ప్రియురాలికి ‘రక్తం’ కానుక | Lover Commits Suicide In Chennai | Sakshi
Sakshi News home page

ప్రియురాలికి ‘రక్తం’ కానుక

Aug 30 2019 11:34 AM | Updated on Aug 30 2019 12:06 PM

Lover Commits Suicide In Chennai - Sakshi

సాక్షి, చెన్నై: తనను ప్రేమించలేదన్న వేదనతో రక్తాన్ని ప్రియురాలికి కానుకగా పంపించి ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం చెన్నై నంగనల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. నంగల్లూరుకు చెందిన కుమరేశ పాండి(25) కార్పెంటర్‌. సమీప బంధువైన యువతితో స్నేహం ప్రేమగా మారింది. మూడు రోజుల క్రితం తన ప్రేమను ఆ యువతికి వ్యక్తం చేశాడు. అయితే, ఆమె కేవలం స్నేహం మాత్రమేనని, ప్రేమించడం లేదని తేల్చిచెప్పింది. దీంతో మనస్తాపంతో పులిచ్చలూరులోని స్నేహితుడు ముత్తు వద్దకు వచ్చేశాడు. బుధవారం రాత్రి మిత్రుడితో కలిసి మద్యం తాగి కుమరేశ పాండి తన చేతిని కోసుకుని, ఆ రక్తాన్ని ఓ బాటిళ్‌లో నింపేశాడు. దీన్ని గుర్తించిన ముత్తు ఇరుగుపొరుగు వారి సాయంతో క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ తన వద్ద ఉన్న బాటిళ్‌ను ప్రియురాలికి అప్పగించాలని, తన రక్తం ఆమెకు కానుక అంటూ, వైద్యం చేయించుకునేందుకు నిరాకరించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా, చికిత్సకు పాండి సహకరించ లేదు. తీవ్ర రక్త స్త్రావం కావడంతో మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement