జనాలపైకి దూసుకెళ్లిన లారీ | road accident in krishna district, nuziveedu | Sakshi
Sakshi News home page

జనాలపైకి దూసుకెళ్లిన లారీ

Nov 10 2016 6:10 AM | Updated on Apr 3 2019 7:53 PM

జనాలపైకి దూసుకెళ్లిన లారీ - Sakshi

జనాలపైకి దూసుకెళ్లిన లారీ

కృష్ణాజిల్లా నూజివీడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

నూజివీడు(కృష్ణాజిల్లా): కృష్ణాజిల్లా నూజివీడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా నూజివీడు మండలం తుక్కులూరు వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాలు.. నూజివీడు పట్టణంలోని స్టేషన్‌తోటకు చెందిన 20 మంది కూలీలు గబ్బల మంగమ్మ తల్లి దేవస్థానంకు బయలు దేరారు. రెండు టాటా ఏస్‌లలో బయలుదేరిన వీరు తుక్కులూరు సమీపంలోకి చేరుకోగానే ఓ టాటాఏస్ వాహనం టైర్ బోల్టు విరిగి పోయింది. ఇది గుర్తించిన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి టైర్ మార్చడానికి యత్నిస్తుండగా.. మరో వాహనం కూడా అక్కడికి చేరుకుంది. రెండు వాహనాల్లో ఉన్న సుమారు 20 మంది రోడ్డు పైన నిల్చొని ప్రత్యామ్నయ వాహనం కోసం ప్రయత్నిస్తుండగా.. నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.




 

Advertisement
 
Advertisement
Advertisement