నేను జయలలిత చెల్లిని.. | Yes, My Sister's name is Jayalalitha, says sailaja | Sakshi
Sakshi News home page

నేను జయలలిత చెల్లిని..

Jul 4 2014 3:38 AM | Updated on Aug 20 2018 6:18 PM

నేను జయలలిత చెల్లిని.. - Sakshi

నేను జయలలిత చెల్లిని..

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన అక్కని చెబుతూ సుమారు 60 ఏళ్ల శైలజ గురువారం బెంగళూరులో ఓ కన్నడ న్యూస్ ఛానెల్‌లో సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు.

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన అక్కని చెబుతూ సుమారు 60 ఏళ్ల శైలజ గురువారం బెంగళూరులో ఓ కన్నడ న్యూస్ ఛానెల్‌లో సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. తానెలా నిరాదరణకు గురైంది చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. శైలజ చెబుతున్న ప్రకారం..‘అలనాటి నటి సంధ్యారాణి, జయరామన్ దంపతులకు ముగ్గురు సంతానం. జయలలిత పెద్ద కుమార్తె కాగా, నేను, జయకుమార్ మిగిలిన బిడ్డలం.

నేను మూడో నెల గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. నేను జన్మించాక అప్పటి ప్రఖ్యాత కళాకారుడు దామోదర్ పిళైకి దత్తత ఇచ్చారు. సంధ్యారాణి అసలు పేరు వేదమ్మ. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా. మైసూరు సంస్థానాధీశుల ఆశీస్సులతో ఆమె చిత్ర రంగంలోకి ప్రవేశించింది. నేను బెంగళూరులో ఉన్న విషయం అక్కకు తెలుసు. ఆమె అష్టైశ్వర్యాలతో తులతూగుతుంటే, నేను పేదరికంలో మగ్గుతున్నాను’ అని శైలజ చెప్పుకొచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement