వివాహిత ఆత్మహత్య | women commits suicide in karim nagar | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Feb 16 2017 11:05 AM | Updated on Sep 5 2017 3:53 AM

వివాహిత కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని మృతి చెందింది.

మేడిపల్లి: వివాహిత కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని మృతి చెందింన సంఘటన కరీంనగర్‌ జిల్లా మేడిపల్లి మండలం పసునూర్‌ గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కొప్పుల రాజేశం, లత దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన లత ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement