వ్యభిచారానికి పాల్పడిన సహాయ నటి అరెస్ట్ | Tamil film assistant actresses arrested for prostitution | Sakshi
Sakshi News home page

వ్యభిచారానికి పాల్పడిన సహాయ నటి అరెస్ట్

May 20 2014 9:07 AM | Updated on Aug 20 2018 4:44 PM

వ్యభిచారానికి పాల్పడిన సహాయ నటి అరెస్ట్ - Sakshi

వ్యభిచారానికి పాల్పడిన సహాయ నటి అరెస్ట్

చెన్నై చూలైలో వ్యభిచారానికి పాల్పడిన సహాయ నటిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై చూలై అవధాన పాప్పయ్యార్ వీధిలో బహుళ అంతస్తు భవనం ఉంది.

చెన్నై చూలైలో వ్యభిచారానికి పాల్పడిన సహాయ నటిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై చూలై అవధాన పాప్పయ్యార్ వీధిలో బహుళ అంతస్తు భవనం ఉంది. ఈ భవనంలో గౌరి (35) ఇటీవలి కాలం నుంచి అద్దెకు ఉంటోంది.  తాను సహాయ నటిగా చిత్రాలలో నటించడమే కాకుండా సినిమాలో నటించేందుకు వ్యక్తులను ప్రొత్సహిస్తున్నట్లు స్థానికంగా పలువురికి ఆమె తెలిపింది. ఆమె ఉంటున్న ఇంటికి రాత్రి సమయంలో ఎక్కువ సంఖ్యలో మగవాళ్లు వచ్చి వెళ్లేవారు. దీన్ని అక్కడున్న వారు గమనించారు.

 

సందేహం కలిగి పోలీసులకు రహస్యంగా సమాచారం అందించారు. వెప్పేరి పోలీసు ఇన్‌స్పెక్టర్ ప్రభు నేతృత్వంలో పోలీసులు ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలిసింది. అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ యువతిని దీనికి పావుగా వాడుతున్నట్టు వెల్లడైంది. ఈ వృత్తిని చేపడుతు న్న గౌరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ. కన్నడ చిత్రాల్లో సహాయ నటిగా ఉంటున్నట్టు తెలిసింది. సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement