ్వేల్‌లో రెండుసార్లు గెలిచిన కేసీఆర్ హ్యట్రిక్ సాధించడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ ప్రధాన పార్టీల ప్రచారం ఎలా ఉందంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో గులాబీ పార్టీ ప్రచార బాధ్యతలు మంత్రి హరీష్‌రావు నిర్వహిస్తున్నారు. హరీష్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజలకు తాము చేసిన అభివృద్ధి గురించి, బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరంగా చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఈసారి గులాబీ బాస్‌కు లక్షకు పైగా మెజారిటీ రావాలనే లక్ష్యంతో ప్రచారం సాగిస్తున్నారు. హరీష్ రావు ఇప్పటివరకు నాలుగు మండలాల్లో ప్రచారం పూర్తి చేశారు. ఇక నియోజకవర్గ నేతలందరూ పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ సెగ్మెంట్లోని అన్ని మండలాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గతంలో ప్రకటించినట్టుగానే హుజూరాబాద్, గజ్వేల్ నుండి కమలం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ రెండు నియోజకవర్గాల్లోనూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఈటల ప్రచారం పూర్తయింది. గజ్వేల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలకు బీజేపీ కండువా కప్పి కమలం గూటికి ఆహ్వానించారు. పలు గ్రామాల సర్పంచులు కూడా ఈటల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ ఓటమే తన లక్ష్యంగా జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడినుంచే రెండుసార్లు గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నియోజకవర్గంలోనే ఇప్పటివరకు సమస్యలు తీరకపోవడం సిగ్గుచేటు అంటూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. గజ్వేల్ ప్రజలు రెండుసార్లు మంచి మనసుతో కేసీఆర్‌ను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే.. పదేళ్ళయినా నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని మరోసారి గెలిపిస్తే ప్రజలకు అధోగతే అని కాంగ్రెస్ అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్‌లకు ఈ నియోజకవర్గంతో సంబంధం లేదని.. కేసీఆర్‌ది పక్క నియోజకవర్గం అయితే.. ఈటల పక్క జిల్లాకు చెందిన నాయకుడని.. తాను మాత్రం ఎల్లప్పుడూ ప్రజలతో గజ్వేల్‌లోనే ఉంటానని చెబుతున్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గజ్వేల్‌లో, రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని నర్సారెడ్డి తన ప్రచారంలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2009లో ఒకసారి తూముకుంట నర్సారెడ్డి గజ్వేల్‌లో విజయం సాధించారు. గజ్వేల్‌లో ఏ పార్టీ గెలుస్తుందో రాష్ట్రంలో ఆ పార్టీకే అధికారం దక్కడం ఒక విశేషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మూడోసారి కూడా ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. ధరణి పోర్టల్ బాధితులు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్వాసితుల బాధితులు, నిజామాబాద్‌లో చెరుకు ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన రైతులు గజ్వేల్‌లో 127 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. 70 మంది అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం గజ్వేల్ పోటీలో మొత్తం 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గతంలో సిద్ధిపేట నుంచి గెలిచిన గులాబీ బాస్ కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గజ్వేల్‌కు మారారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో లోక్‌సభకు పోటీ చేసిన కేసీఆర్.. సిద్దిపేట నియోజకవర్గాన్ని హరీష్‌రావుకు అప్పగించారు. అక్కడి నుంచి హరీష్‌రావు వరుసగా గెలుస్తూనే ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ గజ్వేల్‌లో కేసీఆర్ భారీ మెజారిటీతో గెలిచారు. గత ఎన్నికల్లో 58 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించిన కేసీఆర్ మెజారిటీని ఈసారి లక్ష దాటించాలని గులాబీ శ్రేణులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరి గజ్వేల్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.. -
ఫైనల్ స్టేజ్‌కు ప్రచారం.. కేసీఆర్ బిగ్ ప్లాన్!
ఇంకా కొద్ది రోజులే మిగిలింది. ఓటరు దేవుళ్ళు నిర్ణయం చెప్పే టైమ్ తరుముకొస్తోంది. అన్ని పార్టీలు ఉరకలు.. పరుగులతో ప్రచారం చేసుకుంటున్నాయి. తెలంగాణ వినువీధిలో విమానాలు, హెలికాప్టర్ల రొద పెరుగుతోంది. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. వ్యూహం మార్చి.. గేర్ మార్చడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారా? ఇప్పటివరకు సాగిన ప్రచారంపై కేసీఆర్‌కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి? ఇకముందు కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోంది?.. తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ అన్ని పార్టీల అగ్రనాయకులు, అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. చావో రేవో అన్నట్లుగా అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రచారం చేసే అగ్రనేతలు.. రోడ్ షోలు.. ఇంటింటి ప్రచారాలతో అభ్యర్థులు తలమునకలవుతున్నారు. ఇక అధికార బీఆర్ఎస్ ప్రచారంలో స్పీడ్ పెరుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహం మార్చబోతున్నారు. అదేవిధంగా గేర్ మార్చి ప్రచారంలో మరింత స్పీడ్‌గా దూసుకుపోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచార సభలపై పార్టీ నేతల నుంచి సీఎం కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఇప్పటికి దాదాపు 68 సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. సరిగ్గా పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చబోతున్నారు. గత వారం రోజుల నుంచి మాటల్లో పదును పెంచిన సీఎం కేసీఆర్ రాజకీయ తూటాలు భారీగా పేల్చుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడం లేదు. ఇక ప్రచార సరళి, డోర్ టూ డోర్ క్యాంపెయిన్‌పై కూడా కేసీఆర్ ఆరా తీశారు. సంక్షేమ పథకాలు అందిన లబ్దిదారులను ఎంత మందిని కలిశారు? వారి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అంటూ అన్ని జిల్లాల నుంచి ఫీడ్ బ్యాక్ రిపోర్ట్ తీసుకున్నారు. అందులో సంక్షేమ పథకాలు పొందిన లబ్ధి దారులు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ గులాబీ బాస్‌కు అందింది. అంతేకాదు యువతలో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోందనీ ఎన్నికల తేదీ నాటికి వారికి ఏదో ఒక భరోసా కల్పిస్తే పెద్దగా నష్టం ఉండదని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇంచార్టీలతో ప్రత్యేకంగా కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల పని తీరు బాగాలేని అభ్యర్థులకు కేసీఆర్ క్లాస్ పీకినట్టు గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పని తీరు మారకుంటే విజయం సాధించడం కష్టమేనని వారికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయం వరకు ఏ మాత్రం ఏమరుపాటు పనికిరాదని కేసీఆర్ వారికి తెలిపినట్టు సమాచారం. నిన్నటి వరకు జరిగిన సభల తీరు, జనాల నుంచి ఎలాంటి స్పందన ఉందని వార్ రూం బాధ్యుల నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని, ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకోవాలని కేసీఆర్ సూచించారు. ఈనెల 25న హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించబోతోంది. ఇందుకోసం భారీ జన సమీకరణ చేపట్టాలని సిటీ బహిరంగ సభ తర్వాత ప్రచారం ముగిసే సమయం మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో మరింత వేగంగా ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు కేసీఆర్ సిద్ధం చేశారు. అందుకే కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వాటిలో ఉన్న అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెల 25న గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా హ్యాట్రిక్ సాధించేందుకు రెండు నుంచి మూడు కొత్త పథకాలు కేసీఆర్ వివరించబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలే కాకుండా కొత్త హామీలు కూడా అమలు చేసిన ప్రభుత్వం తమది కాబట్టి కచ్చితంగా మరో రెండు మూడు పథకాలు ఈ సభలో ప్రకటిస్తే జనం ఆలోచన ఖచ్చితంగా మారుతుందని, మళ్లీ అధికారం చేజిక్కించుకోవచ్చనే ధీమాతో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ సాధిస్తామని గులాబీ పార్టీ ధీమాగా ఉంది. అదే సమయంలో ఏమాత్రం ఏమరుపాటు తగదని కూడా కేసీఆర్ తన పార్టీ నేతలను, శ్రేణులను హెచ్చరిస్తున్నారు. మూడోసారి అధికారం కోసం ప్రచారంలో గేర్ మార్చి వ్యూహం మార్చుతున్నారు. ఇక, రిజల్ట్ కోసం ఎదురు చూడాల్సిందే. -
‘నాన్న కూచి’లు గెలిచేనా..!
సాక్షి, హైదరాబాద్ : ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురూ నాన్న కుట్టిలే. నాన్నతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నవారే. ఇపుడు నాన్నలు లేరు. వారి ఆశయాలను తాము నిజం చేస్తామంటూ ఆ ముగ్గురు అమ్మాయిలు ఎన్నికల బరిలో ఉన్నారు. తమని గెలిపిస్తే తమ తండ్రులు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. ఎన్నికల ప్రచాంరలో ముగ్గురూ దూసుకుపోతున్నారు. పైగా ముగ్గురు అమ్మాయిల నాన్నలకు సమాజంలో వారి వారి నియోజక వర్గాల్లో చాలా మంచి పేరే ఉంది. అందుకే తమ విజయాలపై ముగ్గురూ ధీమాగా ఉన్నారు. డిసెంబరు మూడున తాము ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమంటున్నారు. ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో ముగ్గురు అమ్మాయిలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ ముగ్గురూ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. మరో అమ్మాయి తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన కీలక నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలోఉన్నారు. ఈ ముగ్గురు అమ్మాయిల తండ్రులూ కాలం చేశారు. జీవించి ఉన్న సమయంలో ఈ అమ్మాయిలు తమ తండ్రులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. నాన్న నడవడిక.. ఆయన వ్యవహారశైలిని దగ్గరగా గమనించారు. ఇపుడు వారి వారసులుగా పోటీ చేసి ఎన్నికల్లో గెలిచాక వారి ఆశాయాలకు అనుగుణంగా ప్రజాసేవ చేయాలని భావిస్తున్నారు. కంటోన్మెంట్ నియోజక వర్గ దివంగత ఎమ్మెల్యే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో తెలుగుదేశం పార్టీ తరపున కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి గెలిచిన సాయన్న ఆ తర్వాత 1999,2004 ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ నుంచి వరుస విజయాలు సాధించారు. 2009 ఎన్నికల్లో నాలుగోసారి గెలిచారు. 2014 లోనూ టీడీపీ తరపున బరిలో దిగి నాలుగోసారి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్వగా విజయం సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్ర ఆనారోగ్యంతో ఆయన మృతి చెందారు. ఆయన కూతురు లాస్య నందితను సాయన్న జీవించి ఉండగానే రాజకీయాల్లో యాక్టివ్ చేశారు. ఇపుడు ఆమె బీఆర్ఎస్ అభ్యర్ధిగా తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తోన్న కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచే బరిలో ఉన్నారు. తన తండ్రి మిగిల్చి పోయిన అభివృద్ధి పనులు తాను పూర్తి చేస్తానని.. పేదలకు ఎప్పుడూ అండగా ఉండాలన్న తన తండ్రి ఆశయాకు అనుగుణంగా పనిచేస్తానని ఆమె అంటున్నారు. కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా డాక్టర్ గుమ్మడి వెన్నెల పోటీ చేస్తున్నారు. ఈమె పరిచయం అవసరంలేని ప్రజాగాయకుడు గద్దర్ కూతురు. తన పాటతో మావోయిస్టు ఉద్యమానికి ఊపు తెచ్చిన గద్దర్ దశాబ్ధాల పాటు విప్లవ ఉద్యమంలో ఉన్నారు. జననాట్యమండలి సభ్యుడిగా ఉంటూ జానపదాలతో జనాన్ని కదిలించారు. ఉద్యమం వైపు ఉరికించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా గద్దర్‌కు వీరాభిమానులు ఉన్నారు. సాయుధ పోరాట నినాదంతో ఉద్యమంలో అడుగు పెట్టిన గద్దర్ చివరకు బులెట్ కాదు బ్యాలెటే బెటరని నిర్ణయించుకుని సొంత పార్టీ కూడా పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయన మరణించారు. ఆయన కూతురు వెన్నెల తన తండ్రి కలలు కన్న ప్రజాసంక్షేమం కోసం పాటు పడాలని భావిస్తున్నారు. ఆమెను గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక రేసులో ఉన్న మూడో అమ్మాయి పి.విజయారెడ్డి. ఖైరతాబాద్ దివంగత ఎమ్మెల్యే పి.జనార్ధన రెడ్డి గారాల పట్టి విజయారెడ్డి. ఖైరతాబాద్ నియోజక వర్గంలోనే కాదు గ్రేటర్ పరిధిలో కార్మిక సంఘాల్లో పీజేఆర్‌కు చాలా పట్టుంది. జననేతగా పేరు గడించారు. 1985లో మొదటి సారి ఖైరతాబాద్ నియోజక వర్గం నుంచి గెలిచిన పీజేఆర్ ఆ తర్వాత వరుసగా 1989,1994 ఎన్నికల్లోనూ విజయభేరి మోగించారు. 1994లో కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం 26 మంది మాత్రమే గెలిస్తే అందులో పీజేఆర్ ఒకరు కావడం విశేషం. అప్పుడు అసెంబ్లీలో సీఎల్పీ నేతగా ఆయనే వ్యవహరించారు. 1999లో ఓటమి చెందిన పీజేఆర్ తిరిగి 2004లో మరోసారి గెలిచారు. నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఆయన కూతురు పి. విజయారెడ్డి ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. కంటోన్మెంట్ నుంచి బరిలో ఉన్న లాస్య నందిత- వెన్నెల లో ఎవరో ఒకరు గెలిచే అవకాశం మాత్రమే ఉంది. ఖైరతాబాద్‌లో విజయారెడ్డి గెలిచే అవకాశాలు బానే ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. అదే విధంగా కంటోన్మెంట్లో సాయన్న వారసురాలిగా లాస్య నందిత కూడా గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు . మొత్తానికి నాన్నల వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ఈ ముగ్గురు అమ్మాయిల భవితవ్యం ఎలా ఉంటుందో డిసెంబరు మూడున తేలిపోతుంది. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే వచ్చేది బీఆర్ఎస్ జిరాక్స్ సర్కారే : ప్రధాని మోదీ
సాక్షి,తుక్కుగూడ : కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్కు కార్బన్ పేపర్ లాంటి సర్కారే వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయి. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే ప్రారంభమయింది. బీఆర్ఎస్ గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది’ అని మోదీ గుర్తు చేశారు. ‘హుజరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీలో బీజేపీ గెలిచింది. బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది. తెలంగాణ అభివృద్ధి మోదీ సంకల్పం. మీకు నేను గ్యారంటీ ఇస్తున్నా. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సమాజ విరోధి పార్టీలు. కాంగ్రెస్ పార్టీ సీతారాం కేసరి లాంటి బీసీ నేతను అవమానించింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీ వర్గీకరణపై అధికారులతో నిన్న భేటీ అయ్యాను. ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిందిగా అధికారులకు సూచించాను. పెట్రోల్, డీజిల్ పై తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ తగ్గించలేదు’ అని మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌కు కేసీఆర్ ప్రాణ మిత్రుడు ‘కాంగ్రెస్‌కు కేసీఆర్ ప్రాణ మిత్రుడు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలిచింది. మాదిగ సమాజానికి బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసింది. బీజేపీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా టైముకు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ తెలంగాణను అవినీతిలో నెంబర్ వన్ చేసింది. అభివృద్ధి అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు గిట్టదు. బీజేపీతోనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు’ అని మోదీ తెలిపారు. ఇదీచదవండి..‘వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు’ -
‘వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు’
మధిర: వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు అని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం మధిరలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఈ సభకు ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. పోరాటాల గడ్డ మధిర ‘మధిర పోరాటాల గడ్డ. కేసీఆర్ మొన్న ఇక్కడ సభ పెట్టి ఇక్కడ భట్టి విక్రమార్క గెలవడని చెప్పారు. ఒక్క కేసీఆర్ కాదు వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు. మధిరలో 50 వేల మెజార్టీతో గెలుస్తా. కేసీఆర్, కేటీఆర్ ఉడత ఊపులకు మధిర ప్రజలు భయపడరు’ అని దీటుగా బదులిచ్చారు భట్టి విక్రమార్క. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్‌కే ఓటాయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారం వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆనందంగా ఉంది: ప్రియాంక ఇవాళ సంతోషంగా ఉందని, భట్టి నియోజకవర్గానికి వచ్చినందుకు ఆనందంగా ఉందని ప్రియాంక గాంధీ మధిర ప్రచార సభలో పేర్కొన్నారు. పాదయాత్ర చేసినందుకు భట్టి విక్రమార్కను అభినందిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆమె ఎండగట్టారు. బీజేపీపైనా విమర్శలు చేశారు. ‘రాత్రి సోనియా గాంధీతో మాట్లాడాను. హైదరాబాద్‌లో ఉన్నాను, భట్టి నియోజకవర్గానికి వెళ్తున్నానని చెప్పాను. తెలంగాణ వెళ్తున్నావు.. ప్రజలకు ఏం సందేశం ఇస్తావని సోనియా అడిగారు. సత్యమ మాత్రమే చెబుతానన్నాను. మంచి ప్రభుత్వం కోసం తెలంగాణ ప్రజలు ఆశపడ్డారని, తెలంగాణ కలల సాకారం కోసం బలమైన ప్రభుత్వం రాబోతోందని సోనియా చెప్పారు’ అని ప్రియాంక పేర్కొన్నారు. -
కేసీఆర్‌కు ఒవైసీ అంటే భయం: సీఎం యోగి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, వేములవాడ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ స్పీడ్ పెంచింది. జాతీయ నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేములవాడలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. వేములవాడలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. అందుకే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కేసీఆర్‌కు మజ్లీస్ నేత ఒవైసీ అంటే భయం. అందుకే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంల లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవీ నెరవేరలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలలను సాకారం చేయకపోగా ఆ కలలను నిర్వీర్యం చేసేశారు. అవినీతి, కుటుంబపాలనతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసింది. బీజేపీ ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి అవి ఇతర వెనుకబడిన వర్గాలకు కేటాయిస్తాం. మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా నేటి తెలంగాణ పరిస్థితే గతంలో ఉండేది. కానీ, ఇప్పుడు యూపీలో పూర్తిగా ఆ పరిస్థితి మారిపోయింది. ఆరేళ్లల్లో నిరుద్యోగాన్ని పారద్రోలాం, రైతులకు ఎన్నోరకాల మేలు చేశాం, పీడిత వర్గాలకు అండగా నిలిచాం. తెలంగాణాలో కూడా అలాంటి పరిస్థితి రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. డబుల్ ఇంజన్ సర్కారుంటే మోదీ విజన్ ప్రకారం ఓవైపు దేశంలో, మరోవైపు రాష్ట్రంలో రెండుచోట్లా అభివృద్ధి జరుగుతుంది. ప్రపంచంలో భారతదేశం గొప్పతనాన్ని చాటడంతో పాటు, భద్రతాపరంగా కూడా భారత్‌ను దృఢంగా నిల్పిన ఘనత మోదీది. ఇవాళ బీజేపీ వచ్చాక సమానత్వంతో పాటు.. మౌలిక సదుపాయలతో కూడిన సమ్మిళిత అభివృద్ధికి బీజం పడింది. సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్రమంత్రిగా ఎలాంటి సేవలందించారో మీకు తెలుసు. వేములవాడ వికాసం కోసం ఆయన కుమారుడు డాక్టర్ చెన్నమనేని వికాస్‌ను గెలిపించాలి. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. మీరంతా అయోధ్యకు ఉచితంగా రావాలని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.