కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి.. ప్రజల్లోకి రావాలి: చంద్రబాబు

Chandrababu And Bhatti Politicians Visits Yashoda EX CM KCR  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కాలి తుంటి గాయంతో సర్జరీ అయిన ఆయన నగరంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులు ఆయన దగ్గరకు క్యూ కడుతున్నారు.

మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా కేసీఆర్‌ను పరామర్శించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్‌ను పరామర్శించాను. డాక్టర్లు కూడా ఆపరేషన్ బాగా చేశారని చెప్పారు. ఆయన కోలుకోవడానికి ఆరువారాల టైం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలి. కోలుకుని మళ్లీ ప్రజా సేవకు రావాలి. జీవితంలో ఒడిదుడకులు రావటం సహజం. ప్రజలకు అంకిత భావంతో మళ్ళీ ఆయన సేవ చేయాలని కోరుకుంటున్నా’’ అని చంద్రబాబు అన్నారు. 

మరోవైపు డిప్యూటీ సీఎం, మంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేసీఆర్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ను పరామర్శించేందుకు రాజకీయంతో పాటు సినీ ప్రముఖులు తరలి వస్తుండడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top