సోనియా... దేశద్రోహి కుమార్తె | Traitor's daughter, Sonia ... | Sakshi
Sakshi News home page

సోనియా... దేశద్రోహి కుమార్తె

Apr 6 2014 5:14 AM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియా... దేశద్రోహి కుమార్తె - Sakshi

సోనియా... దేశద్రోహి కుమార్తె

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఓ దేశద్రోహి కుమార్తె అని మాజీ మంత్రి రాందాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. మైసూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

సాక్షి,బెంగళూరు:  ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఓ దేశద్రోహి కుమార్తె అని మాజీ మంత్రి రాందాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. మైసూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ తండ్రి ఇటలీ సైన్యంలో పనిచేసే సమయంలో ఆ దేశ రక్షణ విభాగానికి చెందిన రహస్యాలను ఇతర దేశాలకు డబ్బు కోసం విక్రయించారని ఆరోపించారు.   

అటువంటి వ్యక్తి కుమార్తె దేశంలోని ఓ పార్టీ ఉన్నత స్థానంలో ఉండటం సరికాదని అభిప్రాయపడ్డారు.  తాను ప్రత్యక్షరాజకీయాల నుంచి దూరంగా ఉన్నంత మాత్రాన ఇతర పార్టీ నాయకులకు మద్దతు ఇస్తున్నట్లు కాదన్నారు. ఈ విషయంలో కొంతమంది నాయకులు ప్రజలను, కార్యకర్తలను అనవసరంగా గందరగోళానికి గురిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

తనకు రాజకీయ జీవితం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ తల్లితో సమానమన్నారు. అందువల్ల రాజకీయాల్లో కొనసాగితే అది బీజేపీతో మాత్రమేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీల్లో చేరే అవకాశం లేదన్నారు. ఇదిలా ఉండగా సోనియగాంధీపై తన వాఖ్యల పట్ల రాందాస్ విషాదం వ్యక్తం చేశారు. ఆవిధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement