విజయనగరం: శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆదివారం విజయనగరంలోని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల మండలి సమావేశాల్లో అస్వస్థతకు గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బొత్సను ఎమ్మెల్సీలు పరామర్శించి.. ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
బొత్సను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి, డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, పాలవలస విక్రాంత్, కుంభా రవిబాబు, టి.మాధవరావు, కేఆర్‌జే.భరత్, రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయెల్, రుహుల్లా, సిపాయి సుబ్రమణ్యం, పి.చంద్రశేఖర్‌రెడ్డి, నర్తు రామారావు, ఇందుకూరి రఘురాజు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు తదితరులున్నారు.


