ఆ పరిహారమే అందలేదు | We did not receive the compensation | Sakshi
Sakshi News home page

ఆ పరిహారమే అందలేదు

Apr 19 2016 2:47 AM | Updated on Sep 3 2017 10:11 PM

కరువు పర్యటనలో భాగంగా సోమవారం విజయపుర జిల్లాలోని ఇండి తాలూకాకు చేరుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది.

బెంగళూరు: కరువు పర్యటనలో భాగంగా సోమవారం విజయపుర జిల్లాలోని ఇండి తాలూకాకు చేరుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. కరువు పరిహారం తమకు సరిగా అందండం లేదని, తాగేందుకు మంచినీళ్లు సైతం అందని పరిస్థితి ఏర్పడిందని, అధికారుల నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణమంటూ స్థానిక రైతులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ముట్టడించారు. ప్రస్తుత కరువు పరిహారం సంగతి అటుంచితే గత ఏడాది కురిసిన వడగళ్ల వానకు సంబంధించిన పరిహారం కూడా ఇప్పటి వరకు అందలేదంటూ రైతులు సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన  సిద్ధరామయ్య అక్కడే ఉన్న అధికారులపై మండిపడ్డారు. ‘ఏంటయ్యా ఇదంతా, ఎందుకని రైతులకు పరిహార ధనం అందించలేదు. కరువు నివారణ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నీ ఏమవుతున్నాయి’ అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి సమాధానం ఇవ్వడంలో అధికారులు తత్తరపాటుకు గురయ్యారు. దీంతో ‘మీరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు


ముందు రైతులకు పరిహార ధనం అందేలా తక్షణమే చర్యలు తీసుకోండి’ అని ఆదేశించారు. ముఖ్యమంత్రి భరోసాతో సంతృప్తి చెందని రైతులు తమకు పరిహారం అందే వరకు సీఎంను కదలనివ్వబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీంతో పోలీసులు కల్పించుకొని రైతులను పక్కకు తప్పించి, సీఎం కాన్వాయ్ వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. అనంతరం అథర్గ చెక్‌డ్యామ్‌ను సీఎం పరిశీలించారు. చెక్‌డ్యామ్ పక్కనే నీరు లేక ఎండిపోయిన నిమ్మతోటను పరిశీలించారు. కాగా, అంతకుముందు విజయపురలోని ప్రభుత్వ అతిథి గృహంలో సీఎం సిద్ధరామయ్య జనతా దర్శన నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలపై వినతి పత్రాలను అందుకున్నార

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement