వేశ్యవాటికపై దాడి, బంగ్లాదేశ్ యువతికి విముక్తి | Police raids Brothel House at Bangalore | Sakshi
Sakshi News home page

వేశ్యవాటికపై దాడి, బంగ్లాదేశ్ యువతికి విముక్తి

Jun 28 2014 8:50 AM | Updated on Sep 17 2018 6:26 PM

బెంగళూరు సీసీబీ పోలీసులు వేశ్యవాటికపై దాడులు నిర్వహించి వ్యభిచార కూపంలో మగ్గుతున్న బంగ్లాదేశ్ యువతికి విముక్తి కల్పించారు.

భూపసంద్ర మెయిన్ రోడ్డు, వినాయక లేఔట్‌లోని అద్దె ఇంటిలో నిర్వహిస్తున్న వేశ్యవాటికపై బెంగళూరు సీసీబీ పోలీసులు దాడులు నిర్వహిం చి వ్యభిచార కూపంలో మగ్గుతున్న బంగ్లాదేశ్ యువతికి విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా వేశ్యవాటిక నిర్వాహకుడైన మండ్య జిల్లా కిక్కేరి తాలూకా కళ్లేనహళ్లి గ్రామానికి చెందిన యశ్వంత్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు.

 

నిందితుడు ఇతర ప్రాంతాలనుంచి విటులను ఆకర్షించి వేశ్యవాటిక నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. యువతిని మహిళా శిశు సంక్షేమశాఖకు అప్పగించి నిందితుడిపై  సంజయ్‌నగర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement