ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌ | redsander smugglers arrested in tirupathi | Sakshi
Sakshi News home page

ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌

Jan 10 2017 4:21 PM | Updated on Aug 20 2018 7:27 PM

ఎర్రచందనం, శ్రీ గంధం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు.

తిరుపతి: ఎర్రచందనం, శ్రీ గంధం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. శేషాచలం అడవుల్లో ముగ్గురు తమిళ స్మగ్లర్లను అరెస్టు చేశామని, వారి నుంచి రూ. 80 లక్షల విలువ చేసే 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఏపీ రెడ్‌ శాండల్‌ యాంటీ స్మగ్లింగ్‌ టాస్క్‌ఫోర్సు డీఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. అలాగే రాగిమానుకుంట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న గౌస్‌ బాషా, శివ అనే స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు, వారి నుంచి మూడు ఎర్ర చందనం, ఏడు శ్రీగంధపు దుంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రెండు ఘటనల్లో పోలీసులకు చిక్కకుండా 20 మంది స్మగ్లర్లు తప్పించుకున్నారని, వారికోసం కూంబింగ్‌ కొనసాగుతోందని ఆయన చెప్పారు

Advertisement
 
Advertisement
Advertisement