కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం | ts-new-mlcs-sworn-in-to-thursday | Sakshi
Sakshi News home page

కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Mar 30 2017 1:41 PM | Updated on Sep 5 2017 7:30 AM

కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొత్త ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

హైదరాబాద్‌: ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొత్త ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, గంగాధర్‌గౌడ్‌, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు. వారిచేత మండలి చైర‍్మన్‌  స్వామిగౌడ్‌ ప్రమాణస్వీకారం చేయించారు.
 
ఉపాధ్యాయ నియోజకవర్గం (మహబూబ్‌ నగర్‌– హైదరాబాద్‌– రంగారెడ్డి) నుంచి విజయం సాధించిన పీఆర్టీయూ నేత కాటేపల్లి జనార్దన్‌రెడ్డి రెండో మారు కౌన్సిల్‌లో అడుగుపెట్టనున్నారు. అలాగే గతంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీ వి.గంగాధర్‌ గౌడ్‌ కూడా రెండో సారి కౌన్సిల్‌కు వెళుతున్నారు. కాగా, పార్టీ సీనియర్‌ నాయకుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మరో నేత మైనంపల్లి హన్మంతరావు తొలి సారి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

 

Advertisement
 
Advertisement
Advertisement