నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ జడ్జి నాగరాజు ఇంట్లో దొంగలు పడి బీభత్పం సృష్టించారు.
సివిల్ జడ్జి ఇంట్లో చోరీ
Sep 6 2016 10:53 AM | Updated on Aug 30 2018 5:27 PM
మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ జడ్జి నాగరాజు ఇంట్లో దొంగలు పడి బీభత్పం సృష్టించారు. జడ్జి కుటుంబసభ్యులు ఊరు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు మిర్యాలగూడ పోలీసులు క్లూస్ టీమ్‌తో చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. జడ్జికి సమాచారం ఇచ్చారు. జడ్జి కుటుంబసభ్యులు వస్తేకాని ఎంతమేర చోరీ జరిగిందనే విషయం తెలియదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


