ఇళయదళపతి విజయ్‌కు లక్షలాది మంది అభిమానులున్నారు.
తమిళసినిమా: ఇళయదళపతి విజయ్‌కు లక్షలాది మంది అభిమానులున్నారు. అందులో ఒకరు అర్చన. స్థానిక కోడంబాక్కం రంగరాజపురంలో నివసిస్తున్న అర్చన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలోఆమె తన అభిమాన నటుడు విజయ్‌ను చూడాలని ఆశపడ్డారు.
"ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు ఆ ప్రాంతంలోని విజయ్ అభిమానులకు చె ప్పగా అది విజయ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన వెంటనే అర్చన ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. దీంతో అర్చన చాలా సంబరపడిపోయారు. అర్చన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని విజయ్ ఆమె తల్లిదండ్రులకు చెప్పి కాసేపు వారితో గడిపి వెళ్లారు.