గిన్నీస్‌ రికార్డు బద్దలు | Odisha's Manoj Maharana enters Guinness World Records | Sakshi
Sakshi News home page

గిన్నీస్‌ రికార్డు బద్దలు

Nov 20 2017 1:30 PM | Updated on Nov 20 2017 1:30 PM

Odisha's Manoj Maharana enters Guinness World Records - Sakshi

భువనేశ్వర్‌: రాష్ట్రానికి చెందిన యువకుడు గిన్నీస్‌ రికార్డు బద్దలు కొట్టాడు. ఒకేసారి 459 గొట్టాల్ని దంతాలు మధ్య బిగించి సరికొత్త రికార్డు నెలకొలిపాడు. గంజాం జిల్లా పొలొసొరా సమితి భాబొరొడా గ్రామస్తుడు మనోజ్‌ మహరణ ఈ రికార్డు సాధించాడు. 10 సెకన్లపాటు 459 గొట్టాల్ని దంతాలు మధ్య బిగించి పాత రికార్డుని బద్దలుకొట్టాడు. జర్మనీ యువకుడు సైమన్‌ ఎల్‌మోర్‌ ఈ రంగంలో తొలి గిన్నీస్‌ రికార్డు సాధించాడు. ఆయన 400 గొట్టాల్ని మాత్రమే నోట బిగించి రికార్డు సాధించాడు.

అధికంగా మరో 59 గొట్టాలతో రాష్ట్ర యువకుడు ఈ రికార్డుని అధిగమించడం విశేషం. గొట్టాల్ని నోట బిగించేందుకు చేతుల్ని వినియోగించకుండా కసరత్తు చేయడం దీనిలో అత్యంత కీలకంగా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. గొట్టాల్ని కట్టగట్టేందుకు రబ్బర్లు వినియోగించేందుకు అనుమతిస్తారు. మనోజ్‌ మహరణ లోగడ పలు విన్యాసాలు ప్రదర్శించాడు. ఒకేసారి వెలిగించిన 21 కొవ్వొత్తుల్ని నోటపట్టుకుని ఔరా అనిపించాడు. ఈ ఏడాది మే 23వ తేదీన స్థానిక సబ్‌–కలెక్టరు సమక్షంలో ఈ ప్రదర్శన చేసి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. అంతకు ముందు 90 ద్రాక్ష పండ్లని ఒకేసారి నోటిలో పెట్టుకుని అబ్బురపరిచాడు. ఇలా అంచెలంచెలుగా ఎదిగి గిన్నీస్‌ పాత రికార్డుని అధిగమించేందుకు కృషి చేసినట్టు కొనియాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement