జయ మృతిపై..పన్నీర్‌ దీక్ష | panneerselvam started Inmates | Sakshi
Sakshi News home page

జయ మృతిపై..పన్నీర్‌ దీక్ష

Mar 8 2017 11:00 AM | Updated on Sep 5 2017 5:33 AM

జయలలిత మృతిపై న్యాయ, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం బుధవారం ఉదయం చెన్నైలో నిరాహారదీక్ష దిగారు.

చెన్నై: జయలలిత మృతిపై న్యాయ, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం బుధవారం ఉదయం చెన్నైలో నిరాహారదీక్ష దిగారు. ఆయనతోపాటు ఆయన వర్గ పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేపట్టారు. జయలలిత మరణానంతరం శశకళ వర్గం నుంచి బయటకు వచ్చిన పన్నీరుసెల్వం ఆమెపై తవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న ఆయన రాష్ట్రవ్యాప్త మద్దతును కూడగడుతున్నారు. తదనుగుణంగా  జయ మృతిపై అనుమానాలను లేవనెత్త మృతిపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తన వర్గీయులతో స్థానిక చెన్నైలోని రాజారత్నం స్టేడియంలో నిరాహారదీక్ష చేపట్టారు. సాయంత్రం ఐదు వరకు కొనసాగే తమ దీక్ష ద్వారా జయ మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా విచారణ ఉండాలని, ఈ దీక్ష చేస్తున్నామని పన్నీరుసెల్వం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement