నేలపై కూర్చుని వైఎస్సార్‌సీపీ నేతల నిరసన | Ysrcp Leaders Protest At Mangalagiri Education Department Office | Sakshi
Sakshi News home page

నేలపై కూర్చుని వైఎస్సార్‌సీపీ నేతల నిరసన

May 27 2026 3:39 PM | Updated on May 27 2026 3:55 PM

Ysrcp Leaders Protest At Mangalagiri Education Department Office

సాక్షి, అమరావతి: మంగళగిరి విద్యాశాఖ కార్యాలయం దగ్గర వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. నేలపై కూర్చుని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీల ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు చెప్పని అధికారులు.. అంతా సక్రమంగా ఉన్నట్టు బుకాయించారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘‘అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి ర్యాంకు వచ్చింది నిజామా? కాదా?. మెరిట్‌ లిస్ట్‌లు ఎందుకు బయటపెట్టడం లేదు? అంటూ నిలదీసిన వైఎస్సార్‌సీపీ నేతలు.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement