breaking news
three child died
-
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
సంగారెడ్డి, సాక్షి: అమీన్పూర్ చిన్నారుల మృతి కేసు(Ameenpur Children Death Case)లో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే ముగ్గురు పిల్లలను కన్నతల్లి రజితనే కడతేర్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో మొదట భర్త చెన్నయ్యపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తులో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Rajitha) కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం.రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూయగా.. భర్త చెన్నయ్యకు అనుమానం రావొద్దని కడుపు నొప్పి నాటకం ఆడి ఆస్పత్రిలో చేరిందామె. -
అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతి
-
చెరువులో మునిగి చిన్నారుల మృతి
అరకులోయ: చెరువు గట్టుపై ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. ఈ సంఘటన విశాఖజిల్లా అరకులోయలోని నందివలస గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక అంగన్వాడీలో చదువుకుంటున్న ముగ్గురు చిన్నారులు అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తూ.. మార్గమధ్యంలోని చెరువులో పడి మృతిచెందారు. కాగా.. చిన్నారులు గట్టుపై ఆడుకుంటూ వెళ్లి నీటిలో మునిగి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన చిన్నారుల వివరాలు తెలియాల్సి ఉంది. -
చెరువులో మునిగి చిన్నారుల మృతి
కాటేదాన్: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లిలోని ఉందాసాగర్ చెరువులో దిగిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందగా, మరొక బాలుడు గల్లంతయ్యాడు. లక్ష్మీగూడ వాంబే కాలనీకి చెందిన ప్రశాంత్ (11), సోదరులైన చాంద్‌బాషా (11), సమీర్ (7) సోమవారం సాయంత్రం చెరువులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో ముగ్గురూ గల్లంతయ్యారు. పోలీసులు ఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. దీంతో సోమవారం రాత్రి చాంద్‌బాషా మృతదేహాన్ని బయటకు తీశారు. మంగళవారం ఉదయం ప్రశాంత్ మృతదేహం లభ్యమైంది. సమీర్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.