రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపాలెం వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
Mar 17 2017 11:46 AM | Updated on Aug 30 2018 4:10 PM
రామచంద్రాపురం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపాలెం వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఎన్ ఆర్ కంపల్లి గ్రామానికి చెందిన హంస(48) రోడ్డు మీద నుంచి వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి అతని స్కూటర్‌పై రామచంద్రాపురం వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో వాహనం పై నుంచి ఎగిరి పడిన ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. వాహనం నడుపుతున్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Advertisement


