తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని కలిసేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
అసెంబ్లీలో రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు
Mar 23 2017 2:43 PM | Updated on Aug 21 2018 7:53 PM
హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని కలిసేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ లాబీలోకి వెళ్ళకుండా రేవంత్ రెడ్డిని అడ్డుకోవడంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆయనకు మద్ధతు తెలిపారు. రేవంత్ రెడ్డి ఏమైనా నేరస్తుడా అని సిబ్బందిని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్ మార్షల్ ఆదేశాల మేరకే అడ్డుకున్నామని కిషన్‌రెడ్డికి సిబ్బంది తెలియజేశారు.
Advertisement
Advertisement