breaking news
-
TS Govt: మాజీలకు గన్మెన్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: ప్రమాణ స్వీకారం జరిపిన మరుక్షణం నుంచే వివిధ శాఖలు, విభాగాలకు సంబంధించి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలో పలు విభాగాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ మరో నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగించింది. వాళ్లకు గన్మెన్లకు తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
గజ్వేల్ ఓటమితో ఇంకా కసి పెరిగింది: ఈటల రాజేందర్
సాక్షి, గజ్వేల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ఓటమి.. తనలో ఇంకా కసి పెంచిందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆయన గురువారం గజ్వేల్ నియోజకవర్గం బీజేపీ ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈటల రాజేందర్ తన ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో డబ్బు, మద్యం పంపిణీ చేసి మాజీ సీఎం కేసీఆర్ గెలిచారని ఆరోపించారు. గజ్వేల్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఓట్లు సాధించానని తెలిపారు. గజ్వేల్‌లో నైతికంగా బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదని మండిపడ్డారు. స్థానిక నేతలను భారీ మొత్తానికి కొని కేసీఆర్.. గజ్వేల్‌లో గెలిచారని ఆరోపించారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు తనకు ఓటమి తెలియదని అన్నారు. గజ్వేల్‌లో ఓటమి తనలో ఇంకా కసి పెంచిందని రాజేందర్ తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల టిక్కెట్ దక్కించుకున్న ఈటల రాజేందర్.. ఆ రెండు చోట్ల ఓడిపోవడం గమనార్హం. గజ్వేల్‌లో మాజీ సీఎం కేసీర్ చేతిలో ఓడిపోగా.. తనకు కంచుకోట లాంటి హుజురాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. చదవండి: ఉన్న వనరుల్నే వాడుకుంటాం : సీఎం రేవంత్ -
రేపే డిశ్చార్జి.. పాత ఇంటికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. తుంటి ఎముక విరగడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఆయన్ని వైద్యులు ఇంటికి పంపించనున్నారు. ఆపై ఆయన నేరుగా బంజారాహిల్స్ నందినినగర్‌లోని తన పాత నివాసానికి వెళ్తారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రగతి భవన్ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు షిఫ్ట్ అయ్యారాయన. ఈ క్రమంలో గత గురువారం రాత్రి బాత్రూంలో జారి కిందపడడంతో తుంటి ఎముక రెండుచోట్ల విరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం వివిధ పరీక్షలు జరిపి తుంటి ఎముక విరిగినట్లు నిర్ధారించింది. ఆపై విజయవంతంగా సర్జరీ చేసింది. అప్పటి నుంచి ఆయన కోలుకుంటూ వస్తుండగా.. ప్రముఖుల పరామర్శ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యుల బృందం.. రేపు డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. మరోవైపు నందినినగర్‌లోని కేసీఆర్ ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన సిబ్బంది ఇప్పటికే పూర్తి చేశారు. -
ప్రజాభవన్‌లోకి భట్టి ఫ్యామిలీ గృహ ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం చేశారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. ఇక, గృహ ప్రవేశం అనంతరం భట్టి దంపతులు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం సందర్భంగా హోమం కార్యక్రమం చేపట్టారు. ఈ హోమం కార్యక్రమంలో భట్టి దంపతులు పాల్గొన్నారు. అనంతరం, భట్టి విక్రమార్క సచివాలయానికి బయలుదేరారు. కాసేపట్లో సచివాలయంలోని తన చాంబర్లో భట్టి ఛార్జ్ తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చింది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, ప్రజాదర్బార్‌ను కొత్త ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కాగా, రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఎంసీఆర్హెచ్ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్ స్పీచ్‌కు కేబినెట్ ఆమోదం
Live Updates.. తెలంగాణ అసెంబ్లీ రేపటికి(శుక్రవారం) వాయిదా రేపు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం ముగిసిన కేబినెట్ సమావేశం ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం గవర్నర్ స్పీచ్‌కు కేబినెట్ ఆమోదం రేపు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం అసెంబ్లీకి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్.. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు శుభాకాంక్షలు సీనియర్ ఎమ్మెల్యేగా అన్ని సమస్యలు గడ్డం ప్రసాద్‌కు తెలుసు. స్పీకర్‌గా ఎన్నిక ఏకగ్రీవం కావడం కోసం సహాకరించిన ప్రతిపక్ష పార్టీలకు కృతజ్ఞతలు గడ్డం ప్రసాద్ సభను ఉన్నతంగా నడుపంతారనే నమ్మకం ఉంది సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. శాసనసభ దేవాలయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో అందరు భాగస్వాములు కావాలి ప్రజలు కేంద్రీకృతంగా ప్రజా సమస్యలపై శాసనసభ పని చేయాలి. గత స్పీకర్లు శాసనసభ పాటించిన విలువలు కాపాడుతూ మీరు మరింత వన్నె తేవాలి. కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక్క ఎమ్మెల్యే ఉండటం విచారకరం. ప్రజా సమస్యల పరిష్కారానికి మాకు కూడా సమయం కేటాయించాలి. మీ కనుసైగల ద్వారానే ఆవేశాలు తగ్గుతాయని, సమస్యల పరిష్కారం జరుగుతుందని ఆశిస్తున్నాను. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కేసీఆర్ మమ్మల్ని ఆదేశించారు. స్పీకర్‌గా ఎన్నికైన మీకు శుభాకాంక్షలు. మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలాగే సభ హక్కులను కాపాడాలని కోరుతున్నా. సామాన్య ప్రజలు సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలి. గతంలో చేనేత మంత్రిగా సిరిసిల్లకు వచ్చి కార్మికుల సంక్షేమానికి కృషి చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కి అభినందనలు శాసనసభలో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తాడని స్పీకర్‌పై పూర్తి నమ్మకం ఉంది విపక్షాలు స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపినందుకు విపక్ష పార్టీలకు ధన్యవాదాలు స్పీకర్ నిర్ణయాలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది మా తండ్రి శ్రీపాద రావు కూడా ఇదే శాసనసభలో పని చేసి ఎంతో ఔన్నత్యం తీసుకొచ్చాడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గడ్డం ప్రసాద్ ఎన్నిక స్పీకర్ పదవికి వన్నె తెచ్చింది. గడ్డం ప్రసాద్ చేనేత మంత్రిగా చేనేతల అభివృద్ధికి కృషి చేశారు. ప్రజా సమస్యలపై, వారి హక్కులపై చర్చిస్తారని ఆశిస్తున్నాను. స్పీకర్ ఎన్నికకు సంబంధించి సహకరించిన అన్ని పార్టీల నేతలకు ధన్యవాదాలు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ ఎన్నిక విషయంలో సానుకూలంగా సహకరించిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నేతలకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి సంప్రదాయం సభలో భవిష్యత్తులో కూడా కొనసాగాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ది, నాది సొంత జిల్లా వికారాబాద్. సభలో చర్చ జరిగి సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. గడ్డం ప్రసాద్ అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రసాద్ సేవలందించారు. వికారాబాద్‌కు ఎంతో విశిష్టత ఉంది. వికారాబాద్ గుట్ట వైద్యానికి పెట్టింది పేరు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు గడ్డం ప్రసాద్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నా. గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారు. కింది స్థాయి నుండి స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎదిగారు. వికారాబాద్ అభివృద్ధిలో గడ్డం ప్రసాద్‌ది చెరగని ముద్ర. ►తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ►గడ్డం ప్రసాద్‌ను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి, ►స్పీకర్‌గా ప్రసాద్‌ను అధికారికంగా ప్రకటించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ►స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం.. గడ్డం ప్రసాద్‌కు సభలో సీఎం, మంత్రులు, ప్రతిపక్ష నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ►అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలుగా కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్. ►బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా, కేటీఆర్, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్, పద్మారావు గౌడ్, పల్లా రాజేశ్వర్ ప్రమాణం ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ►సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. ►తెలంగాణ సచివాలయానికి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వచ్చారు. మంత్రిగా సీతక్క బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆమె అక్కడే ఉన్నారు. ►తెలంగాణలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు నేడు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌గా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. స్పీకర్ ఎన్నిక విషయాన్ని అనౌన్స్ చేస్తారు. ►కాగా, అసెంబ్లీలో స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. స్పీకర్‌ను సీఎం, మంత్రులు అధికార ప్రతిపక్ష సభ్యులు గౌరవపూర్వకంగా ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. అనంతరం స్పీకర్‌కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. స్పీకర్ చైర్ ఔన్నత్యం.. స్పీకర్ గుణగణాలు.. ఆయనతో ఉన్న పరిచయాలను సభ్యులు ప్రస్తావిస్తారు. మరోవైపు.. 111 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మద్దతు తెలిపారు. ►వీరిలో 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరు సీపీఐ ఎమ్మెల్యే కాంగ్రెస్ మిత్రపక్షం మద్దతు ఉండగా.. 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏడు మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికకు మద్దతు ప్రకటించారు. ఇక, స్పీకర్ ఎన్నికకు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. ►అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పని దినాలను ఖరారు చేస్తారు. దాదాపు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ►ఇదిలా ఉండగా.. ఈరోజు మంచి రోజు కావడంతో ఛార్జ్ తీసుకోనున్న పలువురు మంత్రులు. ►ఉదయం ఏడున్నరకు మంత్రి శ్రీధర్ బాబు, ఎనిమిదిన్నరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క బాధ్యతలు తీసుకోనున్నారు. ►ఉదయం తొమ్మిది గంటలకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాద్యతలు తీసుకోనున్నారు. ►నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. ►ఉదయం 11.30 గంటలకి అసెంబ్లీలో కేబినెట్ భేటీ. ►గవర్నర్ ప్రసంగంపై కేబినెట్లో చర్చించనున్న మంత్రులు -
కేసీఆర్ పగబట్టి ఉంటే కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండేవారు
నర్సాపూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పనితనమే తప్ప.. పగతనం తెలియదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. ఒకవేళ కేసీఆర్ పగబట్టి ఉంటే రాష్ట్రంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు జైలుపాలై ఉండేవారని చెప్పారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని హరీశ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గోబెల్స్‌లా ప్రచారం చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ ప్రజల పక్షాన ఆలోచించారని, కష్టపడి సాధించిన తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసే దిశగా ప్రజల కోసం పని చేశారని పేర్కొన్నారు. 2001 నుంచి ఎన్నో విజయాలు, అపజయాలు చూశామని చెప్పారు. ఓటమి అనేది స్పీడ్ బ్రేకర్ లాంటిదని, స్పీడ్ బ్రేకర్‌తో వేగం తగ్గుతుందే తప్ప వాహనం పూర్తిగా నిలిచిపోదని చెప్పారు. కొంతకాలం ఆగితే బీఆర్ఎస్ పార్టీ గమ్యం చేరుతుందని, మున్ముందు అద్భుత భవిష్యత్ మనదేనని హరీశ్ పేర్కొన్నారు. కాగా, పార్లమెంట్‌పై దాడి అమానుషమని హరీశ్‌రావు అన్నారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో దాడి జరగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే అధికార కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం ఉందని ఈటీజీ సంస్థతో కలిసి టైమ్స్ నౌ చేపట్టిన ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నుంచి 10 స్థానాలు గెలిచే వీలుందని తెలిపింది. బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయని పేర్కొంది. బీజేపీ కూడా కనిష్టంగా మూడు, గరిష్టంగా 5 స్థానాలు దక్కించుకునే వీలుందని తెలిపింది. వాస్తవానికి బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.92 శాతం ఓట్లు సాధిస్తే, 2023లో 13.9 శాతం తెచ్చుకుంది. 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్‌కు ఓటింగ్ 10.97 శాతం పెరిగింది. బీఆర్ఎస్కు ఓట్లు 9.52 శాతం తగ్గాయి. -
ETG Survey: బీఆర్ఎస్కు షాక్ తప్పదా?
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం సీట్లపై టైమ్స్‌నౌ ఈటీజీ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పదని వెల్లడైంది. మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ హవా చూపొచ్చని అంచనా వేసింది సర్వే. కాంగ్రెస్ 8 నుంచి 10 సీట్లు కైవసం చేస్కోవచ్చని తెలిపింది. ఇక గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాల తరహా దెబ్బ తగలవచ్చని ఈటీజీ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ 3-5 సీట్లు పరిమితం కావొచ్చని, అలాగే బీజేపీ 3 నుంచి ఐదు స్థానాలు గెలవొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ మాత్రం పుంజుకుని తన స్థానాలు పెంచుకుంటుదని సర్వే తెలిపింది. TIMES NOW - @ETG_Research Survey Telangana Total Seats: 17 Who will win how many seats in Lok Sabha if elections were to be held today? BRS: 3-5 BJP: 3-5 Cong: 8-10 Others: 0-1 We (Cong) are confident of securing between 10-15 seats in the LS elections - @ShujathAliSufi… pic.twitter.com/HDhdHirvq1 — TIMES NOW (@TimesNow) December 13, 2023 -
తెలంగాణకు తొలి దళిత స్పీకర్.. రేపే అధికారిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శాసనసభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, దాని మిత్ర పక్షం మజ్లిస్ సైతం స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని ప్రకటించింది. గడువు ముగియడంతో ఆయన స్పీకర్ కావడం ఖాయమైంది. శాసనసభ స్పీకర్ ఎన్నిక నామినేషన్ల కోసం ఇవాళే ఆఖరి రోజుకాగా.. ఒకే ఒక నామినేషన్ దాఖలు అయ్యింది. దీంతో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక దాదాపు ఖరారు అయినట్లే. ప్రొటెం స్పీకర్ రేపు(గురువారం డిసెంబర్ 14)న శాసన సభలో స్పీకర్ ఎన్నికపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడ్డం ప్రసాద్‌కుమార్ రెండుసార్లు వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. తొలిసారి ఆయన నెగ్గింది 2008 ఉప ఎన్నికల్లో. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగానూ పని చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడారు. ఆపై కాంగ్రెస్‌కు ఉపాధ్యక్షుడిగా, టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగానూ పని చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచే మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ అవుతారు. గడ్డం ప్రసాద్ కుమార్ స్వస్థలం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు గ్రామం. తల్లిదండ్రులు ఎల్లమ్మ, ఎల్లయ్య. తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. -
TS:అసలు ఆట ఇప్పుడుంది: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని విమర్శించారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దుల మీద చర్చ జరగలేదు. మేం చర్చ జరిపాం. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇచ్చాం. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం. ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశాం. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని వల్లె వేయిస్తారు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి. ఇప్పుడు ఉంది అసలు ఆట. రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైంది? మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడ’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదీచదవండి..హైదరాబాద్ కొత్త సీపీగా శ్రీనివాస్‌రెడ్డి: డ్రగ్స్‌పై వారికి వార్నింగ్ -
TS: అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ నామినేషన్.. బీఆర్ఎస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక రేపు(గురువారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ స్థానం కోసం వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కాగా, ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలుమద్దతు ఇవ్వడం విశేషం. స్పీకర్ నామినేషన్ పత్రాలపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన అనంతరం.. ఆయన నామినేషన్ వేశారు. ఆయన పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ వేశారు. ఇక, ప్రసాద్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరోవైపు.. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో స్పీకర్ నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ తరుపున మద్దతు తెలుపుతున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతకం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపారు. ఇక, కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుని మద్దతు ప్రకటించారు. అలాగే, ఎంఐఎం తరఫున మాజిద్ ఉస్సేన్ మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా.. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ అవుతారు. ప్రస్తుత శాసనసభలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే కావడం తెలిసిందే. తమను నియంత్రించే సత్తా ఉన్న స్పీకర్ పదవిని ప్రజల్లోకి తీసుకెళ్లి సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
కేసీఆర్ సరే.. మీ సంగతేంటి చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల ఫలితంపై ఒక వ్యాఖ్య చేశారు. తుపాను బాధితులను పరామర్శ పేరుతో సాగించిన రాజకీయ పర్యటనలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, విర్రవీగితే తెలంగాణలో ఏం జరిగిందో చూశామని అన్నారు. కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ, తన కేసును ప్రస్తావిస్తూ, తను సాంకేతికంగా, చట్టపరంగా దొరకనని చెప్పారు. తప్పు చేయకపోయినా ఏభై రెండు రోజులు జైలులో ఉంచారని ఆయన తెలిపారు. తన కోసం ప్రపంచం అంతా పోరాడిందని కూడా చంద్రబాబు చెప్పుకున్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించకూడదా? మీరు ప్రశ్నించినా కేసులు పెడతారని ఆయన అన్నారు. అలాగే, జనసేన-టీడీపీ పొత్తు, వచ్చే ఎన్నికలలో ప్రభావం గురించి కూడా మాట్లాడారు. ఇంతకీ చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విర్రవీగడం వల్లే ఓటమి చెందారని నమ్ముతున్నారా? అదే నిజమైతే తాను 2004లోనూ, అలాగే 2019లోనూ ఓడిపోవడానికి కారణం విర్రవీగడమేనని ఒప్పుకుంటున్నారా అన్న ప్రశ్న వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అనుసరించిన విధానాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా టోకరా వేసిన తీరు, ఆయన వ్యవహార శైలికి నిరసనగానే టీడీపీని ఓడించారు. అందుకే ఆ పార్టీకి కేవలం 23 సీట్లే వచ్చాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన విషయంలో మరీ అంత విమర్శలు లేవు. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో అభివృద్ది చేయడం కూడా గమనించిన ప్రజలు ఈ ప్రాంతంలో అన్ని సీట్లను బీఆర్ఎస్కు కట్టబెట్టారు. తెలంగాణ శాసనసభలో 119 సీట్లకు గాను, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చాయి. ఏపీలో 175 సీట్లకు గాను చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీకి కేవలం 23 స్థానాలే దక్కాయి. దీని గురించి ఏమంటారు!. అదే సమయంలో కేసీఆర్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్ కూడా ఉన్న మాటనిజమే. ఇది ఎవరి విషయంలో అయినా వర్తిస్తుంది. ఆ సంగతి మర్చిపోయి, తానేదో ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్లు.. తనను ఓడించింది విర్రవీగినందువల్ల కాదనట్లు మాట్లాడడమే ప్రత్యేకత. చంద్రబాబు ఏ అంశంలో అయినా ద్వంద్వ ప్రమాణాలు పాటించగల నేర్పరి. అలాగే కేసీఆర్ విషయంలోకూడా చేశారు. మొన్నటివరకు కేసీఆర్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని చెబుతుండేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి ఏదైనా విమర్శ చేయదలిస్తే తెలంగాణ పాలనను అప్పుడప్పుడు పొగుడుతుండేవారు. ఇదే చంద్రబాబు 2014లో కేసీఆర్‌కు అసలు పాలన గురించి ఏం తెలుసని ప్రశ్నించేవారు. ఓటుకు నోటు కేసు తర్వాత కేసీఆర్ దెబ్బకు భయపడి చెప్పాపెట్టకుండా పెట్టే బేడా సర్దుకుని చంద్రబాబు విజయవాడకు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన కేసీఆర్‌పై విమర్శలు చేయడం అంటేనే గజగజలాడేవారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కలిసి పొత్తుపెట్టుకున్నప్పుడు కేసీఆర్‌పై ఆరోపణలు చేసినా, టీఆర్ఎస్ గెలిచేసరికి మళ్లీ మౌనంలోకి వెళ్లిపోయారు. ప్రధానమంత్రి మోదీ గురించి కూడా అంతే. మోదీని వ్యక్తిగతంగా కూడా దూషించేవారు. ఆయన 2019లో తిరిగి అధికారం చేపట్టడంతో మళ్లీ పొగడటం ఆరంభించారు. ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారంటే ఆయన ఓడిపోయారులే అన్న భావన తప్ప ఇంకొకటి కాదు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ విర్రవీగారని అనడం ద్వారా చంద్రబాబు మరో సంగతి స్పష్టం చేశారని వెల్లడైందన్న విశ్లేషణలు వచ్చాయి. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇచ్చిందన్న సంగతి తేటతెల్లమైందని అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ను, సోనియాగాంధీని కూడా పరుష పదజాలంతో చంద్రబాబు దూషించేవారు. తదుపరి వారితో పొత్తుపెట్టుకున్నారు. ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను గాలికి వదలివేశారు. కనుక చంద్రబాబు.. ఎప్పుడు ఏదీ ప్రస్తుతమో అదే చేస్తుంటారు. ఈరోజు నాకేంటి అని తప్ప ఇంకొకటి ఆలోచించరని ఆయనను బాగా దగ్గరగా చూసిన ఒక ప్రముఖుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అంతే చేశారు. తన కేసు గురించి కూడా ప్రస్తావించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్న వ్యాఖ్యలు వచ్చాయి. తాను తప్పు చేయకపోయినా జైలులో పెట్టారని అంటున్నారు. నిజంగానే తప్పు జరగకపోతే తన మాజీ పీఎస్‌ను అమెరికా పారిపోయేలా ఎందుకు చేశారు?. 17ఏ కింద కేసును కొట్టివేయాలని అంటున్నారే తప్ప, నిధుల దుర్వినియోగం చేయలేదని ఎందుకు వాదించలేకపోతున్నారు. ఇదే కేసులో ఈడీ నలుగురు వ్యక్తులను ఎలా అరెస్టు చేసింది? ఈ ప్రశ్నలకు ఎన్నడూ సమాధానం ఇవ్వడం లేదు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. ఈ మధ్య ఎస్ఐ పరీక్షలకు సంబంధించి కొందరు అభ్యర్ధులు తమ ఎత్తు విషయమై హైకోర్టుకు వెళ్లారు. గౌరవ న్యాయమూర్తులు స్వయంగా వారి ఎత్తును కొలిపించి తీర్పు ఇచ్చారు. మరి అదే చంద్రబాబు కేసులో ఒక ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా ఆయనకు గుండె జబ్బు, తదితర వ్యాధులు ఉన్నాయని నిర్దారణకు వచ్చి బెయిల్ ఇచ్చేసింది. ప్రైవేటు ఆస్పత్రి రిపోర్టును మరో ప్రముఖ ప్రభుత్వ సంస్థకు పంపి వారి అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ఎవరికైనా సందేహం వస్తే ఏం చెబుతాం?. తీరా బెయిల్ వచ్చాక, ఇప్పుడు చంద్రబాబు తనకు ఎలాంటి గుండె జబ్బు లేదన్నట్లుగా శుభ్రంగా తిరుగుతున్నారే. మంచిదే. కానీ, తప్పుడు సర్టిఫికెట్ ఆధారంగా బెయిల్ పొందారేమో, కోర్టును తప్పుదారి పట్టించారేమో అన్న అభిప్రాయం రాకుండా ఉంటుందా?. ఏది ఏమైనా చంద్రబాబు జైలుకు వెళ్లకముందు తనను ఎవరు ఏమీ చేయలేరని, ముఖ్యమంత్రి జగన్ తనను ఏం చేస్తారని ఇష్టారీతిన మాట్లాడేవారు. ప్రస్తుతం మాత్రం స్వరం మార్చి తనను అన్యాయంగా జైలులో పెట్టారని చెబుతున్నారు. తనకోసం ప్రపంచం అంతా కష్టపడిందని చిత్రమైన స్టేట్ మెంట్ ఇస్తూ ప్రజలను భ్రమ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. జనసేన పొత్తు గురించి మాట్లాడుతున్నారు కానీ, ఒకవేళ అధికారం వస్తే, పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది లేనిదీ మాత్రం ప్రస్తావించడం లేదు. అందుకే మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. జనసేన క్యాడర్‌కు, పవన్‌కు మధ్య యుద్దం జరుగుతోందని ఆయన అన్నారు. తనకు కావాల్సింది జేజేలు, చప్పట్లు కాదని, ఓట్లు అని పవన్ అంటున్నారని, ఓట్లు సరే.. అధికారం సంగతేమిటని జనసైనికులు ఆయనను ప్రశ్నిస్తున్నారని జోగయ్య పేర్కొన్నారు. జనసేనను గెలిపిస్తే అధికారం అదే వస్తుందని పవన్ చెబుతున్నారని, కానీ అధికారం వస్తుందని నమ్మిస్తేనే ఓట్లు వేస్తారని జనసేన నేతలు అంటున్నారని ఆయన విశ్లేషించారు. కనీసం అరవైసీట్లు అయినా జనసేన తీసుకోవాలని జోగయ్య సూచించారు. జనసేన వెంట టీడీపీ ఉందని కార్యకర్తలలో విశ్వాసం కలిగిస్తేనే ఫలితం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మరి దీనికి చంద్రబాబు అంగీకరిస్తారా? జనసేనకు అరవై సీట్లు ఇస్తారా? ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ ఉంటుందా? ఉండదా? ఇవేవి తేల్చకుండా చంద్రబాబు జనసేన కార్యకర్తలను కలలోకంలో ఉంచాలని చూస్తున్నారు. పవన్‌కు రాజకీయంగా వ్యూహాలు లేని పరిస్థితిని, తెలంగాణలో జనసేనకు ఎదురైన చేదు అనుభవాలను తనకు అనుకూలంగా మలచుకుని ఆ పార్టీని తన చెప్పుచేతలలో ఉంచుకోవాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. దీనికి ఆత్మాభిమానం ఉండే జనసైనికులు అంగీకరించడం కష్టమేనని జోగయ్య వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి అధికారం వస్తే చంద్రబాబును పట్టుకోవడం కష్టమని, ఆయన విర్రవీగుతారన్నది జనసేన వారి భయం. జనసేనకు మొండి చేయి చూపినా చేయగలిగేది ఏమీ ఉండదన్నది వారి అనుమానం. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
పదహారుపై గురి
సాక్షి, హైదరాబాద్: రానున్న మూడు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదపడం ప్రారంభించింది. ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఒకరిద్దరికి మాత్రమే పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని, మిగిలిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలే ధ్యేయంగా బీఆర్ఎస్, బీజేపీల ముఖ్యనేతలను పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దింపే ప్రయత్నాలను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. 10–12 చోట్ల క్లియర్ ఎంపీ సీట్లకు టికెట్ల ఖరారు వ్యవహారం 10–12 స్థానాల్లో సులభమేనని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ తెలంగాణ పరిధిలోకి వచ్చే నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, చేవెళ్ల, మల్కాజ్‌గిరిలతో పాటు పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, మెదక్, జహీరాబాద్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పెద్ద కష్టమేమీ కాదని అంటున్నాయి. ఈ స్థానాల నుంచి ఇప్పటికే రెండు చొప్పున పేర్లను పరిశీలిస్తున్నారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. నల్లగొండ పార్లమెంటు నుంచి జానారెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డిలలో ఒకరు, భువనగిరి నుంచి కోమటిరెడ్డి లక్ష్మి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలలో ఒకరు, మహబూబ్‌నగర్ నుంచి వంశీచందర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డిలలో ఒకరు, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి లేదా పి.రాములు (కాంగ్రెస్‌లోకి వస్తే), చేవెళ్ల నుంచి కేఎల్ఆర్ లేదంటే బీఆర్ఎస్ నుంచి వస్తారని భావిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన ముఖ్య నేత, లేదంటే బీజేపీ నుంచి మరో కీలక నేత, మల్కాజ్‌గిరిలో మైనంపల్లి హనుమంతరావులను బరిలోకి దింపే అంశంపై టీపీసీసీ కసరత్తు ప్రారంభించింది. ఇక పెద్దపల్లి నుంచి చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్ కుమారుడు వంశీ లేదా పెరిక శ్యాం, ఖమ్మం నుంచి వి.హనుమంతరావు లేదంటే రేణుకా చౌదరి, పోట్ల నాగేశ్వరరావుల్లో ఒకరు, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, విజయాబాయి (వైరా)లలో ఒకరికి టికెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. వరంగల్ నుంచి సిరిíÜల్ల రాజయ్య, దొమ్మాట సాంబయ్య, అద్దంకిదయాకర్ (మంత్రి పదవి ఇవ్వకపోతే) పేర్లను, మెదక్ నుంచి జగ్గారెడ్డి లేదా విజయశాంతి, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్ పేర్లను పరిశీలించవచ్చని సమాచారం. ఆ ఐదు చోట్ల త్రిముఖ పోటీ! ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆయా స్థానాల్లో బీఆర్ఎస్తో పాటు బీజేపీ నుంచి కూడా పోటీ ఎదురవుతుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో త్రిముఖ పోటీలో నెట్టుకురావాల్సిన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభమయిందని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచి అజారుద్దీన్ లేదా ఫిరోజ్‌ఖాన్, సికింద్రాబాద్ నుంచి అనిల్‌కుమార్ యాదవ్ లేదా నవీన్ యాదవ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి సంజయ్ లేదా టి.జీవన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనుమడు రోహిత్‌రావు, పాడి ఉదయానందరెడ్డి, ఆదిలాబాద్ నుంచి నరేశ్ జాదవ్ లేదా మరో ఆదివాసీ నాయకుడి పేర్లు పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఒకరిద్దరి పేర్లు మాత్రమే పార్లమెంటుకు పరిగణనలోకి తీసుకుంటామని, అసెంబ్లీ టికెట్ల విషయంలో త్యాగం చేసిన వారికి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. -
కన్నెత్తి చూడని కమల దళం
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పదిరోజులు కావొస్తున్నా..ఓటమికి గల కారణాలపై ఇంతవరకూ సమీక్షించలేదు. పోటీ చేసిన అభ్యర్థులతో రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలెవరూ కనీసం మాట్లాడకపోవడంపై ఆ పార్టీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఏ ఎన్నికలు జరిగినా, ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల వ్యవధిలోనే గెలుపోటములపై రివ్యూ చేయడం ఆ పార్టీ ఆనవాయితీ. కానీ ఈసారి అలాంటిదేమీ లేదు. శాసనసభ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన పరిస్థితి, కారణాలను విశ్లేషించుకుని త్వరలోనే జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉండగా, అలాంటి ప్రయత్నమేదీ ఇప్పటివరకు జరగకపోవడంతో కేడర్‌లో నిరుత్సాహం నెలకొంది. మొహం చాటేసిన జాతీయ నేతలు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీ ముఖ్యనేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఆ స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో జాతీయ నాయకత్వం నుంచి పార్టీలోని వివిధ స్థాయిల్లో కొంత నిరాశ, నిస్పృహలు ఎదురయ్యాయి. గెలుపోటములకు గల కారణాలపై కనీసం పోస్టుమార్టం కూడా చేయకపోవడంపై రాష్ట్ర పార్టీనేతలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్, సహఇన్చార్జ్ సునీల్ బన్సల్, ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్ తదితరులు ఫలితాల వెల్లడి తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడకపోవడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినా... రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నుంచి అధికార కైవసం, మధ్యప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చి, తెలంగాణలో మాత్రం నిరాశాజనక ఫలితాలు ఎందుకు వచ్చాయన్న విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 111 సెగ్మెంట్లలో పోటీ చేసి 8 స్థానాల్లో గెలుపు, 19 చోట్ల రెండోస్థానం, 46 సెగ్మెంట్లలో బీజేపీకి డిపాజిట్లు దక్కిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు రావడానికి కారణాలు ఏమిటన్న దానిపై అభ్యర్థుల అభిప్రాయాలు తెలుసుకోకపోవడం ఏమిటనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. అక్కడక్కడా స్థానిక సమీక్షలతో సరి ఫలితాల తర్వాత కొన్నిచోట్ల అభ్యర్థులు, స్థానిక నేతలు వారి స్థాయిలో ఓటమిపై సమీక్షించారు. దీనిపై రాష్ట్ర పార్టీకి నివేదికలు పంపించినట్టు సమాచారం. మరికొందరు అభ్యర్థులు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని నేరుగా కలిసి ఓటమికి గల కారణాలపై విశ్లేషించినట్టు తెలిసింది. అయితే పార్టీపరంగా ఆయా నియోజకవర్గాలకు వెళ్లి స్థానిక నేతలతో భేటీ అయ్యి ప్రస్తుత ఫలితాలకు దారితీసిన కారణాలపై సమీక్షించి రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు ఇవ్వాల్సి ఉన్నా, అందులో ఎలాంటి పురోగతి లేదు. ఎన్నికల ఫలితాల సరళిపై, ఆశించిన స్థాయిలో సీట్లు గెలవకపోవడానికి గల కారణాలు వివరిస్తూ జాతీయ నాయకత్వానికి కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవివరమైన నివేదిక సమర్పించినట్టు పార్టీవర్గాల సమాచారం. -
హైదరాబాదీలకు అభినందనలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ, ఆర్థిక సేవల సంస్థ 'మెర్సర్' తాజాగా ఉత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ప్రపంచ నగరాల ర్యాంకింగ్ ను విడుదల చేసింది. భారత్ నుంచి హైదరాబాదుకు 153వ స్థానం దక్కగా, పూణే 154వ స్థానంలోనూ, బెంగళూరు 156వ స్థానంలోనూ ఉన్నాయి. మెర్సర్ జాబితాపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. భారత్ లో మరోసారి హైదరాబాద్ నగరమే ది బెస్ట్ సిటీగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 2015 నుంచి భారత్ లో అత్యుత్తమ నగరంగా నిలవడం హైదరాబాద్ కు ఇది ఆరోసారి అని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాదీలకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. Hyderabad is yet again rated as the best Indian city by Mercer This is the 6th time since 2015 Congratulations to all Hyderabadis 👏 pic.twitter.com/ZnQiI4FV29 — KTR (@KTRBRS) December 12, 2023 కాగా, మెర్సర్ జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా జీవన ప్రమాణాల పరంగా అత్యుత్తమ నగరంగా నిలిచింది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ నగరం జ్యూరిచ్ కు రెండో స్థానం, న్యూజిలాండ్ నగరం ఆక్లాండ్ కు మూడో స్థానం లభించాయి. అత్యంత దారుణమైన నగరాలుగా ఎన్ జమేనా (చాద్), బెంగుయి (సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్), ఖర్టూమ్ (సూడాన్) ర్యాంకింగ్ లో అట్టడుగున నిలిచాయి. -
KCR: దయచేసి ఆస్పత్రికి రావొద్దు: కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: సర్జరీ అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రిలోనే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని పరామర్శించేందుకు ప్రముఖులు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఇవాళ సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఆస్ప్రతి వద్దకు చేరుకున్నారు. ఆయన్ని చూసేందుకు అనుమతించాలంటూ పోలీసులను కోరారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందుకు పోలీసులు కుదరదని చెప్పారు. దీంతో కేసీఆర్.. బీఆర్ఎస్.. కేటీఆర్ నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు చేతులెత్తిసిన క్రమంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ఆయన క్యాడర్‌ను సముదాయించడంతో కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ విజ్ఞప్తి.. మరోవైపు ఆస్పత్రి బయట పరిస్థితులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి వెళ్లాయి. దీంతో బీఆర్ఎస్ కేడర్‌ను, అభిమానుల్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. ‘‘నేను కోలుకుంటున్నా.. త్వరలో మీ ముందుకు వస్తా. దయచేసి ఎవరూ ఆస్పత్రికి రావొద్దు. నాతో పాటు వందలాది మంది పేషెంట్లు ఇక్కడ ఉన్నారు. వాళ్లకు ఇబ్బంది కలిగించొద్దు. దయచేసి పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు సహకరించాలి. నాపట్ల అభిమానం చూపుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు: తెలంగాణ మంత్రులు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలంగాణ మంత్రులు అన్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన్ని ఇవాళ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ని పరామర్శించేందుకు వచ్చాం. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. బహుశా రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అవుతారేమో’’ అని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పగా.. ‘‘కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరాం. త్వరగా సభకు వచ్చి వారికున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని అందించాలని కోరాం. అందరూ నాయకులను కలుపుకుని ప్రజలకు మంచి పాలన అందిస్తామని ఆయనకు హామీ ఇచ్చాం. స్పీకర్ ఎన్నికలో కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేవిధంగా సహకరించాలని అడిగాం’’ అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. -
దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయాం: హరీశ్ రావు
సంగారెడ్డి: దురదృష్టవశాత్తు మనం అధికారం కోల్పోయాం.. బీఆర్ఎస్ ఒడిదొడుకులు కొత్త కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీశ్‌రావు మాట్లాడారు. పరీక్ష ఫెయిల్ అయిన తర్వాత విద్యార్థి కుంగిపోతే ఇంకో పరీక్ష పాస్ కాలేడని అన్నారు. రానున్న రోజుల్లో స్థానిక, పార్లమెంట్ ఎన్నికల రూపంలో పరీక్షలు రాబోతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడానికి పకడ్భంధీ కార్యాచరణతో ముందుకు పోదామని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. వాళ్లు మనకన్నా బాగా పాలిస్తారని ప్రజలు అవకాశమిచ్చారని తెలిపారు. దుష్ప్రచారం కూడా కొంతపై చేయి సాధించిందని తెలిపారు. కేవలం 2 శాతం ఓట్లతో అధికారం కోల్పోయామని, బీఆర్ఎస్ ఎపుడూ తెలంగాణ ప్రజల పక్షమేమని స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని గెలిచినప్పుడు పొంగి పోలేదు.. ఓటమితో కుంగి పోలేదని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని, వాళ్ళిచ్చిన హామీల అమలులో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారని, మనం ధైర్యం కోల్పోవద్దని ఏమైనా లోపాలు ఉంటే సమీక్షించుకుందామని అన్నారు. మనకు పోరాటాలు కొత్త కాదని,భవిష్యత్ మనదేనని అన్నారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడు కనుకే తెలంగాణ వచ్చిందని తెలిపారు.సంగారెడ్డి కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనని, కార్యకర్తలకే సంగారెడ్డి విజయం అంకితం చేస్తున్నానని తెలిపారు. -
TS:రూ.500కే గ్యాస్ సిలిండర్..మంత్రి ఉత్తమ్ కుమార్ క్లారిటీ
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరో రెండు గ్యారెంటీలపై రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మంగళవారం సివిల్ సప్లై అధికారులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రూ.500కు గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్ మరో వంద రోజుల్లో అమలు చేస్తాం. ప్రజలకు ఇచ్చే బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తోంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి. ఇప్పటి వరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. బియ్యం తీసుకునే లబ్ధిదారులు రాష్ట్రంలో 2కోట్ల 80 లక్షల మంది ఉన్నారు. వడ్ల కొనుగోలుకు సివిల్ సప్లై శాఖ అన్ని చర్యలు తీసుకోవాలి. రైతులకు డబ్బు వెంటనే అందాలి’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ప్రజలకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని వారు ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది గమనించాలి. కిలో 39 రూపాయలు పెట్టి మనం సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం. అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుంది. మొక్కుబడిగా బియ్యం పంపిణీ కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలి. బియ్యం లబ్దిదారులను ర్యాండమ్ చెక్ చెయ్యాలి. ప్రజల నుంచి సమాచారం సేకరించాలి’ అని ఉత్తమ్ అధికారులకు సూచించారు. ‘గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖకు ఆర్థిక సహాయం చేయక పోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసింది. రూ.11 వేల నష్టాల్లో శాఖ కూరుకుపోయింది. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోపాలున్నాయి.రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల్లో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటడడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తా’ అని ఉత్తమ్ తెలిపారు. ఇదీచదవండి..జనార్ధన్ రెడ్డి రాజీనామా.. మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన తమిళిసై -
TSPSC: జనార్ధన్ రెడ్డి రాజీనామా.. ట్విస్ట్ ఇచ్చిన తమిళిసై
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)పై కాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష జరపనుండగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. TSPSC చైర్మన్ బి. జనార్ధన్‌రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఇప్పటికే జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ రాజీనామా తిరస్కరించడంతో సీఎం జరిపే సమీక్షకు జనార్ధన్‌రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి కాసేపట్లో సచివాలయంలో సమీక్షించనున్నారు. గ్రూప్-2 పోటీ పరీక్షలు, గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ,గ్రూప్-3 షెడ్యూలు ఖరారు, ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కాగా, జనార్దన్‌రెడ్డి సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా లేఖను అందజేశారు. ఇదీచదవండి..ఫైల్స్ చోరీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన తలసాని ఓఎస్డీ -
ఢిల్లీలో కోమటిరెడ్డి.. రింగ్‌రోడ్, తెలంగాణ భవన్‌పై కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్‌ను పరిశీలించారు. అనంతరం, ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ ఏర్పాటుపై అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో వెంకట రెడ్డి మాట్లాడుతూ..‘ఢిల్లీలో వీలైనంత త్వరగా కొత్తగా తెలంగాణ భవన్ నిర్మిస్తాం. ప్రస్తుతం ఉన్న భవన్లో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ భవన్ విభజనలో ఎలాంటి వివాదం లేదు. గత ప్రభుత్వ విధానానికి భిన్నమైన వైఖరి మేం తీసుకుంటాం. రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకు మరొక మణిహారం. ట్రిపుల్ ఆర్ సహా పలు జాతీయ రహదారుల అంశాలపై మాట్లాడేందుకు నేషనల్ హైవే అథారిటీ చైర్మన్‌ను కలుస్తున్నాం. రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం’ అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డిని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా వారితో కోమటిరెడ్డితో మాట్లాడుతూ..‘రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అని అప్పటి పీఎం మన్మోహన్ చెప్పారు. ఇప్పటికీ విభజన చట్టం అమలుపరచకపోవడం బాధాకరం. నా వంతు ప్రయత్నం చేస్తాను. ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో చెప్పారు, అమలుపరిచే బాధ్యత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిది’ అని వ్యాఖ్యలు చేశారు. -
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్
సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.25 కోట్లు మొత్తం కలిపి రూ. 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. అయితే, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. 2017లో ఆయన సతీమణి రజిత రెడ్డి పేరు జీవన్ రెడ్డి ఈలోన్ తీసుకోగా ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదు. దీంతో, అసలు ప్లస్ వడ్డీ కలిసి రూ.45 కోట్ల బకాయి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. కాగా, నోటీసుల అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బకాయిల వసూలుకు నోటీసులు.. ఇదిలా ఉండగా, అంతకుముందు.. జీవన్‌రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఏకకాలంలో బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని టీఎస్ఆర్టీసీ స్థలాన్ని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్‌కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట ఐదు అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గతేడాది దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్లో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్‌సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. మొన్నటి వరకు జీవన్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్ అద్దె బకా యిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్‌కు సంబంధించి ట్రాన్స్‌కోకు 2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. మూడు రోజుల్లో చెల్లించాలి ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జానీరెడ్డి, ఆర్మూర్ డిపో ఇన్చార్జి మేనేజర్ పృథ్వీరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన పోలీసు అధికారులు తోడు రాగా జీవన్ మాల్లో హెచ్చరికలు జారీ చేసారు. మూడు రోజుల్లో లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో మల్టీప్లెక్స్‌ను సీజ్ చేస్తామంటూ మైక్‌లో హెచ్చరించారు. మరో వైపు ట్రాన్స్‌కో ఆర్మూర్ ఏడీఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో అధికారులు సైతం మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో షాపింగ్ మాల్‌కు జనరేటర్లతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
Telangana: బీజేపీ టార్గెట్ @8!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో అప్పుడే ఎంపీ టికెట్ల ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు మరో మారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ తోనూ పొత్తు లేకుండా సొంతంగా పోటీచేసిన బీజేపీ 4 సెగ్మెంట్లలో గెలిచి అందరినీ ఆశ్చర్యపరి చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే సీటు గెలిచి 7% ఓట్లు సాధించిన పార్టీ, మరుసటి ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 శాతానికి ఓటింగ్‌ను పెంచుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలుపొందడమే కాకుండా 18 శాతం ఓటింగ్‌ను నిలుపుకుంది. 19 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులు రెండోస్థానంలో నిలవగా, 49 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకున్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 25శాతానికి ఓటింగ్ పెంచుకొని ఎనిమిది సీట్లు సాధించాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. సిట్టింగ్ స్థానాలపై స్పష్టత ! సిట్టింగ్ ఎంపీలైన కేంద్రమంతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (కరీంనగర్), అర్వింద్ ధర్మపురి (నిజామాబాద్) ఆయా స్థానాల నుంచే మళ్లీ పోటీకి ఇప్పటికే సిద్ధమయ్యారు. బోథ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన ఆదిలాబాద్ ఎంపీ సొయం బాపూరావుకు ఈసారి పోటీకి మళ్లీ అవకాశం కల్పిస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాథోడ్ బాపూరావును ఈసారి ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేయించే అవకాశాలున్నాయనే చర్చ పార్టీలో సాగుతోంది. ఆయనతోపాటు ఈసారి ఖానాపూర్ నుంచి ఓడిన మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్ గెలిచిన జోరు మీదున్న బీజేపీ ఎంపీ సీటును కచ్చితంగా కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని మూడు ఎమ్మెల్యే సెగ్మెంట్లలోనూ పార్టీ విజయం సాధించడం, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు హామీని నిలుపుకున్నందున నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటామనే విశ్వాసం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన స్థానాల్లో ఇలా.... సిట్టింగ్ స్థానాలు మినహా మిగిలిన 13 ఎంపీ సీట్లలో పోటీకి కొందరు ముఖ్యనేతలు గట్టిగానే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ► మల్కాజిగిరి నుంచి పోటీకి బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ పి.మురళీధర్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణకు జాతీయ నాయకత్వం నుంచి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే మహబూబ్‌నగర్ నుంచి పోటీకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, కల్వకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన టి.ఆచారి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ► మెదక్ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఇప్పటికే ప్రకటించారు. మల్కాజిగిరి, మెదక్, కరీంనగర్‌లలో ఎక్కడో ఒకచోట నుంచి పార్టీ అగ్రనాయకత్వం అవకాశం కల్పిస్తే పోటీకి సిద్ధమేనని సీనియర్‌నేత ఈటల రాజేందర్ తన సన్నిహితుల వద్ద సంకేతాలిచ్చి ఆ దిశలో ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ► చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎప్పటి నుంచో కసరత్తు కూడా ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే దానికి సంబంధించిన కార్యాచరణలో నిమగ్నమైనట్టు పార్టీవర్గాల సమాచారం. ► భువనగిరి సీటు తనకు టికెట్ వస్తుందని మాజీ ఎంపీ డా. బూరనర్సయ్యగౌడ్ ఆ లోక్‌సభ పరిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. ► గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీకి గతం నుంచి ఉత్సాహం కనబరుస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి వీరశైవ లింగాయత్ సమాజ్‌కు చెందిన జాతీయనేత అశోక్ ముస్తాపురె, అక్కడి ప్రజల్లో గుర్తింపు ఉన్న సోమయప్ప స్వామిజీ, చీకోటి ప్రవీణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ► పెద్దపల్లి నుంచి పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్‌కు మళ్లీ పోటీకి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ► నాగర్‌కర్నూల్ స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శృతిని బరిలో దింపడం లేదా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశముంది. ► వరంగల్ టికెట్ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ గట్టిగా కోరుతున్నట్టు తెలిసింది. ► నల్లగొండ స్థానానికి గతంలో పోటీ చేసిన గార్ల జితేందర్ లేదా సూర్యాపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన సంకినేని వెంకటేశ్వర్రావుకు చాన్స్ దక్కుతుందా, ఇంకా ఎవరైనా కొత్తవారికి ఇస్తారా అన్న దానిపై చర్చ సాగుతోంది. ► హైదరాబాద్ స్థానం నుంచి భగవంత్‌రావుకు అవకాశం కల్పించవచ్చుననే ప్రచారం జరుగుతుండగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయించినా అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీ నేతల్లో ఉంది. ► మహబూబాబాద్ నుంచి రామచంద్రునాయక్, హుస్సేన్‌నాయక్, దిలీప్‌నాయక్‌లు పోటీపడుతున్నట్టు సమాచారం. ► ఖమ్మం నుంచి పార్టీనేత, తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తారా ఇంకా మరెవరికైనా టికెట్ ఇస్తారా చూడాలని పార్టీ నేతలు అంటున్నారు. -
28న మరికొన్ని గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ/నల్లగొండ: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 28న మరికొన్ని గ్యారంటీలను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలులోకి తెస్తామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భేటీలో ఆ శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్–విజయవాడ రహదారిని ఆరులేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని, తెలంగాణలోని 14 రహదారులను స్టేట్ హైవేలుగా మార్చాలని కేంద్రమంతిని కోరానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలంగా స్పందించారని వివరించారు. కేంద్రంతో తరచూ సంప్రదిస్తూ రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని కోమటిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రోడ్ల గుంతలను మట్టితో పూడ్చిందని, తమ ప్రభుత్వంలో అలా జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎవరిపైనా తాము కక్ష సాధింపులకు దిగబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మిస్తామన్నారు. ఈ విషయంపై మంగళవారం అధికారులతో సమీక్ష జరుపుతానని కోమటిరెడ్డి తెలిపారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాను కలిసి రాజీనామాపత్రాన్ని అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. -
కోదండరాంకు కీలక పదవి.. కాంగ్రెస్‌లో చర్చ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి(టీజేఎస్) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత కోదండరాం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి గెలుపులో భాగమయ్యారు. తాజాగా ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ సముచితమైన పదవిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. కోదండరాంను రాజ్యసభకు పంపేందకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఈ అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది. పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వారిలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ దండరాంకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తారని కాంగ్రెస్ పార్టీలో చర్చ జోరందుకుంది. ఇది కూడా చదవండి: పొన్నాల వాట్సాప్ స్టేటస్‌పై ఎర్రబెల్లి ఫైర్ -
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కాలి తుంటి గాయంతో సర్జరీ అయిన ఆయన నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులు ఆయన దగ్గరకు క్యూ కడుతున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా కేసీఆర్‌ను పరామర్శించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్‌ను పరామర్శించాను. డాక్టర్లు కూడా ఆపరేషన్ బాగా చేశారని చెప్పారు. ఆయన కోలుకోవడానికి ఆరువారాల టైం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలి. కోలుకుని మళ్లీ ప్రజా సేవకు రావాలి. జీవితంలో ఒడిదుడకులు రావటం సహజం. ప్రజలకు అంకిత భావంతో మళ్ళీ ఆయన సేవ చేయాలని కోరుకుంటున్నా’’ అని చంద్రబాబు అన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం, మంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేసీఆర్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ను పరామర్శించేందుకు రాజకీయంతో పాటు సినీ ప్రముఖులు తరలి వస్తుండడం గమనార్హం.