మాకిచ్చే గౌరవం ఇదేనా? | Senior Visakha TDP Leaders Unhappy | Sakshi
Sakshi News home page

మాకిచ్చే గౌరవం ఇదేనా?

Published Thu, Jun 13 2024 9:34 PM | Last Updated on Thu, Jun 13 2024 9:39 PM

 Senior Visakha TDP Leaders Unhappy

కొలువు దీరిన కొత్త మంత్రి వర్గంలో ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతలకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన వారిని పక్కన పెట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒక్కరినే మంత్రి పదవికి ఎంపిక చేయడంపై సీనియర్ నేతలు మండిపడుతున్నారు.. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు పై చంద్రబాబుకు ఉన్న గౌరవం ఇదేనా అంటూ తమ అనుచరులు వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

మంత్రివర్గ కూర్పుపై ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. కొత్తగా ఎంపిక చేసిన మంత్రివర్గ జాబితాలో తమ పేర్లు లేకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రులు అయ్యన్న, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి మంత్రి పదవులు ఆశించారు.. మీరు కాకుండా వెలగపూడి రామకృష్ణ బాబు గణబాబు పల్లా శ్రీనివాస్ ఈసారి తమకు మంత్రి పదవి లభిస్తుందని భావించారు.. వీరిని ఎవరిని కాదని జూనియర్ అయినా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవిని చంద్రబాబు కట్టబెట్టారు.

అయ్యన్న ఒకసారి ఎంపీ ఏడుసార్లు ఎమ్మెల్యేగా మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.. గంటా  ఒకసారి ఎంపీ 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బండారు సత్యనారాయణ మూర్తి కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.. గతంలో మంత్రిగా పనిచేశారు.. వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఈసారి మంత్రివర్గ జాబితాలో తమకు స్థానము లభిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.. వీరందరి ఆశలపైన చంద్రబాబు నీళ్లు జల్లారు.. అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద అయితే టిడిపి కార్యకర్తలు కాబోయే మంత్రి అయ్యన్నపాత్రుడు కి శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు..

పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ తరపున వాయిస్ వినిపించింది అయ్యన్న పాత్రుడని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు.. చంద్రబాబు లోకేష్ మాటలు విని ఆయన కేసులు కూడా పెట్టించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.. పార్టీలో సీనియర్ నేత అయిన అయ్యన్నకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. బండారు సత్యనారాయణమూర్తి అయితే పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాలను జనసేనకు విడిచిపెట్టామని గుర్తు చేస్తున్నారు.

పొత్తులో భాగంగా తమ సొంత నియోజకవర్గలను వదిలి పక్క నియోజకవర్గాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.. పార్టీ కోసం త్యాగాలు చేసిన తాము చంద్రబాబుకు ఎందుకు గుర్తు రాలేదంటున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టడమేంటని మండిపడుతున్నారు.. కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఆశించి గంటా శ్రీనివాసరావు బంగపడ్డారు. గంటను కాదని తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి కట్టబెట్టారు.. 24 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే అందులో ఎంతమంది సీనియర్లకు అవకాశం కల్పించారని మంత్రివర్గంలో స్థానం లభించని నేతలు అంటున్నారు. చంద్రబాబు మంత్రివర్గ కూర్పును సొంత పార్టీ నేతలే హర్షించని పరిస్థితి ఉమ్మడి విశాఖ జిల్లాలో నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement