రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | Woman killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Oct 13 2016 8:43 AM | Updated on Oct 20 2018 6:04 PM

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

 శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన తేజ(35), ఆమె తమ్ముడు అభిలాష్(30) నెల్లూరు సింహపురి ఆస్పత్రిలో ఉన్న తమ తల్లికి సాయంగా ఉన్నారు. గురువారం ఉదయం వారు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తుండగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తేజ అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన అభిలాష్‌ను వెంటనే 108లో సింహపురి ఆస్పత్రికి తరలించారు. నార్త్ ట్రాఫిక్ ఎస్సై కొండయ్య ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement