మెదక్ జిల్లా జిన్నారం మండలం గుమ్మడిదాల గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది.
ఉరివేసుకుని యువ రైతు ఆత్మహత్య
Sep 19 2016 4:06 PM | Updated on Nov 6 2018 8:04 PM
జిన్నారం : మెదక్ జిల్లా జిన్నారం మండలం గుమ్మడిదాల గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పడాల దాసు(27) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేసిన పంట వర్షాలు లేక ఎండిపోవడంతో సుమారు రూ.8 లక్షల అప్పు అయింది. ఆర్ధిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దాసుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement