చెరువులో మునిగి చిన్నారుల మృతి | Swimming in pond three child died visakha district | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి చిన్నారుల మృతి

Sep 7 2016 4:03 PM | Updated on Sep 4 2017 12:33 PM

చెరువు గట్టుపై ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు.

అరకులోయ: చెరువు గట్టుపై ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. ఈ సంఘటన విశాఖజిల్లా అరకులోయలోని నందివలస గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. 
 
స్థానిక అంగన్‌వాడీలో చదువుకుంటున్న ముగ్గురు చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తూ.. మార్గమధ్యంలోని చెరువులో పడి మృతిచెందారు. కాగా.. చిన్నారులు గట్టుపై ఆడుకుంటూ వెళ్లి నీటిలో మునిగి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన చిన్నారుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement