అంత్యక్రియలకు వెళ్తూ.. | women killed in road accident | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు వెళ్తూ..

Oct 29 2016 4:14 PM | Updated on Aug 30 2018 4:10 PM

అంత్యక్రియలకు వెళ్తూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది.

కొత్తూరు: అంత్యక్రియలకు వెళ్తూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని మండల కేంద్రం సమీపంలోని కొత్తూరు పారిశ్రామికవాడ సమీపంలో పాత జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... షాద్‌నగర్ పట్టణానికి చెందిన ఫయాజోద్దీన్(45) అతడి భార్య ఫాతీమా(40)లు ఇద్దరు బైకుపై హైదరాబాద్ లో తమ బంధువుల అంత్యక్రియలకు బయలుదేరారు. కాగా మార్గమధ్యలో పారిశ్రామికవాడ సమీపంలోకి రాగానే బైకు అదుపుతప్పడంతో ఫాతిమా కిందపడి పోయింది. అదే సమయంలో వెనకాల నుండి వేగంగా వస్తున్న లారీ ఆమెపై నుండి వెళ్ళడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement