దంపతుల ట్రాప్‌లో దర్శకుడు 'తేజ' కుమారుడు! | Film Director Teja son Case against 2 stockbrokers | Sakshi
Sakshi News home page

దంపతుల ట్రాప్‌లో దర్శకుడు 'తేజ' కుమారుడు!

Jan 23 2026 7:23 AM | Updated on Jan 23 2026 7:25 AM

Film Director Teja son Case against 2 stockbrokers

టాలీవుడ్‌ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్‌ తేజ  ఒక జంట చేతిలో మోసపోయాడు. హైదరాబాద్‌లోని మోతీ నగర్‌కు చెందిన ఆ జంట స్టాక్‌ మార్కెట్‌ పేరుతో అమితవ్‌ను మోసం చేసింది. ట్రేడింగ్‌ పేరుతో లాభాలను వచ్చేలా చేస్తామని చెప్పి తనను మోసం చేసినట్లు స్థానిక కోర్టును ఆయన ఆశ్రయించాడు. కొద్దిరోజుల క్రితమే జరిగిన ఈ ఘటన తాజాగా నెట్టింట వైరల్‌ అవుతుంది.

అధిక లాభాలు వస్తాయని అమితవ్‌కు ఆశ చూపి అతని నుంచి రూ. 63లక్షలు కాజేశారని ఆ దంపతులపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వ్యాపారవేత్తగా రాణిస్తున్న అమితవ్‌ తేజకు గతేడాది ఏప్రిల్‌లో  యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్‌ దంపతులతో  పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక  లాభాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. తాము చెప్పినట్లు నష్టం వస్తే తమకు చెందిన అపార్ట్‌మెంట్‌లోని  ఫ్లాట్‌ను ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో ఆ దంపతుల మాటలను నమ్మి అమితవ్‌ పెట్టుబడులు పెట్టారు. 

అయితే, ఒక వారం తర్వాత వారి ప్లాన్‌ను అమలు చేశారు.  రూ. 9 లక్షలు లాభం వచ్చిందని కొన్ని నకిలీ పత్రాలను చూపించి నమ్మించారు. దీంతో పలు దపాలుగా రూ.63 లక్షలు వారికి ఇచ్చారు. అయితే, కొన్ని నెలల తర్వాత తన డబ్బుకు సంబంధించి ఎలాంటి లాభాలు రావడం లేదని అమితవ్‌ గ్రహించారు. తనకు సంబంధించిన అసలు కూడా వారు తిరిగి ఇవ్వలేదు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement