4జీలోకి అప్గ్రేడైతే 4జీబీ ప్రీడేటా | Vodafone Offers 4GB of Free 4G Data to Customers Upgrading to Its 4G Network | Sakshi
Sakshi News home page

4జీలోకి అప్గ్రేడైతే 4జీబీ ప్రీడేటా

Apr 13 2017 11:01 AM | Updated on Sep 5 2017 8:41 AM

4జీలోకి అప్గ్రేడైతే 4జీబీ ప్రీడేటా

4జీలోకి అప్గ్రేడైతే 4జీబీ ప్రీడేటా

వొడాఫోన్ ఇండియా తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.

వొడాఫోన్ ఇండియా తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 4జీలోకి అప్గ్రేడ్ అయితే 4జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. ముంబాయిలోని కస్టమర్లందరికీ 4జీ హ్యాండ్ సెట్లపై 4జీబీ 4జీ ఉచిత డేటా అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. ముంబాయి వ్యాప్తంగా అప్ గ్రేడ్ అయ్యే వొడాఫోన్ కస్టమర్లందరికీ ఈ వన్-టైమ్ ఆఫర్ ను అందిస్తామని చెప్పింది. రిలయన్స్ జియో ప్లాన్స్ కు కౌంటర్ గా, కస్టమర్లను కాపాడుకోవడానికి వొడాఫోన్ ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్టు తెలిసింది. 
 
కొత్త 4జీ సిమ్ కార్డులను కూడా వొడాఫోన్ స్టోర్లు, మినీ స్టోర్లు  అంతేకాక మల్టి బ్రాండు అవులెట్లను కూడా కంపెనీ అందుబాటులో ఉంచింది. 4జీ హ్యాండ్ సెట్లు ఉన్న వారు మాత్రమే ఈ డేటాను వాడుకోవచ్చు. ఇప్పటికే ఉన్న వొడాఫోన్ కస్టమర్లు తమ సిమ్ లను 4జీ నెట్ వర్క్ లోకి అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వన్-టైమ్ ఆఫర్ ప్రీపెయిడ్ కస్టమర్లకు 10 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. అదే పోస్టు పెయిడ్ కస్టమర్లకైతే, అదే 4జీబీ డేటా వచ్చే బిల్లింగ్ డేట్ వరకు వర్తించనుంది. అయితే 4జీలోకి అప్ గ్రేడ్ అవడం కోసం తొలుత వినియోగదారులు వొడాఫోన్ స్టోర్ల ద్వారా 4జీ సిమ్ కార్డును కొనుక్కోవాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement