నాలాల ఆక్రమణల తొలగింపు షురూ | removal-of-encroachment-on-nallah | Sakshi
Sakshi News home page

నాలాల ఆక్రమణల తొలగింపు షురూ

Sep 26 2016 2:26 PM | Updated on Sep 4 2018 5:24 PM

నగరంలో ఎడతెగని వానలు సృష్టించిన విలయంపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.

హైదరాబాద్: నగరంలో ఎడతెగని వానలు సృష్టించిన విలయంపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. వర్షం తెరపి ఇవ్వటంతో సోమవారం అక్రమ నిర్మాణాలు, నాలాల ఆక్రమణలపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. శేరిలింగంపల్లి మండలం పరిధిలోని మురుగు కాల్వలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగింపు చేపట్టారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల అధికారులతో 24 బృందాలు ఏర్పాటయ్యాయి.
 
ముందుగా మదీనగూడ రామకృష్ణ నగర్‌లో నాలాను ఆక్రమించి నిర్మించిన అపార్టుమెంట్ ప్లేగ్రౌండ్ ఏరియాను డిమాలిషన్ బృందం తొలగించింది. అదేవిధంగా గచ్చిబౌలి నుంచి కొత్తగూడ వరకు ఉన్ననాలాపై ఆక్రమణలను ధ్వంసం చేస్తోంది. అలాగే, కాప్రా, ఉప్పల్‌లో కూడా నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను  తొలగించే పనిలో అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement