రాంసాన్‌పల్లిలో ఉద్రిక్తత | Tension in ransanpalli | Sakshi
Sakshi News home page

రాంసాన్‌పల్లిలో ఉద్రిక్తత

Oct 12 2016 11:56 AM | Updated on Sep 4 2017 5:00 PM

మెదక్ జిల్లా ఆందోల్ మండలం రాంసాన్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

మెదక్ జిల్లా ఆందోల్ మండలం రాంసాన్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గ్రామానికి చెందిన అనసూయ(28) మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా చనిపోయింది. ఇందుకు ఆమె భర్త సుకుమారే కారణమని ఆరోపిస్తూ బంధువులు అతడిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారించబోయారు. అయితే, తీవ్ర ఆగ్రహంతో ఉన్న బంధువులు ఎస్సై, హోంగార్డులపై కూడా దాడి చేశారు. ఈ పరిణామంతో గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement