రిలయన్స్ మార్ట్‌కు నిప్పుపెట్టిన దుండగులు | robbery attempt at reliance mart in tirupati | Sakshi
Sakshi News home page

రిలయన్స్ మార్ట్‌కు నిప్పుపెట్టిన దుండగులు

Dec 30 2016 7:04 AM | Updated on Oct 4 2018 8:38 PM

రిలయన్స్ మార్ట్‌లో కొందరు గుర్తుతెలియని దుండగులు దోపిడీకి యత్నించారు.

తిరుపతి: రిలయన్స్ మార్ట్‌లో కొందరు గుర్తుతెలియని దుండగులు దోపిడీకి యత్నించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న రిలయన్స్ మార్ట్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. అయితే మార్ట్‌లో అలారం మోగడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేయడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement