భువనగిరిలో నిలిచిపోయిన రైళ్లు | technical problem in LTT train | Sakshi
Sakshi News home page

భువనగిరిలో నిలిచిపోయిన రైళ్లు

Apr 10 2017 3:54 PM | Updated on Sep 5 2017 8:26 AM

యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి వద్ద ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ముంబయి ఎల్‌టీటీ రైలు నిలిచిపోయింది.

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి వద్ద ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ముంబయి ఎల్‌టీటీ రైలు నిలిచిపోయింది. దీంతో భువనగిరి రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. రాజధాని, గోల్కొండ సహా మరో రైలు నిలిచిపోయింది. రెండు గంటలుగా రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైలులో సాంకేతిక లోపాన్ని అరగంటలో సరిదిద్దుతామని సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. ఆ వెంటనే రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement