లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో | vro caught by acb, while taking bribe from the farmer | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో

Aug 19 2016 1:51 PM | Updated on Oct 1 2018 2:44 PM

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో - Sakshi

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో

రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు.

రాజాం(శ్రీకాకుళం): రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు అడంగళ్ పహాణీ కోసం కొద్ది రోజులుగా వీఆర్వో చింత కృష్ణ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, వీఆర్వో మాత్రం రూ.5 వేలు ఇస్తేనే పని అవుతుందని చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోని కొల్లివీధిలో రైతు వీఆర్వోకు రూ.4 వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement